Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia
Advertiesment

యాదాద్రి భువనగిరి జిల్లాలో కొత్త శాఖను ప్రారంభించిన ఎస్‌బీఐ

Yadadri Bhuvanagiri district SBI  branch

డీవీ

, మంగళవారం, 2 జులై 2024 (18:47 IST)
Yadadri Bhuvanagiri district SBI branch
 హైదరాబాద్: దేశీయంగా అత్యంత విశ్వసనీయ ప్రైవేట్ బీమా సంస్థల్లో ఒకటైన ఎస్‌బీఐ లైఫ్ ఇన్సూరెన్స్ తమ వినియోగదారులకు బీమా సేవలను అందుబాటులోకి తేవడంపై మరింతగా దృష్టి పెట్టడాన్ని కొనసాగిస్తోంది. ఇందులో భాగంగా తెలంగాణ హైదరాబాద్‌లోని యాదాద్రి భువనగిరి జిల్లాలో కొత్త శాఖ కార్యాలయాన్ని ప్రారంభించింది. దీని చిరునామా ఎస్‌బీఐ లైఫ్ ఇన్సూరెన్స్ లిమిటెడ్, D.no. 3-330/1/C/A/1, మొదటి అంతస్తు, డీజే కాంప్లెక్స్, గణేష్ నగర్, చౌటుప్పల్ మెయిన్ రోడ్, మల్లికార్జున స్కూల్ ఎదురుగా, చౌటుప్పల్ టౌన్ & మండలం, యాదాద్రి భువనగిరి జిల్లా, హైదరాబాద్, 508252. ఈ వ్యూహాత్మక విస్తరణతో రాష్ట్రంలో జీవిత బీమా విస్తృతికి మరింతగా దోహదపడాలని కంపెనీ నిర్దేశించుకుంది.  
 
 హైదరాబాద్‌లో కొత్త శాఖ కార్యాలయాన్ని ఎస్‌బీఐ లైఫ్ ఇన్సూరెన్స్ రీజనల్ డైరెక్టర్ (హైదరాబాద్ రీజియన్) శ్రీ అభిషేక్ మజుందార్ ప్రారంభించారు. ఎస్‌బీఐ లైఫ్ ఇన్సూరెన్స్ రీజనల్ మేనేజర్ (రిటైల్ ఏజెన్సీ) శ్రీ పి. వంశీధర్ రెడ్డి; ఎస్‌బీఐ లైఫ్ ఇన్సూరెన్స్ డిప్యుటీ రీజనల్ మేనేజర్ (హైదరాబాద్ మెట్రో) శ్రీ పి. శ్యామ్ సుందర్ రాజు; ఎస్‌బీఐ లైఫ్ ఇన్సూరెన్స్ రీజనల్ మేనేజర్ (ఐఏ ఛానెల్) శ్రీ వినీత్ శుక్లా; ఎస్‌బీఐ లైఫ్ ఇన్సూరెన్స్ రీజనల్ హెచ్ఆర్ శ్రీ ఎస్ ఫ్రెడ్‌లిన్ (S Fredline)తో పాటు ఇతర ప్రముఖులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. 
 
 “మారుతున్న వినియోగదారుల అవసరాలకు అనుగుణంగా భౌతిక శాఖల ఏర్పాటుతో బీమా ఉత్పత్తులు, సేవలను సులభతరంగా అందుబాటులో ఉంచేందుకు వీలవుతుంది. కస్టమర్లతో సంబంధాలను ఏర్పర్చుకోవడానికే కాకుండా సమగ్రమైన ఆర్థిక ప్రణాళికను రూపొందించుకునే సంస్కృతిని పెంపొందించడానికి కూడా ఇది దోహదపడుతుంది. కస్టమర్ల బీమా సంబంధ సమస్యలను పరిష్కరించేందుకు, సంక్లిష్టమైన ఆర్థిక నిర్ణయాలు తీసుకోవడంలో వారికి సహాయకరంగా ఉండేందుకు, స్థానికులకు ప్రయోజనకరంగా ఉండేలా ఎస్‌బీఐ లైఫ్ హైదరాబాద్‌లో తమ కొత్త శాఖను ప్రారంభించింది. ప్రొటెక్షన్ ఉత్పత్తుల అవసరం, ప్రాధాన్యతను మరింత మంది వినియోగదారులు గుర్తిస్తున్న నేపథ్యంలో వారి అవసరాలను తీర్చే విధంగా బీమా సంస్థలు వారికి అందుబాటులో ఉండటం కీలకంగా మారుతోంది. ఈ విస్తరణ ద్వారా, వినియోగదారుల బీమా అవసరాలకు అనుగుణంగా వివిధ బీమా సొల్యూషన్స్‌ను అందిస్తూ, విస్తృత సంఖ్యలో వినియోగదారులకు చేరువ కావాలనేది మా లక్ష్యం. జిల్లాలో మా కార్యకలాపాలను విస్తరించడమనేది, తమ ఆర్థిక పునాదులను పటిష్టపర్చుకోవడంలో, తమకు ప్రియమైన వారి భవిష్యత్తుకు భద్రత చేకూర్చడంలో స్థానికులకు సహాయపడేందుకు తోడ్పడగలదు. అదే సమయంలో వారు తమ ఆకాంక్షలను నెరవేర్చుకోవడంలో వారికి సాధికారత కల్పించేందుకు కూడా సహాయపడగలదు. ఈ చర్యలన్నీ మా కస్టమర్లతో సంబంధాలను పటిష్టపర్చుకునేందుకు, ‘2047 నాటికి అందరికీ బీమా’ అనే ఐఆర్‌డీఏఐ లక్ష్య సాధనకు తోడ్పడగలవని విశ్వసిస్తున్నాం” అని శాఖ ప్రారంభం సందర్భంగా ఎస్‌బీఐ లైఫ్ ఇన్సూరెన్స్ ప్రెసిడెంట్ & చీఫ్ డిస్ట్రిబ్యూషన్ ఆఫీసర్ శ్రీ ఎం. ఆనంద్ తెలిపారు. 
 
స్థానికులు బీమాను సులభతరంగా పొందేందుకు కంపెనీ పటిష్టమైన సాంకేతికత, కస్టమర్ సర్వీస్ మౌలిక సదుపాయాల దన్నుతో వివిధ ఉత్పత్తులు, సర్వీసులు అందిస్తోంది. దీనికి తోడు, కస్టమర్లకు అసమానమైన సేవల అనుభూతిని కలిగించేందుకు పాలసీ సర్వీసింగ్, రెన్యువల్స్, క్లెయిమ్ సంబంధ సమస్యల పరిష్కారం వంటి వివిధ సర్వీసులను కూడా కొత్త శాఖ అందిస్తుంది.

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

ఎస్‌బీఐ లైఫ్ ఇన్సూరెన్స్: బీమాను మరింత అందుబాటులోకి తెచ్చేందుకు యాదాద్రి భువనగిరి జిల్లాలో కొత్త శాఖ ప్రారంభం