Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

ప్రేమికుల రోజున అభిషేక్ శర్మ, లైలా ఫైసల్ వివాహం.. నిజమేనా?

Advertiesment
Abhishek Sharma
Abhishek Sharma
టీమిండియా యువ సెన్సేషన్ అభిషేక్ శర్మ త్వరలోనే పెళ్లి చేసుకోబోతున్నారంటూ సోషల్ మీడియాలో వస్తున్న వార్తలు ఇప్పుడు హాట్ టాపిక్ అయ్యాయి. అభిషేక్ శర్మ, లైలా ఫైసల్ అనే అమ్మాయితో పీకల్లోతు ప్రేమలో ఉన్నారని, త్వరలోనే వీరిద్దరూ పెళ్లి పీటలెక్కబోతున్నారని సోషల్ మీడియాలో ఓ పోస్ట్ వైరల్ అవుతోంది. 
 
ముఖ్యంగా ఫిబ్రవరి 14, 2026న వాలెంటైన్స్ డే వీరి వివాహం జరగనుందని ప్రచారం సాగుతోంది. అయితే ఈ విషయంలో అభిషేక్ కానీ, ఆయన కుటుంబం కానీ ఎలాంటి అధికారిక ప్రకటన చేయలేదు. 
 
అయితే ఫిబ్రవరి 15న పాకిస్థాన్‌తో టీ20 వరల్డ్ కప్ మ్యాచ్ ఉన్న నేపథ్యంలో అంతకుముందు రోజు పెళ్లి చేసుకోవడం సాధ్యం కాదని.. ఇది కేవలం పుకారు మాత్రమేనని క్రీడా విశ్లేషకులు కొట్టిపారేస్తున్నారు.
 
లైలా ఫైసల్ గురించి ప్రజల్లో విపరీతమైన ఆసక్తి నెలకొంది. లైలా ఫైసల్ 2000వ సంవత్సరంలో ఢిల్లీలో జన్మించారు. వారి కుటుంబం కశ్మీర్‌కు చెందినది. ఆమె లండన్‌లోని కింగ్స్ కాలేజీలో సైకాలజీలో గ్రాడ్యుయేషన్ పూర్తి చేశారు. 
 
ఫ్యాషన్ రంగంపై ఉన్న మక్కువతో లండన్ యూనివర్సిటీ ఆఫ్ ఆర్ట్స్ నుంచి ఫ్యాషన్ డిజైనింగ్ కోర్స్ చేశారు. ప్రస్తుతం ఆమె ఒక విజయవంతమైన ఫ్యాషన్ ఎంటర్‌ప్రెన్యూర్.

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

పనిమనిషిని ఫామ్‌హౌస్‌కు తీసుకెళ్లాడు.. ఆపై అత్యాచారానికి పాల్పడిన పాక్ క్రికెటర్ కుమారుడు