Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

Taapsee Pannu: బాలీవుడ్‌లో క్లీవేజ్ చూపిస్తే.. సౌత్‌లో నాభిపైనే ఫోకస్ చేస్తారు.. తాప్సీ

Advertiesment
Tapsee pannu
ప్రముఖ హీరోయిన్ తాప్సీ దక్షిణాది సినీ ఇండస్ట్రీపై చేసిన కామెంట్లు సంచలనం సృష్టిస్తున్నాయి. సినిమా ఇండస్ట్రీలో ఒక్కో చోట ఒక్కోలా హీరోయిన్ల శరీర భాగాలను హైలైట్ చేస్తారని తెలిపారు. ముఖ్యంగా హిందీ సినిమాల్లో క్లీవేజ్ చూపిస్తే, సౌత్ సినిమాల్లో మాత్రం నాభి పైన ఎక్కువ ఫోకస్ పెడతారని ఆమె అన్నారు. 
 
ఈ కామెంట్స్ ఇప్పుడు సోషల్ మీడియాలో బాగా వైరల్ అవుతున్నాయి. అస్సీ సినిమా ప్రమోషన్లలో భాగంగా తాప్సీ మాట్లాడుతూ.. తన కెరీర్ మొదట్లో తెలుగు, తమిళ సినిమాల్లో నటించేటప్పుడు ఎదురైన చేదు అనుభవాలను కూడా తాప్సీ బయటపెట్టారు. కొన్ని పాటల షూటింగ్ సమయంలో తనను ప్యాడెడ్ బ్రాలు వేసుకోమని పరోక్షంగా ఒత్తిడి చేసేవారని ఆమె చెప్పారు. 
 
ఈ విషయాన్ని దర్శకులు నేరుగా చెప్పకుండా వారి అసిస్టెంట్ల ద్వారా చెప్పించేవారని, అది తనకు చాలా ఇబ్బందిగా అనిపించేదని ఆమె ఆవేదన వ్యక్తం చేశారు. కేవలం అందం కోసం హీరోయిన్లపై ఇలాంటి ఒత్తిడి తీసుకురావడం సరైనది కాదని తాప్సీ తెలిపారు.

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

Rishab Shetty: హంపి అంజనాద్రిలో రిషబ్ శెట్టి హీరోగా జై హనుమాన్ గ్రాండ్ గా లాంచ్