Webdunia - Bharat's app for daily news and videos

Install App

మహాత్మునికి మరో అరుదైన గౌరవం

Webdunia
శుక్రవారం, 5 జులై 2019 (17:21 IST)
వికీ పీడియా... ఇది ప్రపంచవ్యాప్తంగా పరిచయం ఉన్నదే. ప్రపంచంలోని ఏ సంఘటన, వ్యక్తుల సమాచారం అయినా వికీపీడియాలో నోట్ చేస్తుంటారు. ఆ సమాచారాన్నే చాలామంది అనుసరిస్తూ ఉంటారు. ఇదే తరహాలో ఇప్పుడు కొత్త పదం వచ్చింది. అదే గాంధీపీడియా. 
 
కేంద్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన బడ్జెట్‌లో గాంధీ మహాత్ముని గొప్పతనం తెలియచేయాలనే ఉద్దేశంతో వికీపీడియా తరహాలోనే గాంధీపీడియాను ఏర్పాటు చేయాలని నిర్ణయం తీసుకున్నారు. వ్యక్తులు, పౌరుల నడవడికను మార్చే ఉద్దేశంతో గాంధీజీ పాటించిన విలువల ఆధారంగా గాంధీపీడియా సృష్టి జరుగుతోందని చెప్పారు. 
 
మహాత్మా గాంధీజీ జీవిత చరిత్ర గురించి ప్రపంచవ్యాప్తంగా తెలియజేయాలని కేంద్రం భావిస్తోంది. స్వాతంత్య్రం కోసం ఆయన చేసిన కృషిని భారత సమాజం గుర్తుపెట్టుకోవడం కోసం గాంధీపీడియా ఏర్పాటు చేస్తున్నట్లు ఆర్థికమంత్రి నిర్మలా సీతారామన్‌ తెలియజేశారు.
 
ప్రతి ఏటా అక్టోబర్‌ 2న గాంధీజీ జయంతిని దేశవ్యాప్తంగా జరుపుకుంటారు. అయితే ఈసారి జరుపుకోబోయేది 150వ జయంతి కావడం ఒక ప్రత్యేకత. ఈ సందర్భంగా గాంధీజీ 150వ జయంతిని పురస్కరించుకొని గాంధీపీడియా ద్వారా మహాత్ముని విలువలు, ఆయన గొప్పతనంతో పాటు ఆయన చేసిన బోధనలను కూడా ప్రచారం చేయాలని నిర్ణయించినట్లు తెలిపారు.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

రాజాసాబ్ నుంచి సంజూ బాబాకు శుభాకాంక్షలు తెలుపుతూ సంజయ్ దత్ లుక్

Gopichand: గోపీచంద్ రెండు సినిమాలపై శ్రద్ధ పెడుతున్నాడు

సంగీత దర్శకుడు అనిరుధ్‌ను కిడ్నాప్ చేస్తానంటున్న విజయ్ దేవరకొండ

హెబ్బా పటేల్, రేఖ నిరోషా నటించిన థాంక్యూ డియర్ విడుదలకు సిద్ధమైంది

వార్ 2 లోని హృతిక్, కియారా డ్యూయెట్ సాంగ్ కోసం బ్రహ్మాస్త్ర కేసరియా టీం

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

బొప్పాయి ఆరోగ్యానికి మంచిదే, కానీ వీరు తినకూడదు

కరివేపాకుతో చెడు కొవ్వు, రక్తపోటుకి చెక్

ఆల్‌బుకరా పండ్లతో ఆరోగ్య ప్రయోజనాలు

జామకాయ తింటే ఎన్ని ప్రయోజనాలు, ఏంటి?

Snacks: బరువు తగ్గాలనుకునే మహిళలు హెల్దీ స్నాక్స్ తీసుకోవచ్చు.. ఎలాగంటే?

తర్వాతి కథనం
Show comments