Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

Naresh: నాగ చైతన్య క్లాప్ తో నరేష్65 చిత్రం పూజా కార్యక్రమాలు

Advertiesment
Naga Chaitanya Clap Allari Naresh's 65 film

దేవీ

, శనివారం, 6 సెప్టెంబరు 2025 (17:40 IST)
Naga Chaitanya Clap Allari Naresh's 65 film
అల్లరి నరేష్ తన కొత్త చిత్రం #నరేష్65 తో తిరిగి కామెడీ జానర్ లోకి వచ్చారు. ఈ ఎక్సయిటింగ్  ప్రాజెక్ట్ ను చంద్ర మోహన్ దర్శకత్వం వహిస్తున్నారు. అన్నపూర్ణ స్టూడియోస్, హాస్య మూవీస్ - బ్యానర్స్ పై రాజేష్ దండ, నిమ్మకాయల ప్రసాద్ నిర్మిస్తున్నారు. ఈ చిత్రం ఫాంటసీ, కామెడీ బ్లెండ్ తో రిఫ్రెషింగ్ గా ఉండబోతోంది. "కామెడీ గోస్ కాస్మిక్" అని మేకర్స్ చెప్పడం క్యురియాసిటీని పెంచింది.
 
webdunia
Naga Chaitanya, Allari Naresh, Supriya, bobby, anil sunkar, harish shankar and others
ఈ చిత్రం ఈరోజు అన్నపూర్ణ స్టూడియోస్‌లో పూజా వేడుకతో గ్రాండ్ గా లాంచ్ అయ్యింది. సినిమా యూనిట్, పరిశ్రమ నుండి ప్రత్యేక అతిథులు హాజరయ్యారు. ఈ ప్రారంభోత్సవం అట్టహాసంగా జరిగింది. నాగ చైతన్య ముహూర్తపు షాట్‌కు  క్లాప్ కొట్టారు. స్టార్ డైరెక్టర్ బాబీ కెమెరా స్విచ్ ఆన్ చేశారు. దర్శకుడు వి.ఐ. ఆనంద్ ఫస్ట్ షాట్‌కు గౌరవ దర్శకత్వం వహించగా, దర్శకులు వశిష్ట, రామ్ అబ్బరాజు, విజయ్ కనకమేడల స్క్రిప్ట్‌ను నిర్మాతలకు అందజేశారు. హర్ష్ శంకర్, సుప్రియ యార్లగడ్డ, అనిల్ సుంకర, జెమిని కిరణ్ ఈ కార్యక్రమానికి హాజరయ్యారు.
 
మెయిన్‌స్ట్రీమ్‌ కామెడీ, డిఫరెంట్ ఆఫ్‌బీట్‌ పాత్రలను బ్యాలెన్స్ చేస్తూ తనకంటూ ప్రత్యేకమైన గుర్తింపును సంపాదించుకున్న అల్లరి నరేష్‌  #Naresh65తో సరికొత్త పాత్రలో కనిపించబోతున్నారు. వెన్నెల కిషోర్, నరేష్ వి.కె., శ్రీనివాస్ రెడ్డి, మురళీధర్ గౌడ్  ఈ చిత్రంలో కీలక పాత్రల్లో నటిసున్నారు
 
ఫాంటసీ ఎలిమెంట్స్ తో కూడిన ఈ చిత్రం టెక్నికల్‌గా గ్రాండ్‌గా రూపొందనుంది. రామ్ రెడ్డి సినిమాటోగ్రఫీని నిర్వహిస్తుండగా, చేతన్ భరద్వాజ్ సంగీతం అందిస్తున్నారు. బ్రహ్మ కడలి ఆర్ట్ డైరెక్టర్, చోటా కె ప్రసాద్ ఎడిటర్.  
 
రెగ్యులర్ షూటింగ్ త్వరలో ప్రారంభం కానుంది.
 తారాగణం: అల్లరి నరేష్, వెన్నెల కిషోర్, నరేష్ వీకే, శ్రీనివాస్ రెడ్డి, మురళీధర్ గౌడ్

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

సైమా అవార్డ్స్ చిత్రం కల్కి, నటుడు అల్లు అర్జున్, క్రిటిక్స్ తేజ సజ్జా, సుకుమార్, ప్రశాంత్ వర్మ