Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

28-01-2026 బుధవారం ఫలితాలు - మొండిగా పనులు పూర్తి చేస్తారు...

Advertiesment
thularaashi
మేషం : అశ్వని, భరణి 1, 2, 3, 4 పాదములు, కృత్తిక 1వ పాదం
ఆత్మస్థైర్యంతో అడుగు ముందుకేస్తారు. అవకాశం కలిసివస్తుంది. స్థిరాస్తి ధనం అందుకుంటారు. ఖర్చులు అధికం. పెద్దమొత్తం, చెల్లింపుల్లో జాగ్రత్త. దూరపు బంధువులతో సంభాషిస్తారు. కావలసిన వ్యక్తుల కలయిక వీలుపడదు. పనులు అస్తవ్యస్తంగా సాగుతాయి. 
 
వృషభం : కృత్తిక 2, 3, 4 పాదాలు, రోహిణి, మృగశిర 1, 2, పాదాలు
లావాదేవీలు కొలిక్కివస్తాయి. రావలసిన ధనం అందుతుంది. రుణవిముక్తులవుతారు. పలుకుబడి కలిగిన వ్యక్తులతో పరిచయాలేర్పడతాయి. కొత్త యత్నాలకు శ్రీకారం చుడతారు. ఓర్పు, పట్టుదలతో శ్రమించండి. జూదాలు, బెట్టింగులకు పాల్పడవద్దు. 
 
మిథునం : మృగశిర 3, 4 పాదాలు, ఆర్ద్ర, పునర్వసు 1, 2, 3 పాదాలు
ప్రతికూలతలను ధైర్యంగా ఎదుర్కుంటారు. వ్యవహారాలతో తీరిక ఉండదు. ఒక సమాచారం ఆలోచింపచేస్తుంది. అనుభవజ్ఞులను సంప్రదిస్తారు. ఖర్చులు విపరీతం. మితంగా సంభాషించండి. పనులు పురమాయించవద్దు. ఎదురుచూస్తున్న పత్రాలు అందుతాయి. 
 
కర్కాటకం : పునర్వసు 4వ పాదం, పుష్యమి, ఆశ్లేష
కార్యసిద్ధికి సంకల్ప బలం ముఖ్యం. కొందరి వ్యాఖ్యలు ఉద్రేకపరుస్తాయి. సంయమనం పాటించండి. ఖర్చులు సంతృప్తికరం. పనులు సావకాశంగా పూర్తి చేస్తారు. ఆచితూచి అడుగేయండి. మొహమ్మాటాలు, భేషజాలకు పోవద్దు. వివాదాలు సద్దుమణుగుతాయి.
 
సింహం : మఖ, పుబ్బ, ఉత్తర 1వ పాదం
గ్రహస్థితి అనుకూలంగా ఉంది. నిర్విరామంగా శ్రమిస్తారు. మీ కష్టం ఫలిస్తుంది. లావాదేవీల్లో సముచిత నిర్ణయాలు తీసుకుంటారు. ఆర్థికంగా ఫర్వాలేదనిపిస్తుంది. ఉల్లాసంగా గడుపుతారు. బాధ్యతలు అప్పగించవద్దు. నమ్మిన వారే తప్పుదారి పట్టించేందుకు యత్నిస్తారు. 
 
కన్య : ఉత్తర 2, 3, 4 పాదాలు, హస్త, చిత్త 1, 2 పాదాలు
పట్టుదలతో శ్రమిస్తే విజయం తధ్యం. మీ సామర్థంపై నమ్మకం పెంచుకోండి. సాయం ఆశించవద్దు. స్వయంకృషితోనే లక్ష్యాన్ని సాధిస్తారు. ఖర్చులు అదుపులో ఉండవు. పొదుపు ధనం గ్రహిస్తారు. ప్రముఖుల సందర్శనం వీలుపడదు. పనులు మొక్కుబడిగా పూర్తి చేస్తారు. 
 
