సఫల ఏకాదశి తిథి డిసెంబర్ 14, 2025 ఆదివారం సాయంత్రం 06:49 గంటలకు ప్రారంభమై.. డిసెంబర్ 15, 2025 సోమవారం రాత్రి 09:19 గంటలకు ముగుస్తుంది. సూర్యోదయ తిథిని బట్టి ఏకాదశి ఉపవాసాన్ని డిసెంబర్ 15న ఆచరిస్తారు. మరుసటి రోజు అంటే డిసెంబర్ 16వ తేదీన ఉపవాసం విరమించాలి. ఎందుకంటే ఈరోజు ద్వాదశితో కూడిన ఏకాదశి. ఏకాదశి లేదా ద్వాదశి తిథి ఉండే రోజున ఏకాదశి ఉపవాసం చేయవచ్చు
ఈ రోజున విష్ణువు పూజలో తులసిని ఉంచడం మరచిపోకండి. పండ్లు, స్వీట్స్ తోపాటు పాయసాన్ని కూడా నైవేద్యంగా పెట్టండి. ఓం నమో భగవతే వాసుదేవాయ మంత్రాన్ని జపిస్తూ.. విష్ణు సహస్రనామ పారాయణం చేయండి. సాయంత్రం సమయంలో తులసి మెుక్క దగ్గర దీపం వెలిగించండి.
రాత్రంతా జాగరణ చేస్తూ శ్రీహరి పాటలు, భజనలు, కీర్తనలు పాడుతూ తరించండి. ఉల్లిపాయ, వెల్లుల్లి, మాంసాహారం వంటి తామసిక ఆహారాలను తీసుకోకూడదు. మార్గశిర మాసం అత్యంత పవిత్రమైన మాసం. ఈ మార్గశిర మాసంలో భగవంతుడికి చేసే పూజలు, ఆచరించే ఉపవాసాలు, దానధర్మాలు విశిష్టమైన ఫలితాలను ప్రసాదిస్తాయని శాస్త్రవచనం.
పవిత్రమైన సఫల ఏకాదశి రోజు శ్రీ మహావిష్ణువును ఉసిరి కాయలతో, దానిమ్మ పండ్లతో పూజిస్తే సకల సంపదలు, సౌభాగ్యం, ఐశ్వర్యం చేకూరుతుందని చెబుతారు. అంతే కాకుండా ఈ సఫల ఏకాదశి రోజున ఆలయాల్లో దీపాలు వెలిగించి జాగరణ చేస్తే ఎన్నో ఏళ్ల పాటు తపస్సు చేసిన ఫలితం దక్కుతుందట.