Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

సత్య, రితేష్ రానా.. జెట్లీ హ్యూమరస్ టైటిల్ పోస్టర్ రిలీజ్

Advertiesment
Jaitley Poster

దేవీ

, శుక్రవారం, 14 నవంబరు 2025 (17:49 IST)
Jaitley Poster
టాలీవుడ్ ఫేవరేట్ ద్వయం సత్య, దర్శకుడు రితేష్ రానా 'జెట్లీ'తో అలరించబోతున్నారు. ఈరోజు ఫస్ట్ లుక్ పోస్టర్ విడుదలైంది. ఇప్పటికే ఇంటర్నెట్‌ లో వైరల్ గా మారింది. సత్య ఒక విమానం పైన కూర్చుని వుండగా "I am done with comedy" అనే లైన్ అభిమానులకు నవ్విస్తుంది. ఇది రితేష్ రానా మార్క్ ఇంటర్టైన్మెంట్ ని సూచిస్తోంది.
 
క్లాప్ ఎంటర్టైన్మెంట్ చిరంజీవి (చెర్రీ) , హేమలత పెద్దమల్లు నిర్మిస్తున్న జెట్లీని మైత్రి మూవీ మేకర్స్ సమర్పిస్తున్నారు. భారీ బ్యానర్లు చేతులు కలపడంతో ఇది  స్కై-లెవెల్ ఎంటర్టైనర్ రాబోతుందనే విషయం స్పష్టమవుతోంది.
 
యాక్షన్ కామెడీ ఎంటర్‌టైనర్‌గా తెరకెక్కుతున్న ‘జెట్లీ’ లో థ్రిల్స్, ట్విస్టులు, హై-వోల్టేజ్ హ్యూమర్ అన్నీ రితేష్ రాణా స్టైల్లో ప్యాక్ అయి రాబోతున్నాయి. సత్య తన కెరీర్‌లో క్రేజీ, అన్‌ప్రీడిక్టబుల్ అవతార్ లో కనిపించబోతున్నారు. రానా అద్భుతమైన నేరేషన్, క్లాప్ ఎంటర్‌టైన్‌మెంట్ విజన్, మైత్రీ మూవీ మేకర్స్ బ్యాకింగ్… అన్నీ కలిసి ‘జెట్లీ’ అద్భుతమైన ఎంటర్‌టైనర్‌ కానుంది.
 
మిస్ యూనివర్స్ ఇండియా రియా సింఘా ఈ చిత్రంతో తెలుగు సినిమాల్లోకి ఎంట్రీ ఇస్తున్నారు. సత్యతో ఆమె జంటగా కనిపించనుంది. వెన్నెల కిషోర్, అజయ్ ఈ ప్రాజెక్ట్‌లో కీలక పాత్రలు పోషిస్తున్నారు.  
 
రితేష్ రానా గత హిట్లకు పని చేసిన కోర్ టెక్నికల్ టీం ఈ సినిమాకి వర్క్ చేస్తుంది. సంగీతం కాల భైరవ, సినిమాటోగ్రఫీ సురేష్ సరంగం, ఎడిటింగ్ కార్తిక శ్రీనివాస్, ప్రొడక్షన్ డిజైన్ నార్ని శ్రీనివాస్.  
 
డైరెక్టర్ రితేష్ రాణా మత్తు వదలరా యూనివర్స్ అభిమానులకు సిగ్నేచర్ ఎక్స్‌పీరియన్స్ – క్లెవర్ రైటింగ్, యూనిక్ క్యారెక్టర్స్, అద్భుతమైన ఎంటర్‌టైన్‌మెంట్ తో రాబోతున్నారు.
 
ఈ చిత్రానికి సంబంధించిన రెగ్యులర్ షూటింగ్ హైదరాబాద్‌లో ప్రారంభం కానుంది
 
తారాగణం: సత్య, రియా సింఘా, వెన్నెల కిషోర్, అజయ్ తదితరులు

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

మైత్రి మూవీ డిస్ట్రిబ్యూటర్స్ విడుదల చేస్తున్న ఇట్లు మీ ఎదవ