Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

Love OTP Review: ట్రెండ్ కు తగ్గ ప్రేమ కథాంశంగా లవ్‌ ఓటిపి.. రివ్యూ

Advertiesment
Love OTP.

దేవీ

, శుక్రవారం, 14 నవంబరు 2025 (18:35 IST)
Love OTP.
హీరో కమ్ డైరెక్టర్‌గా అనీష్ రూపొందించిన లేటెస్ట్ రొమాంటిక్ కామెడీ మూవీ లవ్ ఓటీపీ. విజయ్ ఎం రెడ్డి నిర్మించిన ఈ సినిమాలో నాయికగా జాన్విక నటించింది. రాజీవ్ కనకాల, ఆరోహి నారాయణ్, ప్రమోదిని, నాట్య రంగ, బాబా భాస్కర్ ఇతర కీలక పాత్రలు పోషించారు. మారుతున్న ప్రేమలు ఎలా ఉన్నాయో తెలియా జేసే పాయింట్ తో రూపొందిన సినిమా లవ్‌ ఓటిపి ( లవ్‌ ఓవర్‌ ప్రెషర్‌ టార్చర్‌). భావప్రీత ప్రొడక్షన్స్ బ్యానర్‌పై పుష్ప మణిరెడ్డి సమర్పణలో రూపొందింది. విజయ్ ఎం రెడ్డి నిర్మించగా నేడే విడుదలైన ఈ సినిమా ఎలా వుందో చూద్దాం.
 
కథ:
రాజీవ్ కనకాల పోలీస్ ఆఫీసర్. అతని అక్షయ్ (అనీష్) క్రికెటర్ అవ్వాలనే లక్ష్యం పెట్టుకుంటాడు. డ్యూటీలో రాజీవ్ ఎక్కువగా లవ్ పేరుతో వచ్చే కేసులను డీల్ చేస్తుంటాడు. పైగా రాజీవ్ కు ప్రేమంటే గిట్టదు. దాంతో భయపడిని అక్షయ్.. ఎవరిని ప్రేమించడు. కానీ, కాలేజ్‌లో అక్షయ్‌ను ఇష్టపడ్డ సన (ఆరోహి నారాయణ్) లవ్ పేరుతో ప్రపోజ్ చేస్తుంది. దక్కకపోతే తెగించే రకం ఆమెది. ఇదిలా వుండగా, క్రికెట్‌లో దెబ్బ తగిలినప్పుడు అక్షయ్‌కు ఫిజియో థెరపిస్ట్ నక్షత్ర (జాన్విక) పరిచయం అవుతుంది. కానీ సన ఉండగానే నక్షత్రను ప్రేమిస్తాడు రాజీవ్. ఈముక్కోణ పు ప్రేమ ఎటువైపు దారితీసింది? విషయం తెలిసిన సన ఎలాంటి టార్చర్ పెట్టింది? అనంతర పరిణామాలు ఏమిటి? అనేవి మిగిలిన సినిమా.
 
సమీక్ష:
ఈ కాలం మెజారిటీ ప్రేమికులు గుర్తులు సోషల్ మీడియాలో రకరకాలుగా వ్యక్తం చేస్తుంటారు. ఒకరకంగా టైం పాస్ చేయడం కూడా జరుగుతుంది. ప్రేమలో బ్రేకప్ లు కూడా వుంటాయి. కానీ అసలు ప్రేమ ఇది కాదు అనేది కొందరు అంటుంటారు. ప్రేమలో చాలా అబద్దాలతో బతికేస్తున్నారు. అలాంటి వారికి ఈ సినిమా కనువిప్పు కలుగుతుంది. ముక్కోణపు ప్రేమకథలో ఎన్నో ఎమోషన్స్ వుంటాయి. దర్శకుడు కుర్రాడు కాబట్టి కన్నడలో 13 సినిమాలు చేశాక తెలుగులో తీసిన సినిమా ఇది. 
 
అయితే ఊహించని మలుపులు కూడా వుంటాయి. సీరియస్ గా వుంటేనే ఎంటర్ టైన్ చేయిస్తుంటుంది. కథంతా ఏడుగురు, రెండు వీధుల్లో తిరుగుతుంటుంది. ప్రేమంటే పడని వ్యక్తిగా రాజీవ్ నటించారు. కొడుకు ఫోన్ ను చెక్ చేసే విధానం సన్నివేశపరంగా బాగుంది. అయితే ఫాదర్ కు లవ్ అంటే ఎందుకు ఇష్టంలేదనే పాయింట్ ను కరెక్ట్ గా హైలైట్ చేయలేకపోయాడు దర్శకుడు. కొన్నిచోట్ల చిన్న లోపాలున్నాయి. మదర్ గా ప్రమోదిని బాగా సూటయింది.
 
కెమెరామెన్, సంగత దర్శకులు కథాపరంగా సమకూర్చారు. బాబా మాస్టర్ కొరియోగ్రఫీ సరిపడవిధంగా డాన్స్ చేయించాడు. లవ్ ఓటీపీలో ఓటీపీ అంటే ఓవర్ టార్చర్ ప్రెజర్. సినిమా కూడా ఇలాగే ఉంటుంది. అసలు ఏమాత్రం ఇష్టం లేని అమ్మాయిని ప్రేమించడం, లవ్‌లో ఆమెతో పడే కష్టాలు, నిజంగా ప్రేమించిన అమ్మాయిని పొందడానికి హీరో చేసే ప్రయత్నాలతో మూవీ సాగుతుంది.
 
ఇద్దరి లవర్స్ మధ్య నలిగిపోయే హీరో కథగా లవ్ ఓటీపీ ఉంది. టాక్సిక్ రిలేషన్‌షిప్, ఒకరి అభిప్రాయాలను మరొకరిపై రుద్దడం వంటి లవ్‌లో జరిగే విషయాలపై ఈ సినిమా తెరకెక్కించారు. పూర్తిగా కామెడీతో ప్రేక్షకుడిని నవ్వించేలా సినిమా ఉంది. ఇంటర్వెల్ ట్విస్ట్ చాలా బాగుంది. అక్కడే కథ కొత్త మలుపు తీసుకుంటుంది. దాంతో సెకండాఫ్‌పై ఆసక్తి పెరుగుతుంది. ఇక రెండో భాగంలో హీరో ఒకేసారి ఇద్దరు గర్ల్‌ఫ్రెండ్స్‌ను మెయింటేనే చేయడం, దాంతో కలిగే ఇబ్బందులు, కష్టాలు కామెడీతోపాటు ఎమోషనల్‌గా ఉంటాయి. సనను వదిలేయకపోవడం, నక్షత్రతో పూర్తిగా ప్రేమగా ఉండలేకపోవడం వంటివి ఒక అబ్బాయికి ఎలాంటి బాధను కలిగిస్తాయో చక్కగా చూపించారు.
 
నటీమణులుగా జాన్విక, ఆరోహి నారాయణ్ పూర్తిగా మెప్పించారు. నేటి ట్రెండ్ కు తగినట్లుగా ప్రేమ, టార్చర్ అంశాలను దర్శకుడు డీల్ చేసిన ఈ సినిమా యూత్ చూడతగ్గ సినిమా.
రేటింగ్: 3/5

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

Tandavam song: ఓం నమహ్ శివాయ.. అఖండ తాండవం సాంగ్ రిలీజ్