Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

లిటిల్ హార్ట్స్ సక్సెస్ అవుతుందని ముందే చెప్పా : మౌళి తనుజ్

Advertiesment
Mouli Tanuj, Shivani Nagaram, bunny vas, vamsi

దేవీ

, శనివారం, 6 సెప్టెంబరు 2025 (09:30 IST)
Mouli Tanuj, Shivani Nagaram, bunny vas, vamsi
మౌళి తనూజ్, శివానీ నాగరం జంటగా నటించిన లిటిల్ హార్ట్స్ సినిమా ఈ రోజు ప్రేక్షకుల ముందుకొచ్చి ఘన విజయాన్ని సొంతం చేసుకుంది. ఈ చిత్రాన్ని ఈటీవీ విన్ ఒరిజినల్ ప్రొడక్షన్ బ్యానర్ పై దర్శకుడు సాయి మార్తాండ్ రూపొందించారు. ఆదిత్య హాసన్ నిర్మాతగా వ్యవహరించారు.  వంశీ నందిపాటి ఎంటర్ టైన్ మెంట్స్ బ్యానర్స్ పై వరల్డ్ వైడ్ గ్రాండ్ గా థియేట్రికల్ గా రిలీజ్ చేశారు. అన్నివర్గాల ప్రేక్షకుల ఆదరణ పొందుతూ, సూపర్ హిట్ కావడంతో మూవీ టీమ్ సక్సెస్ మీట్ నిర్వహించారు.
 
ఈటీవీ విన్ హెడ్ సాయికృష్ణ మాట్లాడుతూ - సినిమాకు మంచి టాక్ వస్తోంది. ప్రేక్షకులు బాగా ఆదరిస్తున్నారు. టికెట్ బుకింగ్స్ భారీగా జరుగుతున్నాయి. సినిమా జెన్యూన్ గా సక్సెస్ అయితేనే మేము ఈటీవీ విన్ నుంచి సక్సెస్ మీట్స్ పెడతాం.  సినిమా ప్రేక్షకులను ఆకట్టుకుంటోంది. ఈ చిత్రాన్ని ఇంత బాగా ఆడియెన్స్ లోకి తీసుకెళ్లింది మా బన్నీ వాస్, వంశీ నందిపాటి . లిటిల్ హార్ట్స్  సినిమా విజయానికి కారణమైన ప్రతి ఒక్కరికీ థ్యాంక్స్. అన్నారు.
 
డిస్ట్రిబ్యూటర్, ప్రొడ్యూసర్ బన్నీవాస్ మాట్లాడుతూ - నిన్న ఉదయం 11 గంటలకు 3 షోస్ తో ప్రీమియర్స్ స్టార్ట్ చేశాం.  సాయంత్రం 7 గంటలకు 29 షోస్ పడ్డాయి. ఈ షోస్ అన్నీ దాదాపు 90 పర్సెంట్ ఫిల్ అయ్యాయి. ఇప్పుడు మల్టీప్లెక్స్ లో ఒక్క టికెట్ కూడా లేదు. మొత్తం సేల్ అయ్యాయి. రేపు శనివారం కూడా బుక్ అవుతున్నాయి. ఒక చిన్న చిత్రానికి ప్రేక్షకులు అసాధారణ విజయాన్ని అందించడం గొప్ప విషయం. మేము ఈ సినిమా మీద పెట్టుకున్న నమ్మకాన్ని ప్రేక్షకులు నిజం చేశారు. ఈటీవీ విన్ వారు ఈ సినిమాను దాదాపు 50 రోజుల వరకు ఓటీటీలోకి తీసుకురావొద్దని కోరుతున్నా.ఈ చిత్రాన్ని కాలేజ్ స్టూడెంట్స్ మీ ఫ్రెండ్స్ తో, ఫ్యామిలీతో వెళ్లి చూడండి  బాగా ఎంజాయ్ చేస్తారు. అన్నారు.
 
