Publish Date: Fri, 23 Jan 2026 (04:00 IST)
Updated Date: Thu, 22 Jan 2026 (19:53 IST)
మేషం : అశ్వని, భరణి 1, 2, 3, 4 పాదములు, కృత్తిక 1వ పాదం
ప్రణాళికలు వేసుకుంటారు. పనులు ఒక పట్టాన సాగవు. సన్నిహితులతో సంభాషిస్తారు. ఒక సమాచారం ఆలోచింపచేస్తుంది. సోదరులను సంప్రదిస్తారు. ఎదుటివారి అభిప్రాయాలకు విలువ ఇవ్వండి. నగదు, ఆభరణాలు జాగ్రత్త. బాధ్యతలు అప్పగించవద్దు.
వృషభం : కృత్తిక 2, 3, 4 పాదాలు, రోహిణి, మృగశిర 1, 2, పాదాలు
పరిస్థితులు అనుకూలిస్తాయి. ప్రతికూలతలను అనుకూలంగా మలుచుకుంటారు. పనుల సానుకూలతకు మరింత శ్రమించాలి. దూరపు బంధువులతో సంభాషిస్తారు. ఖర్చులు అధికం. ముఖ్యుల కలయిక వీలుపడదు. అసాంఘిక కార్యకలాపాల జోలికి పోవద్దు.
మిథునం : మృగశిర 3, 4 పాదాలు, ఆర్ద్ర, పునర్వసు 1, 2, 3 పాదాలు
వ్యవహారాలతో తీరిక ఉండదు. చిన్న విషయానికే ఆందోళన చెందుతారు. ఒత్తిడికి గురికావద్దు. సన్నిహితుల వ్యాఖ్యలు కార్యోన్ముఖులను చేస్తాయి. మనోధైర్యంతో యత్నాలు సాగిస్తారు. పనులు వేగవంతమవుతాయి. ఖర్చులు విపరీతం. అవసరాలు వాయిదా వేసుకుంటారు.
కర్కాటకం : పునర్వసు 4వ పాదం, పుష్యమి, ఆశ్లేష
అన్ని విధాలా కలిసివచ్చే సమయం. నిర్దిష్ట ప్రణాళికలతో ముందుకు సాగుతారు. రావలసిన ధనం అందుతుంతది. ఆర్భాటాలకు విపరీతంగా వ్యయం చేస్తారు. పనులు, బాధ్యతలు అప్పగించవద్దు. ఆరోగ్యం బాగుంటుంది. మీ సాయంతో ఒకరికి మేలు జరుగుతుంది.
సింహం : మఖ, పుబ్బ, ఉత్తర 1వ పాదం
లక్ష్యసాధనకు ఓర్పు ప్రధానం. నిరుత్సాహం వీడి యత్నాలు సాగించండి. సాయం ఆశించవద్దు. ఊహించని ఖర్చు ఆందోళన కలిగిస్తుంది. అవసరాలు వాయిదా వేసుకుంటారు. మొక్కుబడిగా పనులు పూర్తి చేస్తారు. పత్రాల రెన్యువల్లో ఏకాగ్రత వహించండి.
కన్య : ఉత్తర 2, 3, 4 పాదాలు, హస్త, చిత్త 1, 2 పాదాలు
ఖర్చులు సామాన్యం. ఆలోచనలు కార్యురూపం దాల్చుతాయి. వ్యాపకాలు సృష్టించుకుంటారు. పనులు వేగవంతమవుతాయి. ఒక సమాచారం ఆలోచింపచేస్తుంది. ముక్కుసూటిగా పోయే మీ వైఖరి వివాదాస్పదమవుతుంది. గృహమార్పునకు యత్నాలు సాగిస్తారు.
తుల : చిత్త 3, 4 పాదాలు, స్వాతి, విశాఖ 1, 2, 3 పాదాలు
సమర్ధతను చాటుకుంటారు. సభ్యత్వాల స్వీకరణకు అనుకూలం. వ్యతిరేకులు సన్నిహితులవుతారు. ఉన్నతిని చాటుకోవటానికి విపరీతంగా వ్యయం చేస్తారు. కొందరి రాక ఇబ్బంది కలిగిస్తుంది. పనులు అర్థాంతంగా ముగిస్తారు. కీలక చర్చల్లో పాల్గొంటారు.
వృశ్చికం : విశాఖ 4వ పాదం. అనూరాధ, జ్యేష్ట 1,2,3,4 పాదములు
వ్యవహారానుకూలత ఉంది. విజ్ఞతతో వ్యవహరిస్తారు. దూరపు బంధువులను కలుసుకుంటారు. ప్రణాళికాబద్ధంగా పనులు పూర్తి చేస్తారు. ఆరోగ్యం జాగ్రత్త. అతిగా శ్రమించవద్దు. పిల్లల దూకుడు అదుపు చేయండి. విదేశాల సందర్శనకు యత్నాలు సాగిస్తారు.
ధనస్సు : మూల, పూర్వాషాడ 1 2 3 4 పాదములు, ఉత్తరాషాడ 1వ పాదం
పరిస్థితులు అనుకూలిస్తాయి. ధైర్యంగా ముందుకు సాగుతారు. యత్నాలకు ఆప్తుల ప్రోత్సాహం ఉంటుంది. ఖర్చులు తగ్గించుకుంటారు. సకాలంలో పనులు పూర్తి చేస్తారు. ముందుచూపుతో తీసుకున్న నిర్ణయం సత్ఫలితమిస్తుంది. ముఖ్యమైన పత్రాలు అందుతాయి.
మకరం : ఉత్తరాషాడ 2, 3, 4 పాదాలు. శ్రవణం, ధనిష్ట 1, 2 పాదాలు
ఆకస్మిక ఖర్చులు ఆందోళన కలిగిస్తాయి. ఒక అవసరానికి ఉంచిన ధనం మరోదానికి వ్యయం చేస్తారు. చెల్లింపుల్లో అలక్ష్యం తగదు. పనులు, బాధ్యతలు స్వయంగా చూసుకోండి. ఇతరుల విషయాల్లో జోక్యం తగదు. దంపతుల మధ్య అవగాహన నెలకొంటుంది.
కుంభం : ధనిష్ట 3, 4 పాదాలు, శతభిషం, పూర్వాబాద్ర 1, 2, 3 పాదాలు
ఏకాగ్రతతో కార్యసాధనకు శ్రమిస్తారు. ఒత్తిడి పెరగకుండా చూసుకోండి. పనుల్లో ఒత్తిడి, శ్రమ అధికం. ప్రణాళికలు వేసుకుంటారు. ఖర్చులు సామాన్యం. పొదుపు పథకాల పట్ల ఆకర్షితులవుతారు. విందుకు హాజరవుతారు. మీ బలహీనతలు అదుపులో ఉంచుకోండి.
మీన : పూర్వాబాద్ర 4వ పాదం, ఉత్తరాబాద్ర, రేవతి
రోజువారీ ఖర్చులే ఉంటాయి. గృహం ప్రశాంతంగా ఉంటుంది. ఆత్మీయులతో సంభాషిస్తారు. ప్రభుత్వ కార్యాలయాల్లో పనులు సానుకూలమవుతాయి. ఎదురుచూస్తున్న పత్రాలు అందుకుంటారు. ముఖ్యుల కలయిక వీలుపడదు. ధైర్యంగా యత్నాలు కొనసాగిస్తారు.