దేశంలో పన్ను వ్యవస్థను సులభతరం చేయడం కోసం జీఎస్టీ కౌన్సిల్ తీసుకున్న నిర్ణయం చారిత్రాత్మకమైనదని ఎ.పి. మంత్రి కందుల దుర్గేష్ అన్నారు. జీఎస్టీ సంస్కరణలతో తక్కువ ధరల్లో వినోదం కలిగించేలా వుందని ఆంధ్రప్రదేశ్ సినిమాటోగ్రఫీ మంత్రి కందుల దుర్గేష్ అన్నారు. ముఖ్యంగా పర్యాటక, సినిమా రంగాల బలోపేతానికి దోహదం తెలియజేశారు. బడ్జెట్ ట్రావెలర్, డొమెస్టిక్ టూరిజంలకు ప్రోత్సాహం లభిస్తుందని అమరావతిలో ఆయన పేర్కొన్నారు.
18% శ్లాబ్ పరిధిలోకి సినిమా ప్రొడక్షన్ సేవలు, తద్వారా నిర్మాతలకు ఆర్ధికంగా మేలు కలుగుతుందని ఆయన అన్నారు. ట్యాక్స్ లు తగ్గితే సినిమా, పర్యాటక రంగాల్లో ఉపాధి పెరుగుతుంది. స్థానిక ఆర్థిక వ్యవస్థ బలపడుతుందనే అభిప్రాయాన్ని వ్యక్తం చేశారు. సినిమా టికెట్లు రూ.100 లోపు ఉంటే 12% GST, రూ.100 పైగా ఉంటే 18% GST కొనసాగుతుంది. జీఎస్టీ సంస్కరణలు తెచ్చిన ప్రధాని మోదీ, ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్‌కు ప్రత్యేక అభినందనలు తెలిపారు.