ఎంఎంటీఎస్ రైలులో యువతిపై లైంగికదాడి : నిందితుడుని గుర్తించి బాధితురాలు

ఠాగూర్
మంగళవారం, 25 మార్చి 2025 (15:51 IST)
హైదరాబాద్ నగరంలోని కదులుతున్న ఎంఎంటీఎస్‌ రైలులో యువతిపై లైంగికదాడికి పాల్పడిన కేసులో నిందితుడుని పోలీసులు అరెస్టు చేశారు. నిందితుడుని మేడ్చల్ జిల్లా గౌడవల్లి గ్రామానికి చెందిన జంగం మహేశ్‌గా గుర్తించారు. ఈ కేసు దర్యాప్తును పోలీసులు వేగవంతం చేశారు. రైలులో నిందితుడు ఎక్కడ ఎక్కడ ఎక్కాడో వివరాలు సేకరిస్తున్నారు. అల్వాల్ రైల్వే స్టేషన్‌లో ఎక్కినట్టు అనుమానిస్తున్నారు. అయితే, అల్వాల్ రైల్వే స్టేషన్‌లో సీసీ కెమెరాల్లో నిందితుడు కనిపించలేదు. అల్వాల్ రైల్వే స్టేషన్‌‍లో మహిళా బోగి నుంచి ఇద్దరు మహిళలు దిగడంతో అందులో యువతి ఒంటరిగా మిగిలింది. బోగీలో ఆమె ఒంటరిగా ఉండటాన్ని గమనించిన నిందితుడు యువతి వద్దకు వెళ్లి అఘాయిత్యానికి పాల్పడ్డాడు. 
 
కాగా, ఈ ఘటనపై బాధితురాలు స్పందిస్తూ, "నేనూ రోజూ ఎంఎంటీఎస్‌లో ప్రయాణిస్తాను. ఈ సంఘటన తర్వాత సాయంత్రం రైలులో వెళ్ళొద్దని మా పేరెంట్స్ చెప్పారు. అందుకే మధ్యాహ్నం లోపే వెళుతున్నాను. ఒక్కోసారి మహిళా బోగీలో ఒంటరిగా వెళ్తాను. ఆ టైములో భయమేస్తోంది. ఇప్పటివరకు నేను ఎలాంటి ఇబ్బందులు ఫేస్ చేయలేదు కానీ, ఈ ఘటన తర్వాత భయమేస్తుంది. మహిళా బోగీల్లో ఖచ్చితంగా రక్షణ కల్పించాలి. లేడీ కానిస్టేబుల్స్‌ను బోగీల్లో ఉంచాలి'' అని తెలిపారు. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

కౌబాయ్ చిత్రంలో నటిస్తానని ఊహించలేదు : చిరంజీవి

కొదమసింహం.. నాకు, రామ్ చరణ్ కు ఫేవరేట్ మూవీ - మెగాస్టార్ చిరంజీవి

జీవి ప్రకాష్ లాంచ్ చేసిన సుడిగాలి సుధీర్, దివ్యభారతి.. G.O.A.T నుంచి లవ్ సాంగ్

Kalyani Priyadarshan : కళ్యాణి ప్రియదర్శన్ ప్రధానపాత్రలో చిత్రం చెన్నైలో ప్రారంభం

ఓపిక, సహనం, జ్ఞానం, తెగింపు, పోరాటం అనేవి మ్యూజిక్ డైరెక్టర్ కు అర్హతలు

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

చలికాలంలో ఎలాంటి కూరగాయలు తినాలో తెలుసా?

మైగ్రేన్ నుండి వేగవంతమైన ఉపశమనం కోసం ఓరల్ ఔషధాన్ని ప్రారంభించిన ఫైజర్

తాటి బెల్లం తింటే 9 ప్రయోజనాలు, ఏంటవి?

నిమ్మకాయ టీ తాగేవారు తెలుసుకోవాల్సిన విషయాలు

ఊపిరితిత్తుల సమస్యలను అరికట్టే 5 మూలికలు, ఏంటవి?

తర్వాతి కథనం