ట్రూకాలర్ ఈరోజు డిజిటల్ భద్రత కుటుంబాలు పంచుకునే అనుభవముగా చేయటానికి రూపొందించబడిన ఒక కొత్త విశేషము, ఫ్యామిలీ ప్రొటెక్షన్ ప్రారంభాన్ని ప్రారంభించింది. ఆండ్రాయిడ్, iOS పైన ట్రూకాలర్ యాప్ లోకి నేరుగా అంతర్నిర్మితమైన, ఫ్యామిలీ ప్రొటెక్షన్, స్కామ్స్- అవాంఛనీయమైన కాల్స్ నుండి వాస్తవ-సమయ రక్షణను అందించుటకు యూజర్లు విశ్వసనీయమైన ఫ్యామిలీ గ్రూప్స్‌గా ఏర్పడే వీలు కలిగిస్తుంది. ఆండ్రాయిడ్ పైన, ఫ్యామిలీ అడ్మినిస్ట్రేటర్, ఇతర కుటుంబ సభ్యులకు సంభావ్య స్కామ్ కాల్స్ సమయములో హెచ్చరికలు అందుకోవచ్చు. దూరం నుండే అటువంటి కాల్స్‌ను ఎండ్ చేయవచ్చు.
కుటుంబ భద్రత కొరకు ఒక కొత్త ప్రతిపాదన
ఫ్యామిలీ ప్రొటెక్షన్ ద్వారా ఐదుగురు కలిసి స్కామ్ కాల్స్ నుండి సురక్షితంగా ఉండేందుకు సహాయపడే షేర్ చేయబడిన టూల్స్‌తో విశ్వసనీయమైన ఒక ఫ్యామిలీ గ్రూప్‌గా ఏర్పడవచ్చు. ప్రతి గ్రూప్‌లో రక్షణ స్థాయిలను ఏర్పాటు చేయగలిగే, బ్లాక్ లిస్ట్స్‌ను నిర్వహించగలిగే, అవాంఛనీయమైన కాల్స్‌ను ఎలా నిర్వహించాలో తెలియజేసే ఒక ఫ్యామిలీ అడ్మిన్ ఉంటారు. ఆండ్రాయిడ్ పైన అడ్మిన్ ఒక అనుమానాస్పద కాల్ వచ్చినప్పుడు సహాయానికి వచ్చేందుకు వాస్తవ-సమయ సహాయక టూల్స్ కూడా ఉపయోగించవచ్చు. అత్యంత అధునాతనమైన స్కామ్ కాల్స్ నుండి సాంకేతికత గురించి అంతగా తెలియని తమ ప్రియమైన వారిని రక్షించడం సులభతరం చేయడమే దీని లక్ష్యం.
శక్తివంతమైన రక్షణ, సుదూర నిర్వహణ
ఫ్యామిలీ ప్రొటెక్షన్ గ్రూప్‌లో భద్రత గురించి మార్గనిర్దేశనం చేయటానికి ఫ్యామిలీ అడ్మిన్‌కు టూల్స్‌ను అందిస్తుంది. ఫ్యామిలీ అడ్మిన్ రక్షణ స్థాయిలను ఏర్పరచవచ్చు, అప్డేట్ చేయవచ్చు, బ్లాక్ లిస్ట్స్‌ను నిర్వహించవచ్చు. అవసరమైనప్పుడు సుదూర సహాయక టూల్స్ ఉపయోగించవచ్చు. అండ్రాయిడ్ పై, అడ్మిన్ సంభావ్య స్కామ్ కాల్స్ సమయములో హెచ్చరికలు అందుకోవచ్చు, కుటుంబ సభ్యులకు అనుమానాస్పద కాల్స్ గురించి దూరం నుండే పంపించవచ్చు, బ్యాటరీ లెవెల్, ఫోన్ యాక్టివిటి మరియు అందుబాటు వంటి వాస్తవ-సమయ స్థితి సంకేతాలను చూడవచ్చు.
ఈ టూల్స్ కుటుంబాలకు తమ ప్రియమైన వారు వారి వారి ఫోన్స్ ఎలా ఉపయోగిస్తున్నారు అనేదాని గురించి స్పష్టమైన సమాచారం ఇస్తుంది మరియు అవసరమైనప్పుడు సహాయం చేయడానికి దోహదపడతాయి.
