Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

Tomato Soup: శీతాకాలంలో టమోటా సూప్ తీసుకుంటే?

Advertiesment
Tomato Soup

సెల్వి

, శుక్రవారం, 12 డిశెంబరు 2025 (21:52 IST)
Tomato Soup
శీతాకాలంలో చర్మం పొడిబారడానికి చెక్ పెట్టే టమోటా సూప్‌ను ఇంట్లోనే ఎలా తయారు చేయాలో చూద్దాం.. 
 
కావలసిన పదార్థాలు:
టమోటాల పేస్ట్ - ఒక కప్పు 
ధనియాల పొడి - ఒక స్పూన్ 
మిరియాల పొడి - అర స్పూన్ 
ఉప్పు - తగినంత 
నీరు - 3 గ్లాసులు 
కొత్తిమీర తరుగు - కాసింత 
 
తయారీ విధానం:
ముందుగా స్టౌ మీద పాన్‌ను వుంచి మూడు నుంచి నాలుగు గ్లాసుల నీటిని చేర్చాలి. బాగా మరిగిన తర్వాత అందులో టమోటా పేస్టును కలిపి బాగా మరిగించాలి. ఈ మిశ్రమాన్ని గడ్డకట్టకుండా కలుపుతూ వుండాలి. ఆపై ఈ టమోటా మిశ్రమాన్ని ఒక బౌల్‌లోకి తీసుకోవాలి. అందులో ధనియాల పొడి, మిరియాల పొడి, ఉప్పు తగినంత కలిపి.. చివరిగా కొత్తిమీర తరుగు చేర్చి సర్వ్ చేస్తే టేస్ట్ అదిరిపోతుంది. ఈ టమోటా సూప్ తీసుకోవడం ద్వారా శీతాకాలంలో జీర్ణ సమస్యలను పక్కనబెట్టవచ్చు. ఈ సూప్ వ్యాధినిరోధక శక్తిని పెంచుతుంది. తద్వారా జలుబు, దగ్గు వంటి సమస్యలుండవ్. చర్మం పొడిబారడం వుండదని ఆరోగ్య నిపుణులు సూచిస్తున్నారు. 

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

నీలి రంగు శంఖులో ఇన్ని ఆరోగ్య ప్రయోజనాలా..? మహిళలు శంఖు పువ్వు టీ తాగితే?