మేషం : అశ్వని, భరణి 1, 2, 3, 4 పాదములు, కృత్తిక 1వ పాదం
సంప్రదింపులతో తీరిక ఉండదు. శ్రమాధిక్యత, అకాలభోజనం. ఖర్చులు విపరీతం. ముఖ్యుల కలయిక వీలుపడదు. చేపట్టిన పనులు సాగవు. దూరపు బంధువులతో సంభాషిస్తారు. శుభకార్యానికి హాజరవుతారు. మీ బలహీనతలు అదుపులో ఉంచుకోండి.
వృషభం : కృత్తిక 2, 3, 4 పాదాలు, రోహిణి, మృగశిర 1, 2, పాదాలు
ప్రణాళికాబద్ధంగా యత్నాలు సాగిస్తారు. రావలసిన ధనం అందుతుంది. ఆర్భాటాలకు ఖర్చు చేస్తారు. అనుకోని సంఘటనలెదురవుతాయి. సన్నిహితులతో సంభాషిస్తారు. పెద్దల జోక్యంతో సమస్య సద్దుమణుగుతుంది. ప్రయాణం కలిసివస్తుంది.
మిథునం : మృగశిర 3, 4 పాదాలు, ఆర్ద్ర, పునర్వసు 1, 2, 3 పాదాలు
అనురాగవాత్సల్యాలు వెల్లివిరుస్తాయి. ఆత్మీయులతో సంభాషిస్తారు. కొత్త ఆలోచనలు స్ఫురిస్తాయి. ముందుచూపుతో తీసుకున్న నిర్ణయం సత్ఫలితమిస్తుంది. స్థిమితంగా పనులు పూర్తిచేస్తారు. ఖర్చులు విపరీతం. విదేశీ సందర్శనలకు యత్నాలు సాగిస్తారు.
కర్కాటకం : పునర్వసు 4వ పాదం, పుష్యమి, ఆశ్లేష
కార్యసిద్ధికి మరింత శ్రమించాలి. ఓర్పుతో యత్నాలు సాగించండి. సాయం ఆశించవద్దు. పెద్దఖర్చు ఎదురవుతుంది. అవసరాలు వాయిదా వేసుకుంటారు. సావకాశంగా పనులు పూర్తిచేస్తారు. ఒక సమాచారం ఉత్సాహాన్నిస్తుంది. క్రీడాపోటీల్లో రాణిస్తారు.
సింహం : మఖ, పుబ్బ, ఉత్తర 1వ పాదం
ఆర్థికంగా నిలదొక్కుకుంటారు. రుణసమస్య పరిష్కారమవుతుంది. ఖర్చులు సామాన్యం. ఆత్మీయులతో సంభాషిస్తారు. పనులు చురుకుగా సాగుతాయి. అనవసర జోక్యం తగదు. స్థిరచరాస్తుల వ్యవహారంలో అప్రమత్తంగా ఉండాలి. వాహనం ఇతరులకివ్వవద్దు.
కన్య : ఉత్తర 2, 3, 4 పాదాలు, హస్త, చిత్త 1, 2 పాదాలు
మనోధైర్యంతో యత్నాలు సాగిస్తారు. పరిస్థితులు అనుకూలిస్తాయి. సన్నిహితులు సాయం అందిస్తారు. ఖర్చులు అధికం, ప్రయోజనకరం. ఇంటి విషయాలపై దృష్టి పెడతారు. చిన్ననాటి పరిచయస్తులను కలుసుకుంటారు. ఆకస్మిక ప్రయాణం తలపెడతారు.
తుల : చిత్త 3, 4 పాదాలు, స్వాతి, విశాఖ 1, 2, 3 పాదాలు
అన్నివిధాలా కలిసివచ్చే సమయం. ఉత్సాహంగా పనులు పూర్తి చేస్తారు. బంధుత్వాలు బలపడతాయి. వ్యూహాత్మకంగా అడుగులేస్తారు. మీ కృషి ఫలిస్తుంది. ధనసహాయం తగదు. చెల్లింపులు, నగదు స్వీకరణలో జాగ్రత్త. మీ దృష్టి మరల్చేందుకు కొందరు యత్నిస్తారు.
వృశ్చికం : విశాఖ 4వ పాదం. అనూరాధ, జ్యేష్ట 1,2,3,4 పాదములు
కార్యం సిద్ధిస్తుంది. సమర్థతను చాటుకుంటారు. ప్రముఖులతో పరిచయాలేర్పడతాయి. సంప్రదింపులతో తీరిక ఉండదు. మొండి బాకీలు వసూలవుతాయి. అర్థాంతంగా ముగించిన పనులు పూర్తిచేస్తారు. దుబారా ఖర్చులు విపరీతం, ఆలయాలు సందర్శిస్తారు.
ధనస్సు : మూల, పూర్వాషాడ 1 2 3 4 పాదములు, ఉత్తరాషాడ 1వ పాదం
శుభకార్యాన్ని ఘనంగా చేస్తారు. దూరపు బంధుత్వాలు బలపడతాయి. మీ ఉన్నతి కొందరికి అపోహకలిగిస్తుంది. విమర్శలు, వ్యాఖ్యలు పట్టించుకోవద్దు. కొత్త పనులు మొదలెడతారు. పరిచయం లేని వ్యక్తులతో జాగ్రత్త. ఒత్తిళ్లు, ప్రలోభాలకు లొంగవద్దు.
మకరం : ఉత్తరాషాడ 2, 3, 4 పాదాలు. శ్రవణం, ధనిష్ట 1, 2 పాదాలు
లక్ష్యాన్ని సాధిస్తారు. మీ సామర్ధ్యంపై నమ్మకం కలుగుతుంది. ఆశలొదిలేసుకున్న ధనం అందుతుంది. ఖర్చులు సామాన్యం. చెల్లింపుల్లో జాగ్రత్త. పనులు, బాధ్యతలు పురమాయించవద్దు. అవగాహన లేని విషయాల్లో జోక్యం తగదు. శుభకార్యానికి హాజరవుతారు.
కుంభం : ధనిష్ట 3, 4 పాదాలు, శతభిషం, పూర్వాబాద్ర 1, 2, 3 పాదాలు
మనోధైర్యంతో యత్నాలు సాగించండి. ప్రతి వ్యవహారం ధనంతో ముడిపడి ఉంటుంది. రుణ సమస్యలు కొలిక్కివస్తాయి. పనుల్లో చికాకులు అధికం. ఆహ్వానం అందుకుంటారు. పరిచయాలు బలపడతాయి. సొంతంగా ఏదైనా చేయాలనే ఆలోచన బలపడుతుంది.
మీనం : పూర్వాబాద్ర 4వ పాదం, ఉత్తరాబాద్ర, రేవతి
ఆలోచనలు కార్యరూపం దాల్చుతాయి. నిర్దిష్ట ప్రణాళికలతో ముందుకు సాగుతారు. మీ బాధ్యతలను సక్రమంగా నిర్వహించండి. ఖర్చులు సామాన్యం. పరిచయస్తులు ధనసహాయం అర్ధిస్తారు. కొంతమొత్తం సాయం చేయండి. పనులు మొండిగా పూర్తిచేస్తారు.