Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

నా కథల ఎంపిక వెరైటీ గా ఉంటుంది : రానా దగ్గుబాటి

Advertiesment
Ravikanth, Rana, Siddu

దేవి

, బుధవారం, 12 ఫిబ్రవరి 2025 (19:19 IST)
Ravikanth, Rana, Siddu
నా కథల ఎంపిక ఎలా వుంటుందంటే... ఎందుకు ఈ కథ చెబుతున్నామనేది ముందు చూస్తాను. తర్వాత కథ ఎంత కొత్తగా వుందని చూస్తాను. సినిమా అనేది వెరైటీ. అలాంటి డిఫరెంట్ కథలు ఆడియన్స్ కి చూపించడానికి ఇష్టపడతాను.. అని రానా అన్నారు. 
 
స్టార్ బాయ్ సిద్ధు జొన్నలగడ్డ రొమాంటిక్ కామెడీ మూవీ కృష్ణ అండ్ హిస్ లీల. 2020లో  కరోనా మహమ్మారి సమయంలో OTTలో నేరుగా విడుదలైన ఈ సినిమా ఇన్స్టంట్ హిట్ సాధించింది. రవికాంత్ పెరెపు దర్శకత్వంలో రానా దగ్గుబాటి, సంజయ్ రెడ్డి నిర్మించిన ఈ చిత్రం లవ్ స్టొరీ పై ఒక రిఫ్రెషింగ్ టేక్. ఇందులో శ్రద్ధా శ్రీనాథ్, సీరత్ కపూర్, షాలిని వడ్నికట్టి కీలక పాత్రల్లో నటించారు.

రానా దగ్గుబాటి ఈ పాపులర్ చిత్రాన్ని ప్రేమికుల రోజున థియేటర్లలో విడుదల చేయనున్నారు. డిజిటల్ లో మాత్రమే విడుదలైన ఈ చిత్రం ఫిబ్రవరి 14న కొత్త ట్విస్ట్‌తో థియేటర్లలోకి వస్తుంది. ఈ సినిమా టైటిల్‌ను 'ఇట్స్ కాంప్లికేటెడ్‌'గా మార్చారు. ఈ కొత్త టైటిల్, ప్రమోషన్స్  మరింత ఆసక్తిని పెంచాయి. తాజాగా మేకర్స్ క్యూ అండ్ ఏ ప్రెస్ మీట్ నిర్వహించారు.
 
ప్రెస్ మీట్ లో రానా దగ్గుబాటి మాట్లాడుతూ.. నాకు సిద్దు రవికాంత్ తో మరో సినిమా చేయాలని వుండేది. ఇది రిలీజ్ చేస్తేగానే మరో సినిమా చేయనని అన్నారు.  దీనికి ఫిబ్రవరి 14 రైట్ డేట్.  ఇది రీరిలీజ్ కాదు. థియేటర్స్ లో ఫస్ట్ టైం రిలీజ్'అన్నారు.
 
స్టార్ బాయ్ సిద్ధు జొన్నలగడ్డ మాట్లాడుతూ.. సినిమాని థియేటర్స్ లో ఆడియన్స్ చుడాలనేది నా స్ట్రాంగ్ ఫీలింగ్. ఫిబ్రవరి 14 సినిమాకి యాప్ట్ రిలీజ్. థియేటర్స్ లో ఆడియన్స్ ఎక్సయిట్మెంట్ చూడాలని వుంది'అన్నారు
 
డైరెక్టర్ రవికాంత్ పెరెపు మాట్లాడుతూ.. లాక్ డౌన్ లో ఈ సినిమా థియేటర్స్ లో చూడటం కుదరలేదు. అందరితో కలసి చూస్తే మజా వస్తుంది. ఆడియన్స్ రియాక్షన్ కోసం వెయిట్ చేస్తున్నాం.'అన్నారు
 
రానా గారు ఈ టైటిల్ ఐడియా ఎవరిది? 
-ముందు ఒక టైటిల్ అనుకున్నాం. కానీ ఆ టైటిల్ పెట్టనివ్వలేదు. తర్వాత 'ఇట్స్ కాంప్లికేటెడ్‌' డైరెక్టరే పెట్టారు. ఈ సినిమా థియేటర్స్ లో అందరితో కలసి చూడడం అనేది వెరీ గుడ్ ఫీలింగ్. ఇది రీరిలీజ్ కాదు. థియేటర్స్ లో ఫస్ట్ టైం రిలీజ్.
 
