Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

రియల్‌మీ నుంచి కొత్త స్మార్ట్ ఫోన్.. Realme P4x 5G ఫీచర్స్ ఇవే..

Advertiesment
Realme P4x 5G

సెల్వి

, శుక్రవారం, 5 డిశెంబరు 2025 (09:50 IST)
Realme P4x 5G
ప్రముఖ స్మార్ట్‌ఫోన్ బ్రాండ్ రియల్‌మీ నుంచి కొత్త స్మార్ట్ ఫోన్ మార్కెట్లోకి వచ్చింది. లేటెస్ట్‌గా రియల్ మీ పి సిరీస్‌లో నుంచి కొత్తగా మరో స్మార్ట్ ఫోన్ రిలీజ్ చేసింది. Realme P4x 5G అనే పేరుతో లాంఛ్ అయిన ఈ మొబైల్‌ని భారత మార్కెట్లో అధికారికంగా విడుదల చేసింది. 
 
భారీ బ్యాటరీ, శక్తివంతమైన ప్రాసెసర్, స్టైలిష్ డిజైన్‌లతో ఉన్న ఈ ఫోన్.. బడ్జెట్ రేంజ్‌లో ఈ కేటగిరీలో ఉన్న స్మార్ట్‌ఫోన్‌లకు మార్కెట్లో మంచి పోటీ ఇస్తుందని అంచనా వేస్తున్నారు. అంతే కాకుండా మ్యాట్ సిల్వర్, ఎలిగెంట్ పింక్, లేక్ గ్రీన్ అనే మూడు స్టైలిష్ కలర్లలో అందుబాటులోకి వచ్చింది. 
 
ఫోన్ వెనుక భాగం మ్యాట్ ఫినిష్‌తో ఉండటం వల్ల ఫింగర్‌ప్రింట్లు సులభంగా కనిపించకుండా ఉంటుంది. IP64 రేటింగ్‌తో ధూళి, నీటి తుంపర్ల నుండి రక్షణ కల్పించడం వల్ల అవుట్‌డోర్ యూజర్లకు కూడా ఇది మంచి ఎంపికగా మారింది.
 
ఫీచర్స్:
ఈ ఫోన్ 6.72-అంగుళాల Full HD+ LCD డిస్‌ప్లే
144Hz రిఫ్రెష్ రేట్‌తో గేమింగ్, స్క్రోలింగ్ మరింత స్మూత్‌గా అనిపిస్తుంది. 
అదనంగా 1,000 నిట్స్ పీక్ బ్రైట్‌నెస్ ఇవ్వడం వల్ల బాహ్య ప్రకాశంలో కూడా స్క్రీన్ స్పష్టంగా కనిపిస్తుంది. ఇది వీడియోలు, రీల్స్ చూసే వారికి ఇది మంచి విజువల్ ఎక్స్‌పీరియన్స్ అందిస్తుంది.
 
ధరలు అండ్ వేరియంట్లు.. 
Realme P4x 5G మూడు వేరియంట్లలో అందుబాటులో ఉంది
6GB + 128GB - రూ.15,499 
8GB + 128GB - రూ.16,999 
8GB + 256GB - రూ.17,999

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

ప్రకాశం జిల్లాలో కంపించిన భూమి.. రోడ్లపైకి పరుగులు తీసిన ప్రజలు