Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

Dr. Kamakshi: ఆ దర్శకుడి కంఫర్ట్ తోనే వరుస సినిమాలు : డాక్టర్ కామాక్షి భాస్కర్ల

Advertiesment
Dr. Kamakshi Bhaskarla

దేవీ

, శనివారం, 15 నవంబరు 2025 (14:17 IST)
Dr. Kamakshi Bhaskarla
డాక్టర్ చదివి జనరల్ ఫిజీషియన్ గా హైదరాబాద్ లోని అపోలో కొంతకాలం పనిచేసిన డాక్టర్ కామాక్షి భాస్కర్ల నటిగా ఐదేళ్ళ క్రితం మారింది. ముంబైలో స్టేజీ ప్లే లు చేసిన అనుభవంతో పొలిమేర, పొలిమేర 2 సినిమాల్లో అనిల్ విశ్వనాథ్ దర్శకత్వంలో నటించింది. మూడో సినిమా అయిన 12A రైల్వే కాలనీ సినిమాలో నటించింది. ఇట్లు మారేడుమిల్లిప్రజానీకం తర్వాత అల్లరి నరేశ్ తో ఆమె నటిస్తున్న రెండో చిత్రం. ఇక చిత్రరంగంలోని తన అనుభవాలను ఆమె ఇలా తెలియజేస్తుంది.
 
నరేశ్ నాకు చిన్నప్పటినుంచీ తెలుసు. ఒకే ఏజ్ గ్రూప్. కోడిడ్ తర్వాత ముంబైలో స్టేజీ ప్లేస్ చేశాను. హైదరాబాద్  బిడ్డగా మిస్ తెలంగాణాగా నిలిచాను. ఇట్లు మారేడుమిల్లిప్రజానీకం సినిమాలో నాకు అవకాశం వచ్చింది. నేను పి.ఆర్. పెద్దగా మెయిన్ టేన్ చేయను. ఎలా చేయాలో తెలీదు. అందుకే ఎక్కువ సినిమాలు చేయలేకపోయాను. నేను ఇండస్ట్రీకి వచ్చి ఐదేళ్ళయింది. 
 
- పొలిమేర తర్వాత వరుసగా అలాంటి కాన్సెప్ట్ లు వస్తే వద్దనుకున్నాను. అలా 8 నెలలు ఏ సినిమా చేయకుండా స్క్రిప్ట్ వర్క్ లో వున్నాను. నాకు కథలు రాయడం ఇష్టం. దర్శకత్వం చేయాలని లేదు. కానీ పొలిమేర సమయంలోనే అనిల్ విశ్వనాథ్ పనితనం బాగా నచ్చి ఆయన దర్శకత్వ టీమ్ లో చేరాలనుందని అడిగాను. అలా ఆయనతో వరుసగా మూడు సినిమాలు చేశాను. ఇలా వరుసగా చేస్తున్నానని కొందరు కంఫర్ట్ జోన్ అనుకుని కామెంట్లు చేస్తున్నారు.
 
- సినిమా రంగంలో ఇవన్నీ మామూలే. అలాగే నరేష్ తో వున్న పరిచయంతో ఇట్లు మారేడిమల్లి.. సినిమాలో చాలా ఈజీగా నటించాను. ఇప్పుడు అతనితో రెండో సినిమా.  నేను ఖాళీ టైంలో కథలు రాసుకుంటుంటాను.
 
- సినిమారంగంలో చిత్రమైన పోకడ వుంది. హీరోలకు పర్సనల్ డాక్టర్ కూడా షూటింగ్ కు వస్తుంటారు. కానీ అది వారివరకే పరిమితం. మిగిలిన 24 క్రాఫ్ట్ కు ఏమైనా అనారోగ్యం వచ్చినా చూసిన సందర్భాలు లేవు. అందుకే నేను చేసే షూటింగ్ లో టీమ్ కు ఏదైనా అస్వస్థత వస్తే నేను ట్రీమ్ మెంట్ చేస్తాను. ఇది అందరూ గ్రహించాలి. దీనిపై నేను అందరికీ అవగాహన కలిగించాలని ప్రయత్నిస్తున్నారు. ఇందులో సినీ పెద్దలు కూడా సహకరించాలి.
 
అల్లరి నరేష్, అనిల్ విశ్వనాథ్, నాని కాసరగడ్డ, శ్రీనివాసా చిట్టూరి, శ్రీనివాసా సిల్వర్ స్క్రీన్ పై రూపొందిన 12A రైల్వే కాలనీ ఈనెల 21న విడుదల కాబోతుంది.

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

ఐటెమ్ సాంగ్ చేయమని ఎవరూ అడగలేదు... మీ ఫ్యామిలీలో ఎవరినైనా చేయమన్నారేమో.... ఖుష్బూ