''బ్రేకప్'' అంటున్న విజయ్ దేవరకొండ.. ఎవరితో? ఆ ముగ్గురితోనా?

మంగళవారం, 17 సెప్టెంబరు 2019 (17:15 IST)
టాలీవుడ్ యంగ్ హీరో విజయ్ దేవరకొండ పెళ్లి చూపులు సినిమాతో హీరోగా ఎంట్రీ ఇచ్చాడు. పెళ్లి చూపులు సినిమా హిట్ కావడంతో విజయ్ క్రేజ్ అమాంతం పెరిగింది. ఆ తర్వాత ద్వారకా సినిమాలో నటించాడు. కానీ ఆ సినిమా నిరాశపరిచింది. అటు పిమ్మట అర్జున్ రెడ్డ్డి సినిమాతో ఓవర్ నైట్ స్టార్‌గా మారిపోయాడు. ప్రపంచ వ్యాప్తంగా విజయ్ పేరు ఒక్కసారిగా మారుమోగిపోయింది. 
 
ఆ చిత్రంలో యాక్టింగ్‌కు సూపర్ మార్కులు పడిపోయాయి. ఆపై గీత గోవిందం, టాక్సీవాలా చిత్రాలు బ్లాక్ బాస్టర్ హిట్ అయ్యాయి. నోటా, డియర్ కామ్రేట్ చిత్రాలు నిరాశనే మిగిలిచ్చాయి. అలా అయన సినిమాలతో దూసుకుపోతున్నాడు. తాజాగా అయన లవ్‌లో ఫెయిల్ అయ్యాడట. విజయ్ ఎప్పుడు ప్రేమలో పడ్డాడు ఎప్పుడు ఫెయిల్ అయ్యాడో అని ఫ్యాన్స్ అనుకుంటూవుంటారు. కానీ నిజజీవితంలో కాదు.. సినిమాలో. కాంత్రి మాధవన్ దర్శకత్వంలో విజయ్ ఓ సినిమా చేయబోతున్నాడు. 
 
ఈ సినిమా టైటిల్‌ ఫిక్స్ అయ్యింది. ''బ్రేకప్'' అనే టైటిల్‌ను ఖరారు చేశారట. దానికి వరల్డ్ ఫేమస్ లవర్ ట్యాగ్ కూడా జతచేసారు. రాశికన్నా, ఐశ్వర్యా రాజేష్, ఎజిబెల్లాతో పాటుగా మరో ముగ్గురు హీరోయిన్లు ఇందులో నటిస్తున్నారు. చివరి రెండు సినిమాలు ఫ్లాప్ కావడంతో.. ఈ సినిమా అయినా అతని ఖాతాలో హిట్‌ను వేస్తుందో లేదో వేచి చూడాలి. 

వెబ్దునియా పై చదవండి

తర్వాతి కథనం బ‌న్నీ.. ఆ డైరెక్ట‌ర్‌కి హ్యాండ్ ఇచ్చాడా..?