తుల : చిత్త 3, 4 పాదాలు, స్వాతి, విశాఖ 1, 2, 3 పాదాలు
ధనలాభం, వస్త్రప్రాప్తి ఉన్నాయి.. ఆర్భాటాలకు విపరీతంగా ఖర్చుచేస్తారు. బంధుమిత్రులతో సంభాషిస్తారు. ఒక సమాచారం ఉత్సాహాన్నిస్తుంది. సకాలంలో పనులు పూర్తి చేస్తారు. మీ సమర్ధతపై నమ్మకం కలుగుతుంది. ఆటంకాలు ఎదురైనా ముందుకు సాగుతారు. 
 
వృశ్చికం : విశాఖ 4వ పాదం. అనూరాధ, జ్యేష్ట 1,2,3,4 పాదములు
కార్యసాధనకు సంకల్పబలం ముఖ్యం. ఆశావహదృక్పథంతో యత్నాలు సాగించండి. అవకాశాలను వదులుకోవద్దు. పనులు మొక్కుబడిగా పూర్తి చేస్తారు. ఖర్చులు అంచనాలను మించుతాయి. అవసరాలకు ధనం సర్దుబాటవుతుంది. ఏకాగ్రతతో వాహనం నడపండి.
 
ధనస్సు : మూల, పూర్వాషాడ 1 2 3 4 పాదములు, ఉత్తరాషాడ 1వ పాదం
లావీదేవీలతో తీరిక ఉండదు. స్థిమితంగా ఆలోచించి నిర్ణయం తీసుకోండి. చేపట్టిన పనులు సకాలంలో పూర్తి చేస్తారు. ఆర్భాటాలకు వ్యయం చేస్తారు. ఆచితూచి అడుగువేయండి. సన్నిహితులతో సంభాషణ ఉత్సాహపరుస్తుంది. కీలక సమావేశాల్లో పాల్గొంటారు. 
 
మకరం : ఉత్తరాషాడ 2, 3, 4 పాదాలు. శ్రవణం, ధనిష్ట 1, 2 పాదాలు
కలిసివచ్చే సమయం. యత్నాలకు పెద్దల ఆశీస్సులుంటాయి. అవకాశాలను సద్వినియోగం చేసుకుంటారు. సకాలంలో చెల్లింపులు జరుపుతారు. పనుల్లో ఒత్తిడి అధికం. ముఖ్యుల సందర్శనం వీలుపడదు. లైసెన్సులు, పర్మిట్ల రెన్యువల్లో ఏకాగ్రత వహించండి. 
 
కుంభం : ధనిష్ట 3, 4 పాదాలు, శతభిషం, పూర్వాబాద్ర 1, 2, 3 పాదాలు
తలపెట్టిన కార్యం విజయవంతమవుతుంది. మాట నిలబెట్టుకుంటారు. ప్రముఖులతో పరిచయాలు ఏర్పడతాయి. ఆశించిన ఆశించిన పదవి దక్కకపోవచ్చు. బాధ్యతల నుంచి తప్పుకుంటారు. మొండిగా పనులు పూర్తి చేస్తారు. ముఖ్యమైన పత్రాలు అందుకుంటారు.
 
మీనం : పూర్వాబాద్ర 4వ పాదం, ఉత్తరాబాద్ర, రేవతి
కార్యసిద్ధికి ఓర్పుతో శ్రమించండి. సలహాలు, సాయం ఆశించవద్దు. మీ కృషి వెంటనే ఫలిస్తుంది. ఊహించని ఖర్చులు ఆందోళన కలిగిస్తాయి. ఆలోచనలతో సతమతమవుతారు. ఆత్మీయులతో సంభాషణ ఉత్సాహపరుస్తుంది. కార్యక్రమాలు వాయిదా వేసుకుంటారు.

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

జనవరి 28 నుండి 31 వరకు మేడారం జాతర.. భారీ స్థాయిలో భక్తులు