డిస్ట్రిబ్యూటర్, ప్రొడ్యూసర్ వంశీ నందిపాటి మాట్లాడుతూ - "లిటిల్ హార్ట్స్"  సినిమాకు ప్రేక్షకులు చూపిస్తున్న ఆదరణ ఎంతో సంతోషాన్ని ఇస్తోంది. మంచి కంటెంట్ తో వస్తే ఊహించనంత కలెక్షన్స్ ఇస్తామని ప్రేక్షకులు మరోసారి ప్రూవ్ చేశారు. డైరెక్టర్ సాయి మార్తాండ్ ఒక ఆంథెటిక్, ఆర్గానిక్ ఎంటర్ టైన్ మెంట్ తో మూవీని రూపొందించాడు. మౌళి అందరినీ ఆకట్టుకున్నాడు. ఒక కొత్త స్టార్ గా తనను తాను మౌళి మలుచుకోబోతున్నాడు అనిపిస్తోంది. శివానీ కూడా బాగా నటించింది. ఈ చిత్రాన్ని మాకు ఇచ్చిన ఆదిత్య హాసన్ కు థ్యాంక్స్. ఈటీవీ నుంచి నువ్వే కావాలి వచ్చింది. ఇన్నేళ్లకు మరో నువ్వే కావాలి లాంటి సక్సెస్ మాకు దక్కింది. ఈ ఏడాది సంక్రాంతికి వస్తున్నాం తర్వాత అంతగా "లిటిల్ హార్ట్స్"  చూసి నవ్వుకున్నాం, ఆ సినిమా స్థాయి విజయం వస్తుందంటూ సోషల్ మీడియాలో అప్రిషియేషన్స్ వస్తున్నాయి. మాకు ఇలాంటి గొప్ప సక్సెస్ ఇచ్చిన ఆడియెన్స్ కు థ్యాంక్స్. అన్నారు.
 
హీరో మౌళి తనుజ్ మాట్లాడుతూ - 3 షోస్ నుంచి ప్రీమియర్స్ మొదలై 29 షోస్ కు పెరిగాయి. ఇదంతా మా బన్నీ వాస్ ప్లానింగ్. మా సినిమాను వారు డిస్ట్రిబ్యూట్ చేస్తున్నారని తెలియగానే నా సన్నిహితులు చెప్పారు మీరు రిలాక్స్ కావొచ్చు. వాళ్లు గ్రాండ్ గా రిలీజ్ చేస్తారని. బన్నీ వాస్ గారు డిస్ట్రిబ్యూషన్ లో ది బెస్ట్ అని ప్రూవ్ చేసుకున్నారు. సినిమా ఈటీవీ విన్ వారి దగ్గరకు తీసుకెళ్లినప్పుడే చెప్పాను. ఇది థియేట్రికల్ మూవీ అని. నేను చెప్పినట్లే ఈ రోజు థియేటర్స్ లో మా సినిమాకు మంచి రెస్పాన్స్ రావడం ఆనందంగా ఉంది. అన్నారు.
 
హీరోయిన్ శివానీ నాగరం మాట్లాడుతూ - ఈ మధ్య కాలంలో ఇలాంటి మంచి రోమ్ కామ్ రాలేదు. మా సినిమాలోని క్యారెక్టర్స్, డైలాగ్స్, మ్యూజిక్..ఇలా ప్రతి అంశం మిమ్మల్ని ఆకట్టుకుంటుంది. సినిమా చూస్తున్న వాళ్లు ప్రతి షో తర్వాత మాకు సోషల్ మీడియా ద్వారా తమ రెస్పాన్స్ తెలియజేస్తున్నారు. కాలేజ్ స్టూడెంట్ "లిటిల్ హార్ట్స్"  చిత్రాన్ని చూడాలి. మీరు బాగా ఎంజాయ్ చేసే సినిమా ఇది. అన్నారు.
 
డైరెక్టర్ సాయి మార్తాండ్ మాట్లాడుతూ -  రోమ్ కామ్స్ ఎవరు చూస్తారన్న అదే ప్రొడ్యూసర్స్ ఈ రోజు మన వాళ్లకు ఫోన్ చేసి చాలా ఎంజాయ్ చేశాం సినిమా అంటున్నారు. ఈ కథ విన్న వెంటనే మౌళి,  చాలా హ్యాపీగా ఉంది. నా మొదటి సినిమా రొమాంటిక్ కామెడీ ఉండాలని కోరుకున్నా. ఒక చిన్న బడ్జెట్ లో మంచి లవ్ స్టోరీ చూపిస్తే ప్రేక్షకులు ఆదరిస్తారు అని నమ్మాను. అది  ఈరోజు నిజం కావడం సంతోషంగా ఉంది. అన్నారు.

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

JD Chakravarthy: డబ్బుని మంచినీళ్లు లాగా ఖర్చు పెడుతున్నారు : జెడీ చక్రవర్తి