భాగస్వామ్యానికి మరియు ప్రీమియం మార్పిడి కొరకు వృద్ధి కారణాలు
ఫ్యామిలీ ప్రొటెక్షన్ ఒక ఉచిత ఫీచర్ కాని భాగస్వామ్యము, దీర్ఘ-కాలిక ఆదాయానికి కొత్త మార్గాన్ని తెరుస్తుంది. కుటుంబాలు ఒకరినొకరు రక్షించుకోవడములో సహాయపడటం ద్వారా, ట్రూకాలర్ రోజువారి కమ్యూనికేషన్లో తన పాత్రను బలోపేతం చేసుకుంటుంది. మళ్ళీమళ్ళీ ఉపయోగించడాన్ని ప్రోత్సహించే షేర్ చేయబడిన భద్రతను అందిస్తుంది.
శక్తివంతమైన రక్షణ స్థాయిని కోరుకునే కుటుంబాల కొరకు, ట్రూకాలర్ ప్రీమియం ఫ్యామిలీ ఒక సహజమైన అప్గ్రేడ్ ను అందిస్తుంది. ఈ ప్లాన్ ఐదుగురి వరకు కవర్ చేస్తుంది. ఆధునిక స్పామ్ బ్లాకింగ్, అధిక-రిస్క్ ఉన్న నంబర్ల ఆటోమాటిక్ తిరస్కరణ, యాడ్-ఫ్రీ అనుభవాన్ని అందిస్తుంది. ఇది పునరావృత సబ్స్క్రిప్షన్ ఆదాయాన్ని పెంచాలని, అధిక-విలువ ఫీచర్స్ ద్వారా యూజర్ స్టిక్కీనెస్ డ్రైవ్ చేయడము అనే ట్రూకాలర్ యొక్క వ్యూహాత్మక ఉద్దేశాన్ని నేరుగా సమలేఖనం చేస్తుంది.
దశలవారి అమలు, మార్కెట్ ఫోకస్
ఫ్యామిలీ ప్రొటెక్ష్న్ ముందుగా నాలుగు పైలట్ మార్కెట్స్‌లో అమలు చేయబడుతుంది. స్వీడెన్, చిలీ, మలేషియా మరియు కెన్యా. భారతదేశములో Q1 2026లో ప్రణాళిక చేయబడింది. ఈ దశలవారి అమలు వలన ట్రూకాలర్ తొలిదశ అమలు నుండి నేర్చుకొని మా అతిపెద్ద మార్కెట్లో మరింత విస్తృతమైన నియోగానికి సిద్ధం కావచ్చు.
భవిష్యత్ ఆలోచన
ఫ్యామిలీ ప్రొటెక్షన్ అనేది ట్రూకాలర్ యొక్క ఉత్పత్తి వ్యూహాలలో ఒక ముఖ్యమైన దశ. దీనితో ట్రూకాలర్ కాల్ గుర్తింపు నుండి కమ్యూనికేషన్ భద్రత వైపుకు అడుగువేసింది. ఇది కంపెనీ యొక్క రేపటి కమ్యూనికేషన్‌ను తెలివైనదిగా, సురక్షితమైనదిగా, మరింత సమర్థవంతమైనదిగా చేయాలనే దీర్ఘ-కాలిక ఆశయాన్ని ప్రతిబింబిస్తుంది.
కుటుంబ సభ్యులచే ట్రూకాలర్ ఇప్పటికే ఉపయోగించబడుతోంది, ఇప్పుడు మేము కుటుంబము యొక్క సిటిఓకు సాంకేతికత గురించి తక్కువగా తెలిసిన సభ్యులను రక్షించే అధికారాన్ని ఇస్తున్నాము అని రిషిత్ ఝున్‌ఝున్‌వాలా, సీఈఓ, ట్రూకాలర్ అన్నారు. స్కామ్ పన్నాగాలు పెరుగుతున్న నేపథ్యములో, కుటుంబాలు మనశ్శాంతి మరియు క్రియాశీలక రక్షణ కొరకు ఆధారపడే ఒక ప్లాట్ఫార్మ్‌గా ట్రూకాలర్ కావాలని మేము ఆశిస్తున్నాము.