కరివేపాకుతో చెడు కొవ్వు, రక్తపోటుకి విరుగుడు

కరివేపాకు. ఇందులో ఎన్నో ఔషధ గుణాలు వున్నాయి. దీనిని కూరల్లో సువాసన కోసం మాత్రమే వాడతాము అనుకుంటే చాలా పొరపాటు. చాలామంది కరివేపాకును తినకుండా ప్రక్కకు నెట్టేస్తుంటారు. కాని కరివేపాకులో ఎన్నో ఔషధాలు, పోషకాలు దాగి ఉన్నాయి. అవేంటో తెలుసుకుందాము.

credit: social media and webdunia

కరివేపాకులో శరీరానికి కావలసిన కాల్షియం, ఫాస్పరస్, ఐరన్, యాంటీ ఆక్సిడెంట్లు, విటమిన్ బి, కెరోటిన్ పుష్కలంగా లభిస్తాయి.

credit: social media and webdunia

కరివేపాకును పొడిలా చేసుకుని ప్రతిరోజు ఒక టీస్పూను తీసుకుంటూ ఉంటే కొలస్ట్రాల్ తగ్గడంతో పాటు హానికరమైన ఎల్డిఎల్ గణనీయంగా తగ్గుతుంది.

credit: social media and webdunia

గర్భిణులకు ఒక స్పూను తేనె, అరస్పూను నిమ్మరసంలో కరివేపాకు పొడిని కలిపి తీసుకుంటే వికారం తగ్గుతుంది.

credit: social media and webdunia

ప్రతిరోజు పది ముదురు కరివేపాకు ఆకులను నమిలి మింగాలి. ఇలా 3 నెలల పాటు చేయడం వలన మధుమేహం కంట్రోల్‌లో ఉంటుంది.

credit: social media and webdunia

పుల్లని పెరుగులో కొద్దిగా నీరు చేర్చి అందులో కరివేపాకు, అల్లం ముక్కలు, కొద్దిగా పచ్చిమిర్చి, ఉప్పు కలిపి తాగితే శరీరంలోని అధిక వేడి తగ్గుతుంది.

credit: social media and webdunia

కాలిన లేదా కమిలిన గాయాలకు కరివేపాకు గుజ్జు రాయడం వలన నొప్పి, గాయం త్వరగా తగ్గుతాయి.

credit: social media and webdunia

కరివేపాకు చెట్టు బెరడును కషాయంగా కాచి తీసుకుంటే అధిక రక్తపోటు వల్ల వచ్చే రుగ్మతలు తగ్గుతాయి.

credit: social media and webdunia

గమనిక: చిట్కాలను పాటించే ముందు ఇంటి వైద్యుడిని కూడా సంప్రదించాలి.

credit: social media and webdunia

ఆల్‌బుకరా పండ్లతో ఆరోగ్య ప్రయోజనాలు

Follow Us on :-