రవికాంత్ గారు.. మార్చిన టైటిల్ గురించి చెప్పండి ?
-'ఇట్స్ కాంప్లికేటెడ్‌' అని కాలేజ్ డేస్ లో ఓ షార్ట్ ఫిల్మ్ తీశాను. ఇప్పుడు థియేటర్స్ లో రిలీజ్ కాబోతున్న సినిమా శాటిలైట్ రావాలంటే సెన్సార్ క్లియర్ కావాలి. ఈ సినిమాకి 'ఇట్స్ కాంప్లికేటెడ్‌'టైటిల్ యాప్ట్ అవుతుంది. ఆ రకంగా సినిమాకి ఈ టైటిల్ పెట్టడం జరిగింది. ఈ కథ అందరూ రిలేట్ చేసుకునేలా వుంటుంది.
 
సిద్దుగారు లైలా (విశ్వక్ సేన్)మీకు మంచి ఫ్రెండ్ కదా.. ఆయన సినిమాతో పాటు మీ సినిమా రిలీజ్ చేయడానికి కారణం ?
-మా సినిమా రీరిలీజ్, అది స్ట్రయిట్ రిలీజ్.. అసలు కంపారీజన్ లేదు.
 
రానా గారు.. ఈ లవ్ స్టొరీలో మీకు కనెక్ట్ అయిన పాయింట్ ?
-నాకు కొన్ని లవ్ స్టోరీస్ మాత్రమే అర్ధమౌతాయి. అందులో ఈ సినిమా ఒకటి. అందరిలో లైఫ్ లో కొన్ని జరుగుతాయి. వాటిని చాలా బ్యూటీఫుల్ గా క్యాప్చర్ చేశారు.
 
సిద్దు: అవుట్ అఫ్ ది బాక్స్ కథలు వుంటే రానా దగ్గరికి వస్తారు. రానా వాటిని అర్ధం చేసుకొని ముందుకు తీసుకెళతారు. ఇలాంటి కథలు చేయాలంటే కొందరు ధైర్యం చేయరు. రానా మాత్రం ఇలాంటి కథ చెప్పాలని అనుకుంటారు. ఈ కథ రానాకి చెబితే చాలా స్ట్రాంగ్ గా ఫీలయ్యారు. అక్కడే రానాకి ఈ సినిమా కనెక్ట్ అయ్యింది. ఈ సినిమాని ముందు థియేటర్స్ లో రిలీజ్ చేయాలనే అనుకున్నాం. నిజానికి థియేటర్స్ లో రిలీజ్ చేసుంటే సిక్స్ టైమ్స్ ఎక్కువ వచ్చేది.  
 
రానాగారు ఈ సినిమాని ఇప్పుడే రిలీజ్ చేయడానికి కారణం ?
-ఈ సినిమా గురించి సోషల్ మీడియా ఎప్పుడూ రిక్వెస్ట్ లు వచ్చేవి. ఒకరోజు సిద్దు దీని గురించి చెప్పారు. అలా క్షణాల్లో జరిగింది. వాలంటైన్ డే ఈ సినిమా రిలీజ్ కి పెర్ఫెక్ట్ టైం.
 
సిద్దు గారు.. ఈసినిమా థియేటర్స్ లో ఆడియన్స్ తో కలసి చూస్తారా ?
-ఈ సినిమాని థియేటర్స్ లో ఆడియన్స్ చుడాలనేది నా స్ట్రాంగ్ ఫీలింగ్. రానాకు చెబితే ఫెబ్రవరి 14 ఈ సినిమాని రిలీజ్‌ చేయడానికి గ్రేట్ డే గా భావించారు. థియేటర్స్ లో ఆడియన్స్ ఎక్సయిట్మెంట్ చూడాలని వుంది.
 
రవికాంత్ గారు ఒకే సమయంలో ఇద్దరిని ప్రేమించడం సాధ్యమేనా ? మీ ఒపినియన్ ఏమిటి ?
 -ఇది చాలా పర్శనల్ థింగ్. నా ఒపినియన్ చెప్పాలంటే సినిమాలో ఏముందో అదే(నవ్వుతూ)

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

అమెజాన్ ప్రైమ్స్ లో సస్పెన్స్ థ్రిల్లర్ రాజు గారి అమ్మాయి నాయుడు గారి అబ్బాయి