స్కంద షష్టి అనేది ప్రతి సంవత్సరం కుమార స్వామికి అంకింతం చేసే పండుగ. శివపార్వతుల తనయుడు, వినాయకునికి తమ్ముడిని స్కంధుడిని సుబ్రహ్మణ్య అని కూడా పిలుస్తారు. స్కంద షష్టి ప్రధానంగా శ్రీలంక, దక్షిణ భారతదేశంలో, ముఖ్యంగా తమిళనాడు, కేరళ, కర్ణాటక, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాలలో జరుపుకుంటారు. ఈ రోజున భక్తులు ఉపవాసం ఉండి, ఆయన ఆశీర్వాదం పొందడానికి దేవతను పూజిస్తారు.
ఈ స్కంధషష్ఠిఅశ్విని, శుక్ల షష్టి అక్టోబర్ 27న ఉదయం 06:04 గంటలకు ప్రారంభమవుతుంది. అలాగే
అశ్విని, శుక్ల షష్టి అక్టోబర్ 28న ఉదయం 07:59 గంటలకు ముగుస్తుంది. ఈ పవిత్రమైన రోజున, భక్తులు ఉదయాన్నే నిద్రలేచి సూర్యోదయానికి ముందే స్నానం చేయాలి.
మీ ఇంటిని గంగాజలంతో శుభ్రం చేసుకోవాలి. శుభ్రమైన దుస్తులు ధరించాలి. ఈ రోజున కార్తీకేయ ఆలయాన్ని సందర్శించాలి. ఆలయాన్ని సందర్శించలేకపోతే, ఇంట్లోనే కుమార స్వామిని పూజించవచ్చు. సుబ్రహ్మణ్య స్వామికి పువ్వులు, పంచామృతం, పండ్లు, పాయసం నైవేద్యంగా సమర్పించవచ్చు.
ఈ రోజున భక్తులు స్కంద షష్ఠి, మురుగన్ గాయత్రీ మంత్రాన్ని పఠించాలి: "ఓం తత్పురుషాయ విద్మహే, మహా సేనాయ ధీమహి, తన్నోః షణ్ముఖ ప్రచోదయాత్.. అనే మంత్రాన్ని 108 సార్లు ధ్యానించాలి. అలాగే కుమార స్వామి మూల మంత్రం: ఓం శరవణభవాయ నమః అనే మంత్రాన్ని కూడా పఠించవచ్చు.