మేషం : అశ్వని, భరణి 1, 2, 3, 4 పాదములు, కృత్తిక 1వ పాదం
సన్నిహితుల హితవు కార్యోన్ముఖులను చేస్తుంది. అవిశ్రాంతంగా శ్రమిస్తారు. మీ కష్టం ఫలిస్తుంది. అనవసర ఖర్చులు తగ్గించుకుంటారు. స్థిమితంగా పనులు పూర్తిచేస్తారు. శుభకార్యానికి యత్నాలు సాగిస్తారు. ముఖ్యులలో ఒకరికి వీడ్కోలు పలుకుతారు.
వృషభం : కృత్తిక 2, 3, 4 పాదాలు, రోహిణి, మృగశిర 1, 2, పాదాలు
అన్నివిధాలా అనుకూలమే. వాక్చాతుర్యంతో నెట్టుకొస్తారు. మీ అభిప్రాయాలకు స్పందన లభిస్తుంది. రావలసిన ధనాన్ని లౌక్యంగా వసూలు చేసుకోండి. ఎవరినీ ఇబ్బంది పెట్టొద్దు. ఖర్చులు సామాన్యం. ఆప్తులకు సాయం చేస్తారు. పనులు హడావుడిగా సాగుతాయి.
మిథునం : మృగశిర 3, 4 పాదాలు, ఆర్ద్ర, పునర్వసు 1, 2, 3 పాదాలు
శుభకార్యాన్ని ఘనంగా చేస్తారు. రోజువారీ ఖర్చులే ఉంటాయి. కొత్త పనులు చేపడతారు. అనవసర జోక్యం తగదు. ఇతరులు బాధ్యతలు చేపట్టి అవస్థపడతారు. ఆరోగ్యం జాగ్రత్త. కీలక పత్రాలు అందుకుంటారు. సోదరులతో సంప్రదింపులు జరుపుతారు.
కర్కాటకం : పునర్వసు 4వ పాదం, పుష్యమి, ఆశ్లేష
ఆర్ధికంగా బాగున్నా వెలితిగా ఉంటుంది. నిస్తేజానికి లోనవుతారు. అతిగా ఆలోచింపవద్దు. ఆత్మీయులతో కాలక్షేపం చేస్తారు. మనోధైర్యంతో కొత్తపనులు చేపడతారు. ఊహించని సంఘటన ఎదురవుతుంది. పెద్దల జోక్యంతో సమస్య సద్దుమణుగుతుంది.
సింహం : మఖ, పుబ్బ, ఉత్తర 1వ పాదం
లావాదేవీలతో హడావుడిగా ఉంటారు. శ్రమాధిక్యత, అకాలభోజనం. ఆచితూచి అడుగేయండి. ఏ విషయాన్నీ తేలికగా తీసుకోవద్దు. కొత్త సమస్యలు తలెత్తకుండా జాగ్రత్త వహించండి. పనుల ప్రారంభంలో ఆటంకాలు ఎదురవుతాయి. ముఖ్యుల కలిసినా ఏమంత ఫలితం ఉండదు.
కన్య : ఉత్తర 2, 3, 4 పాదాలు, హస్త, చిత్త 1, 2 పాదాలు
కార్యక్రమాలు సజావుగా సాగుతాయి. సమర్థతను చాటుకుంటారు. ప్రముఖులతో పరిచయాలు బలపడతాయి. ఆత్మీయులతో కాలక్షేపం చేస్తారు. పొదుపు ధనం అందుకుంటారు. వాహనం, గృహోపకరణాలు కొనుగోలు చేస్తారు. మీ ఉన్నతి కొందరికి అపోహ కలిగిస్తుంది.
తుల : చిత్త 3, 4 పాదాలు, స్వాతి, విశాఖ 1, 2, 3 పాదాలు
యత్నాలు ప్రోత్సాహకరంగా సాగుతాయి. పెద్దల ఆశీస్సులందుకుంటారు. అందరితోను కలుపుగోలుగా వ్యవహరిస్తారు. మీ విజ్ఞత ఆకట్టుకుంటుంది. పనులు చురుకుగా సాగుతాయి. దుబారా ఖర్చులు విపరీతం. అననవసర బాధ్యత చేపట్టి ఇబ్బందులెదుర్కుంటారు.
వృశ్చికం : విశాఖ 4వ పాదం. అనూరాధ, జ్యేష్ట 1,2,3,4 పాదములు
కార్యం సిద్ధిస్తుంది. ఆశించిన ఫలితం సాధిస్తారు. మీ కృషి ప్రశంసనీయమవుతుంది. ధనలాభం ఉంది. ప్రణాళికలు వేసుకుంటారు. ఆత్మీయుల రాక ఉత్సాహాన్నిస్తుంది. కొత్తపనులు మొదలెడతారు. అవకాశాలను వదులుకోవద్దు. ఏకాగ్రతతో వాహనం నడపండి.
ధనస్సు : మూల, పూర్వాషాడ 1 2 3 4 పాదములు, ఉత్తరాషాడ 1వ పాదం
లావాదేవీలు ముగుస్తాయి. రుణసమస్య నుంచి బయటపడతారు. అనుకున్న ఖర్చులే ఉంటాయి. కొంత మొత్తం పొదుపు చేస్తారు. పనులు చురుకుగా సాగుతాయి. ప్రముఖులకు సన్నిహితులవుతారు. మితంగా సంభాషించండి. కీలక సమావేశంలో పాల్గొంటారు.
మకరం : ఉత్తరాషాడ 2, 3, 4 పాదాలు. శ్రవణం, ధనిష్ట 1, 2 పాదాలు
కీలక వ్యవహారంపై పట్టు సాధిస్తారు. ఆలోచనలు కార్యరూపం దాల్చుతాయి. ఆత్మస్థైర్యంతో అడుగులేస్తారు. సన్నిహితుల ప్రోత్సాహం ఉంటుంది. పెట్టుబడులపై దృష్టి పెడతారు. ధనసహాయం తగదు. పత్రాలు సమయానికి కనిపించవు. చిన్న విషయానికే చికాకుపడతారు.
కుంభం : ధనిష్ట 3, 4 పాదాలు, శతభిషం, పూర్వాబాద్ర 1, 2, 3 పాదాలు
కార్యక్రమం విజయవంతమవుతుంది. పట్టుదలతో శ్రమించి అనుకున్నది సాధిస్తారు. పనులు చురుకుగా సాగుతాయి. వివాహయత్నం ఫలిస్తుంది. నిశ్చితార్ధంలో జాగ్రత్త. రావలసిన ధనం అందుతుంది. విలాస వస్తువులు కొనుగోలు చేస్తారు. నోటీసులు అందుకుంటారు.
మీనం : పూర్వాబాద్ర 4వ పాదం, ఉత్తరాబాద్ర, రేవతి
అవిశ్రాంతంగా శ్రమిస్తారు. ఆలోచనలు నిలకడగా ఉండవు. ఏ విషయాన్నీ సమస్యగా భావించవద్దు. ఊహించని ఖర్చు ఎదురవుతుంది. పనుల ప్రారంభంలో ఆటంకాలెదురవుతాయి. పత్రాల రెన్యువల్లో అలక్ష్యం తగదు. కొన్ని తప్పిదాలకు మూల్యం చెల్లించుకోవలసి వస్తుంది.