Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

దేశంలోనే మొట్టమొదటి హైడ్రోజన్ ట్రక్ ట్రయల్స్‌తో టాటా మోటార్స్

Advertiesment
TATA truck

ఐవీఆర్

, మంగళవారం, 4 మార్చి 2025 (21:50 IST)
2070 నాటికి నికర-సున్నా ఉద్గారాలను సాధించాలనే భారతదేశ దార్శనికత దిశగా ఒక మైలురాయి అభివృద్ధిలో, దేశంలో అతిపెద్ద వాణిజ్య వాహన తయారీదారు టాటా మోటార్స్, హైడ్రోజన్-శక్తితో నడిచే హెవీ-డ్యూటీ ట్రక్కుల మొట్టమొదటి ట్రయల్స్‌ను ప్రారంభించింది. సుస్థిరమైన సుదూర కార్గో రవాణా వైపు ఒక ముఖ్యమైన అడుగును సూచించే ఈ చారిత్రాత్మక ట్రయల్‌ను కేంద్ర రోడ్డు రవాణా & రహదారుల మంత్రి శ్రీ నితిన్ గడ్కరీ, కేంద్ర నూతన, పునరుత్పాదక ఇంధన శాఖ మంత్రి శ్రీ ప్రహ్లాద్ జోషి జెండా ఊపి ప్రారంభించారు. టాటా మోటార్స్ ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ శ్రీ గిరీష్ వాఘ్, భారత ప్రభుత్వ, రెండు కంపెనీల నుండి ఇతర ప్రముఖ ప్రతినిధులు పాల్గొన్నారు.
 
ఈ మార్గదర్శక చొరవ ద్వారా, టాటా మోటార్స్ భారతదేశ విస్తృత గ్రీన్ ఎనర్జీ లక్ష్యాలకు అనుగుణంగా సుస్థిర మొబిలిటీ పరిష్కా రాలలో ముందంజలో ఉండటానికి తన నిబద్ధతను నొక్కి చెబుతుంది. ఈ ట్రయల్ కోసం దీనికి టెండర్ లభించింది. దీనికి నేషనల్ గ్రీన్ హైడ్రోజన్ మిషన్ కింద కేంద్ర నూతన, పునరుత్పాదక ఇంధన మంత్రిత్వ శాఖ నిధులు సమకూరుస్తుంది. సుదూర రవాణా కోసం హైడ్రోజన్ ఆధారిత వాహనాలను ఉపయోగించడంలో వాస్తవ-ప్రపంచ వాణిజ్యీకరణ సాధ్యతను అంచనా వేయడంలో, వాటి సజావైన కార్యకలాపాల కోసం అవసరమైన ఎనేబుల్ మౌలిక సదుపాయాలను ఏర్పాటు చేయడంలో ఇది ఒక ముఖ్యమైన ముందడుగును సూచిస్తుంది.
 
ఈ ట్రయల్ దశ 24 నెలల వరకు ఉంటుంది. వివిధ కాన్ఫిగరేషన్లు, పేలోడ్ సామర్థ్యాలతో 16 అధునాతన హైడ్రోజన్-శక్తితో నడిచే వాహనాలను ఈ ట్రయల్‌లో ఉపయోగిస్తారు. కొత్త తరపు హైడ్రోజన్ ఇంటర్నల్ కంబషన్ ఇంజన్లు (H2-ICE), ఫ్యూయల్ సెల్ (H2-FCEV) సాంకేతికతలతో కూడిన ఈ ట్రక్కులు, ముంబై, పుణె, దిల్లీ-ఎన్సీఆర్, సూరత్, వడోదర, జంషెడ్‌పుర్, కళింగనగర్ చుట్టూ ఉన్న వాటితో సహా భారతదేశంలోని అత్యంత ప్రముఖ సరుకు రవాణా మార్గాల్లో పరీక్షించబడతాయి.
 
ఈ ట్రయల్‌ను ప్రారంభించిన సందర్భంగా భారత ప్రభుత్వ రోడ్డు రవాణా, రహదారుల మంత్రి శ్రీ నితిన్ గడ్కరీ మాట్లాడుతూ, ‘‘భవి ష్యత్తు ఇంధనం హైడ్రోజన్. ఉద్గారాలను తగ్గించడం, ఇంధన స్వావలంబనను పెంచడం ద్వారా భారతదేశ రవాణా రంగ తీరుతెన్ను లను ఇది మార్చగలదు. దీనికి అంతటి అపారమైన సామర్థ్యం ఉంది. ఇటువంటి కార్యక్రమాలు హెవీ-డ్యూటీ ట్రక్కింగ్‌లో సుస్థిర  చలనశీలతకు మారడాన్ని వేగవంతం చేస్తాయి. సమర్థవంతమైన, తక్కువ-కార్బన్ భవిష్యత్తుకు మనల్ని చేరువ చేస్తాయి. హైడ్రో జన్-శక్తితో నడిచే గ్రీన్, స్మార్ట్ రవాణాను ప్రారంభించే దిశగా ఈ ముఖ్యమైన అడుగులో ముందున్నందుకు టాటా మోటార్స్‌ను అభినందిస్తున్నాను." అని అన్నారు.

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

గెలాక్సీ A56 5G, గెలాక్సీ A36 5Gలను విడుదల చేసిన సామ్‌సంగ్ ఇండియా