Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

Allari Naresh: 12A రైల్వే కాలనీ లో డిఫరెంట్ షేడ్స్ పాత్ర లో అల్లరి నరేష్

Advertiesment
12A Railway Colony - Allari Naresh

చిత్రాసేన్

, సోమవారం, 27 అక్టోబరు 2025 (17:02 IST)
12A Railway Colony - Allari Naresh
అల్లరి నరేష్ నటించిన యూనిక్  థ్రిల్లర్ 12A రైల్వే కాలనీ. ఇప్పటికే నిర్మాణం పూర్తి చేసుకుంది. పొలిమేర, పొలిమేర 2 చిత్రాలతో గుర్తింపు తెచుకున్న డాక్టర్ అనిల్ విశ్వనాథ్ ఈ చిత్రానికి షోరన్నర్‌గా వ్యవహరిస్తూనే కథ, స్క్రీన్‌ప్లే, డైలాగ్స్ అందిస్తున్నారు. ప్రతిష్టాత్మక శ్రీనివాసా సిల్వర్ స్క్రీన్ బ్యానర్‌పై పవన్ కుమార్ సమర్పణలో శ్రీనివాసా చిట్టూరి నిర్మించిన ఈ చిత్రంలో నాని కాసరగడ్డ దర్శకుడిగా పరిచయం అవుతున్నారు. ఆయనే ఎడిటర్.
 
ఈరోజు ఈ చిత్రం విడుదల తేదీని మేకర్స్ ప్రకటించారు. 12A రైల్వే కాలనీ నవంబర్ 21న ప్రపంచవ్యాప్తంగా బిగ్ స్క్రీన్‌లలోకి రానుంది. ఆ వారంలో బిగ్ రిలీజెస్ ఏవీ లేకపోవడంతో ఈ చిత్రంకు బాక్సాఫీస్ వద్ద స్ట్రాంగ్ ఎడ్వాంటేజ్ కానుంది.
 
రిలీజ్ డేట్ పోస్టర్‌లో అల్లరి నరేష్ ఎనర్జిటిక్ డ్యాన్స్ ఫోజ్ లో డ్యాన్సర్స్ గ్రూప్ తో కలిసి కనిపిస్తున్నారు. మేకర్స్ విడుదల చేసిన స్పెషల్  వీడియో ఆకట్టుకుంది.
 
ఈ సినిమా టైటిల్ టీజర్ కి అద్భుతమైన రెస్పాన్స్ వచ్చింది. అల్లరి నరేష్ ఈ చిత్రంలో డిఫరెంట్ షేడ్స్ ఉన్న పాత్రను పోషిస్తున్నారు. పొలిమేర సిరీస్‌లో ఆకట్టుకున్న  డాక్టర్ కామాక్షి భాస్కర్ల ఈ చిత్రంలో హీరోయిన్ గా నటిస్తున్నారు. సాయి కుమార్, వైవా హర్ష, గెటప్ శ్రీను, సద్దాం, జీవన్ కుమార్, గగన్ విహారి, అనిష్ కురువిల్లా,  మధుమణి కీలక పాత్రలు పోషించారు.
 
కుశేంద్ర రమేష్ రెడ్డి సినిమాటోగ్రఫీని నిర్వహిస్తుండగా, భీమ్స్ సిసిరోలియో సంగీతం అందిస్తున్నారు. విడుదల తేదీని ప్రకటించడంతో, మేకర్స్ త్వరలో ప్రమోషనల్ కాంపైయన్ ని వేగవంతం చేయడానికి సిద్ధమవుతున్నారు.
 నటీనటులు: అల్లరి నరేష్, డాక్టర్ కామాక్షి భాస్కర్ల, సాయి కుమార్, వైవా హర్ష, గెటప్ శ్రీను, సద్దాం, జీవన్ కుమార్, గగన్ విహారి, అనీష్ కురువిల్లా, మధుమణి

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

ప్రేమ లేదని చెబుతున్న లక్ష్మణ్ టేకుముడి, రాధికా జోషి