ఇండస్ట్రీలో 17 ఏళ్ళు పూర్తి చేసుకున్న సందర్భంగా ది ప్యారడైజ్ నుంచి నాని బీస్ట్ మోడ్ లో స్టిల్ రిలీజ్ చేశారు మేకర్స్. ప్రస్తుతం హైదరాబాదులో శరవేగంగా జరుగుతున్న షూటింగ్ జరుపుకుంటోంది. మరో ప్రత్యేకత ఏమంటే ఇందులో డా. మోహన్ బాబు కీలక పాత్ర పోషిస్తున్నారు. చాలా కాలం గేప్ తర్వాత తను నటిస్తున్న చిత్రమిది. రాజమౌళి యమదొంగ తర్వాత మోహన్ బాబు నటించింది లేదు. మరి నాని సినిమాలో పాత్ర పవర్ పుల్ గా వుంటుందని చిత్ర యూనిట్ చెబుతోంది. ఇటీవలే ఆయనపై సన్నివేశాలు కూడా చిత్రీకరించారు.
ప్యారడైజ్ లో నాని నెవర్ బిఫోర్ జడల్ క్యారెక్టర్ లో కనిపిస్తున్నారు. ఈ క్యారెక్టర్ కోసం జిమ్ లో ఇంటెన్స్ గా వర్క్ అవుట్ చేస్తున్నారని ఈ స్టిల్ చూస్తే అర్థమవుతుంది. ఇప్పటికే విడుదలైన పోస్టర్స్, రా స్టేట్మెంట్, గ్లింప్స్ వీడియోలకు నేషనల్ వైడ్ గా అద్భుతమైన రెస్పాన్స్ వచ్చింది. దసరా ఫేమ్ శ్రీకాంత్ ఓదెల దర్శకత్వంలో, SLV సినిమాస్ బ్యానర్ పై నిర్మాత సుధాకర్ చెరుకూరి ఈ చిత్రాన్ని అత్యంత ప్రతిష్టాత్మకంగా నిర్మిస్తున్నారు.
ది ప్యారడైస్ 2026 మార్చి 26న థియేటర్లలోకి రానుంది. తెలుగు, హిందీ, తమిళం, కన్నడ, మలయాళం, బెంగాలీ, ఇంగ్లీష్, స్పానిష్ మొత్తం ఎనిమిది భాషల్లో రిలీజ్ అవుతూ ఇండియన్ సినిమాలో మోస్ట్ అవైటెడ్ యాక్షన్ డ్రామాలలో ఒకటిగా నిలుస్తోంది.