తులసి కోట ఏ దిశలో అమర్చాలి..?

మంగళవారం, 13 నవంబరు 2018 (12:44 IST)
ప్రతి ఇంటి లోగిళ్ళలో తులసికోట పెంచడం అన్నది ఆనవాయితీ. కానీ కొత్తగా ఇంటి నిర్మాణాలు చేసిన వారు ఇళ్ళల్లో తులసికోట ఎటువైపు ఉంచాలి అనే విషయం గురించి తెలియక సతమతమవుతుంటారు. ఆయుర్వేద వైద్యంలో తులసికి ముఖ్యమైన స్థానం ఉండడమే కాకుండా తులసి మొక్క నుంచి వీచే గాలి చాలా కూడా పరిశుద్ధంగా ఉంటుందని పండితులు చెప్తున్నారు. వాస్తు శాస్త్రం ప్రకారం కొన్ని పద్ధతులు పాటిస్తే మంచి ఫలితాలు లభిస్తాయి.
 
ఉత్తర వాయవ్యంలో లేదా తూర్పు వాయవ్యంలో గానీ తులసి కోటను నిర్మించాలంటే నేల ఎత్తుకు కొంచెం తక్కువగా ఉండేలా నిర్మాణం చేయాలి. తులసికోట చుట్టూ ప్రదక్షిణం చేసేందుకు వీలుగా ఖాళీ స్థలం ఉంచాలి. ఎట్టి పరిస్థితుల్లోనూ సరిహద్దు గోడలను ఆనుకుని తులసి కోట నిర్మాణం చేపట్టరాదు.
 
దక్షిణం దిక్కులో తులసి కోటను నిర్మించుకోదలచినవారు నేల మట్టానికి సమానంగా ఉండకుండా చూసుకోవాలి. కొంచెం ఎత్తు లేదా మరి కొంచెం పల్లంలోగానీ నిర్మించాలి. అలాగే పశ్చిమ దిక్కులో తులసికోటను అమర్చాలంటే నేల ఎత్తుగా లేక లోతుగా ఉండాలి. 
 
ఈశాన్యం, తూర్పు ఈశాన్యం, ఉత్తర ఈశాన్య దిశల్లో కుండీలను, తులసికోటను ఉంచరాదు. అలా చేస్తే ఈశాన్యం బరువు పెరిగినట్లై వినాశనానికి దారి తీస్తుంది. పూలకుండీలలో పెంచుకునే తులసికోటను నైరుతి, దక్షిణ ఆగ్నేయ, పశ్చిమ వాయువ్య దిశల్లో మాత్రమే ఉంచాలని వాస్తు నిపుణులు చెబుతున్నారు. 

వెబ్దునియా పై చదవండి

తర్వాతి కథనం ఇలా చేస్తే శాశ్వత కీర్తి ఖాయం...