తెలంగాణ రాష్ట్రంలోని జగిత్యాల పట్టణంలో భీష్మ నగర్‌కు చెందిన బింగి రాజశేఖర్, సారంగాపూర్ మండలం పెంబట్ల గ్రామానికి చెందిన లాస్యల వివాహం 2014లో జరిగింది. వీరికి ఇద్దరు పిల్లలు ఉన్నారు. అయితే, రాజశేఖర్‌కు కొన్ని రోజుల క్రితం హైదరాబాద్ నగరానికి చెందిన హిజ్రా దీపుతో పరిచయం ఏర్పడి, అది సన్నిహింతగా మారింది. దీంతో గత కొంతకాలంగా వీరిద్దూర సహజీవనం చేస్తున్నట్టు సమాచారం.
దీంతో తీవ్ర మనోవేదనకు గురైన భార్య లాస్య, రెండు రోజుల క్రితం ఆత్మహత్యాయత్నానికి పాల్పడింది. దీన్ని గమనించిన ఆమె కుటుంబ సభ్యులు హుటాహుటిన ఆస్పత్రికి తరలించగా అక్కడ ప్రాణాపాయ స్థితిలో చికిత్స పొందుతోంది. ఈ విషయం తెలిసినప్పటికీ భార్యను చూసేందుకు రాజశేఖర్ వెళ్లేదు.
దీంతో ఆగ్రహించిన కుటుంబ సభ్యులు రాజశేఖర్ - హిజ్రా దీపుల వ్యవహారాన్ని పోలీసులకు చేరవేసి వారిద్దరి కోసం గాలించసాగారు. ఈ క్రమలో రాజశేఖర్ భీష్మ నగర్‌లోని ఓ ఇంటిలో హిజ్రాతో ఉండటాన్ని గమనించి గదికి తాళం వేశారు. ఆ తర్వాత పోలీసులకు సమాచారం అందించగా, వారు వచ్చి దీపు, రాజశేఖర్‌ను అదుపులోకి తీసుకుని ఠాణాకు తరలించారు. ఈ ఘటన జగిత్యాల పట్టణంలో చర్చనీయాంశంగా మారింది.