బాలీవుడ్ నటి కరిష్మా కపూర్ కుటుంబంలో ఆస్తి వివాదం కోర్టులో ఉంది. ఈ కేసుపై శుక్రవారం ఢిల్లీలో విచారణ జరిగింది. ఈ సందర్భంగా కరిష్మా కపూర్ పిల్లలు కీలక వ్యాఖ్యలు చేశారు. తమ చదువుకు సంబంధించి రెండు నెలలుగా యూనివర్శిటీ ఫీజులు చెల్లించలేదని వారు పేర్కొన్నారు.
కరిష్మా కపూర్‌కు సమైరా, కియాన్ అనే ఇద్దరు పిల్లలు ఉన్నారు. వారి తరపున సీనియర్ న్యాయవాది మహేశ్ జఠ్మలాని వాదనలు వినిపించారు. కరిష్మా పిల్లల విద్యా ఖర్చులకు నిధులు సమకూర్చే బాధ్యత సంజయ్ కపూర్‌కు ఉందన్నారు.
ఆస్తి ప్రస్తుతం ప్రియా సచ్‌దేవ్ నియంత్రణలో ఉందని.. అమెరికాలో చదువుతున్న సమైరాకు రెండు నెలలుగా ఫీజు చెల్లించలేదని తెలిపారు. అయితే, ప్రియా సచ్‌దేవ్ తరపున న్యాయవాది రాజీవ్ నాయర్ ఈ వాదనలను తోసిపుచ్చారు. ఇవి కల్పితమైనవని, ప్రియా నిరంతరం కరిష్మా పిల్లలకు సాయం అందుతోందని కోర్టుకు తెలిపారు.
ఫీజుకు సంబంధించిన చెల్లింపులు ఇప్పటికే చెల్లించినట్లు తెలిపారు. మీడియా దృష్టిని ఆకర్షించేందుకే ఈ అంశాన్ని కోర్టులో లేవనెత్తినట్లు పేర్కొన్నారు. ఈ వాదనలు విన్న జస్టిస్ జ్యోతిసింగ్ కేసుపై అసహనం వ్యక్తంచేశారు. కేసు విచారణను మెలోడ్రామాగా మార్చొద్దని హెచ్చరించారు. ఇలాంటి కేసులు కోర్టు వెలుపల పరిష్కారమవుతాయని, వాటిని మళ్లీ బెంచ్ ముందుకు తీసుకురావద్దని రాజీవ్ నాయర్‌ను ఆదేశించారు.
కాగా, గత 2003లో కరిష్మా కపూర్ - సంజయ్ కపూర్‌ల వివాహం జరిగింది. వీరికి ఇద్దరు పిల్లలు ఉన్నారు. అయితే సంజయ్‌కు చెందిన రూ.30 కోట్ల విలువైన ఆస్తుల్లో తమ వాటా కోసం కరిష్మా కపూర్ ఇద్దరు పిల్లలు కోర్టును ఆశ్రయించారు. ఈ కేసు ప్రస్తుతం ఢిల్లీ హైకోర్టులో సాగుతోంది.