Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

భార్యతో అసభ్యంగా ప్రవర్తించిన జ్యోతిష్కుడు : హత్య చేసి, పెట్రోల్ పోసి తగలబెట్టేశారు...

Advertiesment
crime

ఠాగూర్

, శనివారం, 22 ఫిబ్రవరి 2025 (08:55 IST)
ఆంధ్రప్రదేశ్‌ రాష్ట్రంలోని విశాఖపట్టణం జిల్లా భీమిలిలో దారుణం జరిగింది. జ్యోతిష్కుడుని భార్యాభర్తలు కలిసి దారుణంగా చంపేశారు. ఆ తర్వాత మృతదేహంపై పెట్రోల్ పోసి తగలబెట్టేశారు. ఆలస్యంగా వెలుగులోకి వచ్చిన ఈ ఘటనకు సంబంధించిన పోలీసులు వెల్లడించిన వివరాల మేరకు.. భీమిలి మండలంలోని నేర్లవలస గ్రామానికి చెందిన ఊళ్ల చిన్నారావు, మౌనిక అనే దంపతులు... ఆనందపురం మండలం లొడగలవానిపాలెంలో వీరు నివాసం ఉంటున్నారు. 
 
జ్యోతిష్కుడు అప్పన్న (50)తో పూజలు చేయించుకోవడం కోసం మౌనిక ఈ నెల 7న ఆయనను ఇంటికి ఆహ్వానించింది. ఇంట్లో ఎవరూ లేకపోవడాన్ని గమనించిన అప్పన్న ఆమె పట్ల అసభ్యంగా ప్రవర్తించాడు. దీంతో ఈ విషయాన్ని మౌనిక తన భర్తకు చెప్పింది. ఇద్దరూ కలిసి అప్పన్నను హత్య చేయాలని నిర్ణయించి ప్రణాళిక రచించారు. 
 
ఈ నెల 9వ అప్పన్నను కలిసిన చిన్నారావు తన తల్లికి ఆరోగ్యం బాగా లేదని, పూజలు చేయాలంటూ బైకుపై ఎక్కించుకుని బయలుదేరాడు. బోయపాలెం - కాపులప్పాడ మార్గంలో కల్లివానిపాలేనికి చేరుకున్న తర్వాత నిర్మానుష్య ప్రాంతంలో బైక్ ఆపి, చాకుతో అప్పన్నపై దాడిచేసి చంపేశాడు. 
 
ఈ క్రమంలో చేతికి గాయంతో కావడంతో తర్వాత రోజున కేజీహెచ్‌లో చికిత్స చేయించుకున్నాడు. ఆ తర్వాత రోజు భార్యాభర్తలు ఇద్దరూ కలిసి జ్యోతిష్కుడు మృతదేహం పడివున్న ప్రాంతానికి వెళ్లి పెట్రోల్ పోసి తలగబెట్టాడు. ఈ నెల 19వ తేదీన కల్లివానిపాలెం వద్ద ఆస్థిపంజరాన్ని గుర్తించిన స్థానికుల పోలీసులకు సమాచారం ఇచ్చారు. దర్యాప్తు ప్రారంభించిన పోలీసులు చిన్నారావు దంపతులపై అనుమానం వచ్చి వారిని ప్రశ్నించగా, హత్య విషయం వెలుగులోకి వచ్చింది. ఇద్దరినీ అరెస్టు చేసి రిమాండ్‌కు తరలించారు. 

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

ఒంటరిగా ఉన్న మహిళతో మాటలు కలిపారు.. హోటల్‌కు తీసుకెళ్లిన అత్యాచారం చేశారు...