Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

ఇద్దరు చదువు రాని వాళ్లు ప్రేమిస్తే ఎలావుంటుందనేదే లిటిల్ హార్ట్స్ మూవీ

Advertiesment
Mouli Tanuj, Shivani Nagaram

దేవీ

, శనివారం, 30 ఆగస్టు 2025 (18:45 IST)
Mouli Tanuj, Shivani Nagaram
"90s  ఫేమ్ మౌళి తనుజ్, శివానీ నాగరం లీడ్ రోల్స్ లో నటిస్తున్న మూవీ "లిటిల్ హార్ట్స్". ఈ చిత్రాన్ని ఈటీవీ విన్ ఒరిజినల్ ప్రొడక్షన్ బ్యానర్ పై దర్శకుడు సాయి మార్తాండ్ రూపొందించారు. "90s మిడిల్ క్లాస్ బయోపిక్" ఫేమ్ డైరెక్టర్ ఆదిత్య హాసన్ "లిటిల్ హార్ట్స్" మూవీకి  నిర్మాతగా వ్యవహరించారు. ఈ సినిమాను నిర్మాతలు బన్నీ వాస్, వంశీ నందిపాటి థియేట్రికల్ గా రిలీజ్ చేస్తున్నారు.  "లిటిల్ హార్ట్స్" సినిమా సెప్టెంబర్ 5న గ్రాండ్ థియేట్రికల్ రిలీజ్ కు రాబోతోంది.
 
ఈ రోజు ఈ సినిమా ట్రైలర్ విడుదల చేశారు. "లిటిల్ హార్ట్స్" ట్రైలర్ ఆద్యంతం హిలేరియస్ ఫన్ తో ఆకట్టుకుంటోంది. జియో సిమ్ రాకముందు జరిగిన కథంటూ ఈ ట్రైలర్ స్టార్ట్ అవుతుంది. సైనిక్ పురిలో ఉండే అఖిల్ (మౌళి తనూజ్) చదువురాని ఇంటర్ విద్యార్థి. కొడుకు పనులతో తండ్రి (రాజీవ్ కనకాల) విసిగిపోతాడు. నీ మీద ఖర్చు పెట్టే ప్రతీది బొక్కే నాకు అంటాడు. నాన్న తిట్లు అఖిల్ మీద ఏమాత్రం పనిచేయవు. నాన్న తిడుతుంటే తినలేకపోతున్నా అమ్మా, రేపట్నుంచి డాడీ రాకముందే అన్నం పెట్టేయ్ తినేస్తా అని చెప్తాడు. వాయుపురిలో ఉండే కాత్యాయని( శివానీ నాగరం) చదువులో వెనకబడటంలో అఖిల్ కంటే ముందుంటుంది. 
 
అఖిల్ సరదా మాటలు కాత్యాయనికి నచ్చితే, కాత్యాయనిని చూడగానే లవ్ లో పడిపోతాడు అఖిల్. ఈ ఇద్దరు చదువు రాని వాళ్లు ప్రేమించుకుంటారు. కాత్యాయని తప్ప నాకు మరే అమ్మాయి వద్దు అనుకుంటాడు అఖిల్. వీళ్ల సరదా లవ్ స్టోరీలో కాత్యాయని ఫ్యామిలీ బెంగుళూరు షిఫ్ట్ అయ్యేందుకు రెడీ అవడం ట్విస్ట్ ఇస్తుంది. కాత్యాయని ఫ్యామిలీ బెంగుళూరు వెళ్లిందా ?, అఖిల్, కాత్యాయని ఒక్కటయ్యారా ? లేదా వంటి అంశాలతో "లిటిల్ హార్ట్స్".  ట్రైలర్ ఆకట్టుకుంది. క్యారెక్టరైజేషన్స్, ఆర్టిస్టుల పర్ ఫార్మెన్స్ లు, నవ్వించే డైలాగ్స్, ఇంకా డిజిటల్ మయం కాని బిఫోర్ జియో సిమ్ కాలాన్ని రిక్రీయేట్ చేసిన మేకింగ్ హైలైట్స్ గా నిలుస్తున్నాయి.

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

అప్పుడు అనుష్క తో ఛాన్స్ మిస్ అయ్యా, గోనగన్నారెడ్డి గా నేనే చేయాలి : విక్రమ్ ప్రభు