Webdunia - Bharat's app for daily news and videos

Install App

అమెరికా డ్రోన్ దాడిలో మెహసూద్ భార్య మృతి

Webdunia
పాకిస్థాన్ తాలిబాన్ చీఫ్ బైతుల్లా మోహసూద్ ఇంటిపై అమెరికా డ్రోన్ జరిపిన దాడి చేసింది. ఈ దాడిలో మెహసూద్ భార్య మృతి చెందినట్లు తెలుస్తోంది. పాకిస్థాన్‌లోని దక్షిణ వజీరిస్థాన్ గిరిజన ప్రాంతంలో జరిగిన అనుమానిత అమెరికా డ్రోన్ దాడిలో మెహసూద్ భార్య మృతి చెందినట్లు పాకిస్థాన్ టీవీ ఛానళ్లు బుధవారం వెల్లడించాయి.

మెహసూద్ మామ అక్రముద్దీన్ నివాసంపై డ్రోన్ దాడి చేసినట్లు టీవీ కథనాలు వెలువడ్డాయి. ఈ దాడిలో నలుగురు మృతి చెందగా, ఇద్దరు గాయపడ్డారు. ఇదిలా ఉంటే పాకిస్థాన్‌లోని సమస్యాత్మక నార్త్‌వెస్ట్ ఫ్రాంటియర్ ప్రావీన్స్‌లో తాలిబాన్ తీవ్రవాదులకు నేతృత్వం వహిస్తున్న మెహసూద్ కోసం ఆ దేశ ఆర్మీ గత కొన్ని వారాలుగా గాలింపు చర్యలు నిర్వహిస్తోంది.

తాజా దాడిలో మృతి చెందినవారిలో మెహసూద్ భార్య కూడా ఉన్నట్లు అతని బంధువులు చెప్పారు. అయితే దీనికి సంబంధించి అధికారిక వర్గాలు ఎటువంటి వివరాలు వెల్లడించలేదు. డ్రోన్ దాడిలో ఇల్లు మాత్రం ధ్వంసమైందని చెప్పారు. దాడి జరిగిన సమయంలో మెహసూద్ ఇంటిలో పలువురు అతిథులు కూడా ఉన్నట్లు స్థానికులు చెబుతున్నారు. పాకిస్థాన్‌లోని సమస్యాత్మక గిరిజన ప్రాంతాల్లో ఉన్న తీవ్రవాదుల రహస్య స్థావరాలపై అమెరికా తరచుగా డ్రోన్ దాడులు జరుపుతున్న సంగతి తెలిసిందే.

ఈ దాడులను పాకిస్థాన్ ప్రభుత్వం తీవ్రంగా వ్యతిరేకిస్తున్నప్పటికీ, అమెరికా యంత్రాంగం మాత్రం వీటిని కొనసాగిస్తూనే ఉంది. దక్షిణ వజీరిస్థాన్‌లో మెహసూద్‌ను పట్టుకునేందుకు, అతని నేతృత్వంలోని తాలిబాన్లను అణిచివేసేందుకు గత కొన్ని నెలలుగా పాకిస్థాన్ ప్రభుత్వం సైనిక ఆపరేషన్ కూడా చేపట్టింది.
అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

Nayanthara: మూర్ఖుడిని వివాహం చేసుకోవడం తప్పు.. నన్ను ఒంటరిగా వదిలేయండి.. నయనతార?

స్వార్థంతో తెలుగు ఫిలింఛాంబర్ ఎన్నికలకు అడ్డుకుంటున్నారు : నిర్మాతలు

Nitin: అల్లు అర్జున్ కంటే సీనియర్ నితిన్ కు పరాజయాల పరంపర

Rashmika: దీక్షిత్ శెట్టి గర్ల్ ఫ్రెండ్ రశ్మిక మందన్నపై సాంగ్ చిత్రీకరణ

అల్లు అర్జున్ స్థానంలో ఎన్టీఆర్ ను తీసుకున్న త్రివిక్రమ్ శ్రీనివాస్ ?

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

చక్కగా కొవ్వును కరిగించే చెక్క

Monsoon AC Safety: బయట వర్షం పడుతుంటే.. ఏసీ వాడటం సురక్షితమేనా?

కొవ్వును కరిగించే తెల్ల బఠానీలు

పీరియడ్స్ సమయంలో స్త్రీలు చేయదగని వ్యాయామాలు, ఏంటవి?

బత్తాయి రసం తాగితే ఆరోగ్యానికి కలిగే మేలు ఏమిటి?