Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

సామాన్య వ్యక్తిలా మెగాస్టార్ చిరంజీవి వ్యాఖ్యలు: జాతీయ మీడియాల్లో వక్ర చర్చలు

Advertiesment
chiranjeevi

ఐవీఆర్

, బుధవారం, 12 ఫిబ్రవరి 2025 (19:23 IST)
సెలబ్రిటీలు ఏవి మాట్లాడినా వాటికి ఎన్నో అర్థాలు తీయడం మామూలే. అందునా మెగాస్టార్ చిరంజీవి కాస్త సరదాగా జోకులు వేయడం చేస్తే ఇక దాని ఫలితాలు జాతీయ మీడియా వరకూ వెళ్లిపోయాయి. సహజంగా ప్రతి కుటుంబంలోనూ ముందుగా అమ్మాయి పుడితే తర్వాత అబ్బాయిని కనరా అని అడుగుతుంటారు. ఒకవేళ అబ్బాయి పుడితే... బాబ్బాబు అమ్మాయిని కూడా కనివ్వరా అంటూ అభ్యర్థిస్తుంటారు. ఇలాంటి చర్చలు ప్రతి ఇంట్లోనూ జరిగేవే. అలాంటి మాటనే మెగాస్టార్ చిరంజీవి బ్రహ్మఆనందం చిత్రం ప్రమోషన్ ఈవెంట్లో అన్నారు.
 
అది కూడా సరదాగా... మా ఇంట్లో ఎటు చూసినా ఆడపిల్లలే. లేడీస్ హాస్టల్లా వుంటుంది. అందుకే చెర్రీని... ఓ అబ్బాయి కావాల్రా అని చెప్పాను. ఏమో రెండోసారి కూడా అమ్మాయే పుడుతుందేమో అంటూనే క్యూట్ బేబీస్ అంటూ ప్రశంసించారు. ఇక ఈ మాటలకు వక్రభాష్యాలను వెతుక్కుని అటు లాగి ఇటు లాగి చర్చలు పెట్టి ఎవరికి తోచినట్లు వారు మాట్లాడేస్తున్నారు.
 
ఇక మెగాస్టార్ చిరంజీవి సహజంగా తమ కుటుంబానికి సంబంధించిన ఏ విషయాన్ని ఎప్పుడూ బైట చెప్పిన దాఖలాలు లేవు. అలాంటిది ఆయన ఇటీవలి కాలంలో కాస్త ఓపెన్ అయిపోతున్నారు. అందులో భాగంగా... ఆయన తన తాతగారి విషయం గురించి చెప్పిన మాటలు. తన తాతయ్య గారికి ఇద్దరు భార్యలు వుండేవారంటూ... ఆనాటి వ్యవహారాన్ని చెప్పడంతో అది కాస్తా ట్రోల్ కి గురైంది. తమ తాతయ్యకు సంబంధించిన ఆ విషయం వాస్తవమైనప్పటికీ చిరంజీవి అలా ఎందుకు చెప్పారు.. ఆయన దిగజారి మాట్లాడుతున్నారంటూ ట్రోల్స్ చేస్తున్నారు. ఈ అంశాన్ని ఎవరికి వారు ఎలా తీసుకోవాలన్న కోణంపై అది తప్పా లేక ఒప్పా అనేది ఆధారపడి వుంటుంది.

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

నా కథల ఎంపిక వెరైటీ గా ఉంటుంది : రానా దగ్గుబాటి