Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

డాక్యుమెంటరీ నియమాల్ని బ్రేక్ చేసి అద్భుతంగా తీశారు : దర్శకుడు కరుణ కుమార్

Advertiesment
Karuna Kumar, Viplav, Mahesh Vitta,  Murali Krishna and others

దేవీ

, శనివారం, 6 సెప్టెంబరు 2025 (15:43 IST)
Karuna Kumar, Viplav, Mahesh Vitta, Murali Krishna and others
ప్రేమ్ కుమార్ వలపల నిర్మాతగా తీసిన డాక్యుమెంటరీ ప్రొద్దుటూరు దసరా. మురళీ కృష్ణ తుమ్మ తెరకెక్కించారు. శుక్రవారం ప్రముఖులకు ప్రదర్శించారు. ఈ ప్రత్యేక ప్రదర్శనకు కరుణ కుమార్, విప్లవ్, మహేష్ విట్టా, ఉదయ్ గుర్రాల ముఖ్య అతిథులుగా విచ్చేశారు. బాల్కనీ ఒరిజినల్స్, బుశెట్టి జువెల్లర్స్ సమర్పణలో రూపొందిన డాక్యుమెంటరీని స్క్రీనింగ్ అనంతరం అందరూ అభినందనలు కురిపించారు.
 
దర్శకుడు కరుణ కుమార్ మాట్లాడుతూ .. ఓ ఘటన, వ్యక్తికి సంబంధించిన విషయాల్ని, లేదా,నిజాల్ని చూపించే డాక్యుమెంటరీస్ ఉంటాయి. డాక్యుమెంటరీ అంటే ఎంగేజింగ్‌గా ఉండదని అంతా అనుకుంటారు. కానీ ఈ ప్రొద్దుటూరు దసరా ఎంతో ఎంగేజింగ్‌గా, అద్భుతంగా అనిపించింది. డాక్యుమెంటరీ అంటే ఇలానే తీయాలి అనే నియమాల్ని బద్దలు కొట్టారు. యశ్వంత్ నాగ్ మంచి మ్యూజిక్ ఇచ్చారు. ఆర్ఆర్, పాట విన్నా కూడా గూస్ బంప్స్ వచ్చాయి. ఏఐని వాడుకుని గొప్పగా చూపించారు. ఇంటర్నేషనల్‌ వైడ్‌గా డాక్యుమెంటరీలను ఎన్నో ఫిల్మ్ ఫెస్టివల్స్‌లో ప్రదర్శిస్తుంటారు. డాక్యుమెంటరీ అనేది దృశ్యరూపంలో ఉండే చరిత్ర అని అన్నారు.
 
మహేష్ విట్టా మాట్లాడుతూ .. మా ఊర్లో జరిగే దసరా గురించి అందరికీ చెబుతుంటాను. పది రోజుల పాటు పండుగ అదిరిపోతుంది. ఈ డాక్యుమెంటరీలో చూపించిన దాని కంటే ఇంకా బాగుంటుంది. పది టెంపుల్స్‌లో దసరా గొప్పగా జరుగుతుంది. 11 వ రోజు మాత్రం వాహనాలు కూడా వచ్చే స్థలం ఉండదు. శివ కాశీ నుంచి తెచ్చిన క్రాకర్స్‌ని గంట సేపు కాల్చుతారు. ప్రొద్దుటూర్‌లో దసరా అద్భుతంగా జరుగుతుంది అని అన్నారు.
 
దర్శకుడు ఉదయ్ గుర్రాల మాట్లాడుతూ .. నేను కూడా డాక్యుమెంటరీలు తీశాను. నిజాల్ని దాచి పెట్టడం, భావి తరాలకు చూపెట్టడం డాక్యుమెంటరీ. ప్రొద్దుటూరు దసరాని అక్కడి వారికి ఎప్పటికీ గుర్తుండిపోయేలా తీశారు. ఈ డాక్యుమెంటరీ చూసిన తరువాత ప్రొద్దుటూరు దసరా గొప్పదనం తెలిసింది. యశ్వంత్ నాగ్ మ్యూజిక్ అద్భుతంగా అనిపించింది’ అని అన్నారు.
 
నిర్మాత ప్రేమ్ కుమార్ మాట్లాడుతూ ... ఇప్పటి వరకు మా ఏరియా అంటే వయలెన్స్ మాత్రమే ఉంటుందని అంతా అనుకుంటూ ఉన్నారు. కానీ ఇప్పుడు మా మూలాల్లోని కథల్ని చూపిస్తాను. యశ్వంత్ మ్యూజిక్, నిఖిల్ కెమెరా వర్క్ గొప్పగా వచ్చింది. ఈ డాక్యుమెంటరీకి సహకరించిన ప్రతీ ఒక్కరికీ థాంక్స్’ అని అన్నారు.
 
నటుడు విప్లవ్ మాట్లాడుతూ .. ప్రేమ్ కుమార్‌తో నాకు చాలా పరిచయం ఉంది. ప్రేమ్‌తో ఓ ప్రాజెక్ట్ చేయాలని ఎప్పటి నుంచో ప్రయత్నిస్తున్నాను. నెక్ట్స్ జరిగే దసరాకు నన్ను తీసుకు వెళ్లాలని కోరుకుంటున్నాను’ అని అన్నారు.
 
జయసింహా మాట్లాడుతూ..  చాలా క్వాలిటీతో ఎక్కడా కాంప్రమైజ్ కాకుండా నిర్మించిన ప్రేమ్‌కు హ్యాట్సాఫ్. ఇలాంటి గొప్ప ప్రాజెక్టులెన్నో ఇంకా చేయాలి. బాల్కనీ ఒరిజినల్స్ మరిన్ని ప్రాజెక్టులు చేయాలని కోరుకుంటున్నాను. యశ్వంత్ నాగ్ మంచి మ్యూజిక్ ఇచ్చారు. బుశెట్టి జువెల్లర్స్ వారికి థాంక్స్’ అని అన్నారు.
 
దర్శకుడు మురళీ కృష్ణ మాట్లాడుతూ..  నా వరకు నేను ప్రయత్నించి ఈ డాక్యుమెంటరీని తీశాను. అందరికీ మా డాక్యుమెంటరీ నచ్చుతుందని ఆశిస్తున్నాను అని అన్నారు.
 
నటుడు దావూద్ మాట్లాడుతూ .. శ్రీదేవీ సోడా సెంటర్ చిత్రంలో నటించాను. ఆ మూవీ సక్సెస్ మీట్‌కు ప్రొద్దుటూరుకి వెళ్లారు. ఆ సమయంలో నా పేరుని కూడా అక్కడ ఆయన చెప్పారు. ఈ రోజు ఇలా ఆయన్ను మళ్లీ ఇక్కడ కలవడం ఆనందంగా ఉంది. మా ఊర్లో దసరా బాగా జరుగుతుందని, సిరి పురం అని, బంగారం ఎక్కువగా ఉంటుందని ప్రతీ ఒక్కరికీ చెబుతుండేవాడిని. ప్రొద్దుటూరులో దసరా బాగా జరుగుతుందని అందరికీ తెలుసు. అయితే ఈ డాక్యుమెంటరీతో ప్రపంచంలోని ప్రతీ ఒక్కరికీ ప్రొద్దుటూరు దసరాని చూపించారు’ అని అన్నారు.

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

Vishal: మగుడంకు దర్శకుడిగా మారిన విశాల్?