వంటకాల్లో వెల్లుల్లిని వాడటం తప్పనిసరి. ఇది ఆరోగ్యానికి ఎంతో మేలు చేస్తుంది. శరీరంలో వ్యాధినిరోధక శక్తిని పెంచుతుంది. ఇది కొలెస్ట్రాల్‌ను నియంత్రిస్తుంది. ఇంకా అనారోగ్య సమస్యల నుంచి శరీరాన్ని కాపాడుతుంది. అయితే వంటల్లో వాడేందుకు మునుపు వెల్లుల్లి పొట్టును తీసేయడం అంత సులభం కాదు. ఇందుకు కాస్త చాలా సమయం తీసుకుంటుంది. అయితే ఈ టిప్స్ పాటించడం ద్వారా వెల్లుల్లి పొట్టును సులభంగా తొలగించవచ్చు.
వెల్లుల్లి రెబ్బలపైనున్న పొట్టును తొలగించడానికి వేడినీటిని ఉపయోగించవచ్చు. ఇందుకు మీరు చేయాల్సిందల్లా వెల్లుల్లి రెబ్బలను వేడి నీటిలో పది నిమిషాలు అలానే వుంచాలి. ఆపై వేడి తగ్గాక వెల్లుల్లి పొట్టును సులభంగా తొలగించవచ్చు.
అలాగే ఓ ప్లాస్టిక్ డబ్బాలో వెల్లుల్లి రెబ్బలను వేసి మూతపెట్టి బాగా షేక్ చేయడం ద్వారా వెల్లుల్లి పొట్టును సులభం తొలగించుకోవచ్చు. ఇంకా మీ ఇంట్లో మైక్రో ఓవెన్ కనుక వుంటే.. వెల్లుల్లి రెబ్బలను మైక్రో ఓవెన్‌లో పది నిమిషాలు వేడి చేసి ఆరిన తర్వాత వెల్లుల్లి రెబ్బల పొట్టును సులభంగా తొలగించవచ్చు.