Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
Tuesday, 8 April 2025
webdunia

ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికలు : టీడీపీ - జనసేన - బీజేపీ ఉమ్మడి మేనిఫెస్టో ముఖ్యాంశాలు ఇవే..

Advertiesment
manifesto

వరుణ్

, మంగళవారం, 30 ఏప్రియల్ 2024 (16:04 IST)
ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర అసెంబ్లీ ఎన్నికల కోసం టీడీపీ - జనసేన, బీజేపీలు కలిసి ఉమ్మడి మ్యానిఫెస్టోను మంగళవారం విడుదల చేసింది. ఉండవల్లిలో టీడీపీ అధినేత చంద్రబాబు నివాసంలో మూడు పార్టీల నేతలు దీన్ని ఆవిష్కరించారు. చంద్రబాబు, జనసేన అధినేత పవన్‌కల్యాణ్‌, భాజపా రాష్ట్ర ఇన్‌ఛార్జ్‌ సిద్ధార్థ్‌నాథ్‌ సింగ్‌ ఇతర ముఖ్య నేతలు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. 
 
తెలుగు జాతికి పూర్వ వైభవం తీసుకురావాలన్న లక్ష్యంతోనే మూడు పార్టీలు కూటమిగా జట్టు కట్టామని చంద్రబాబు  తెలిపారు. రాష్ట్రాన్ని కాపాడుకోవడమే తమ లక్ష్యమని స్పష్టం చేశారు. పేదల సంక్షేమం కోసం సూపర్‌ సిక్స్‌ పథకాలతో ముందుకొచ్చినట్లు చెప్పారు. మ్యానిఫెస్టో అమలుకు కేంద్రం సహకారం మెండుగా ఉంటుందని పేర్కొన్నారు.
 
రేపటి ఆకాంక్షలను సాకారం చేసే విధంగా మ్యానిఫెస్టోను రూపొందించినట్లు పవన్‌ కల్యాణ్‌ తెలిపారు. రైతుల ఆత్మహత్యల్లో రాష్ట్రం మూడో స్థానంలో ఉందన్నారు. 'పోలవరం ప్రాజెక్టును గోదావరిలో ముంచారు. ప్రజా రాజధాని అమరావతిని విధ్వంసం చేశారు. వందకు పైగా సంక్షేమ కార్యక్రమాలు రద్దు చేశారు. లక్షలాది ఎకరాల ప్రజల ఆస్తులు కబ్జా చేశారు. స్థానిక సంస్థలకు కేంద్రం ఇచ్చిన రూ.12 వేల కోట్లు మళ్లించారు. రాష్ట్రాన్ని గాడిలో పెట్టేందుకు, విధ్వంస పాలనను సాగనంపేందుకు కూటమి ముందుకొచ్చింది' అని పవన్‌ తెలిపారు.
 
కాగా, ఈ మేనిఫెస్టోలో కూటమి ఇచ్చిన ముఖ్యమైనవి.. 
* మహిళలకు ఆర్టీసీ బస్సుల్లో ఉచిత ప్రయాణం.
* దీపం పథకం కింద ప్రతి ఇంటికి ఏడాదికి మూడు సిలిండర్లు ఉచితం.
* ఆడబిడ్డ నిధి కింద 18 ఏళ్ల నుంచి 59 ఏళ్ల వరకూ ప్రతి మహిళకు నెలకు రూ.1,500 చొప్పున ఏడాదికి రూ.18 వేలు అందజేత.
* నిరుద్యోగ యువతకు నెలకు రూ.3 వేల చొప్పున భృతి.
* యువతకు యేటా 4 లక్షల చొప్పున ఐదేళ్లలో 20 లక్షల ఉద్యోగాలు.
* ప్రతి ఇంటికీ ఉచిత కుళాయి కనెక్షన్‌. స్వచ్ఛమైన తాగునీటి సరఫరా.
* 'తల్లికి వందనం' కింద చదువుకుంటున్న పిల్లలకు ఒక్కొక్కరికి ఏడాదికి రూ.15 వేల చొప్పున ఆర్థిక సాయం.
* రైతులకు ఏడాదికి రూ.20 వేల చొప్పున పెట్టుబడి సాయం.
* ఆక్వారైతులకు రూ.1.50కే యూనిట్‌ విద్యుత్‌.
* పట్టణ ప్రాంతాల్లో రెండు సెంట్లు, గ్రామీణ ప్రాంతాల్లో 3 సెంట్లు ఇంటి జాగా ఇస్తాం.
* ఇప్పటికే మంజూరు చేసిన స్థలాల్లో ఇళ్లు కట్టించి ఇస్తాం. 
* ఇసుక ఉచితం.
* భూ హక్కు చట్టం రద్దు.
* సముద్ర వేట విరామ సమయంలో మత్స్యకారులకు రూ.20 వేల సాయం. వారిక వ్యతిరేకంగా తెచ్చిన 217 జీవో రద్దు.
* బోట్ల మరమ్మతులకు ఆర్థిక సాయం.
* చిరు వ్యాపారులకు వడ్డీలేని రుణాలు.
* బీసీల రక్షణకు ప్రత్యేక చట్టం. 
* వృద్ధాప్య పింఛను నెలకు రూ.4 వేలు, పెంచిన పింఛను ఏప్రిల్‌-2024 నుంచి అమలు.
* బీసీలకు 50 ఏళ్లకు నెలకు రూ.4 వేల పింఛను.
* రాజధానిగా అమరావతి కొనసాగింపు.
* కలలకు రెక్కలు పథకం ద్వారా వడ్డీలేని రుణాలు.
* ఎంఎస్‌ఎంఈలు, అంకుర సంస్థలకు రూ.10లక్షల రాయితీ.
* ఎన్డీయే తెచ్చిన 10 శాతం ఈబీసీ రిజర్వేషన్లు అమలు.
* చట్ట సభల్లో బీసీలకు 33 శాతం రిజర్వేషన్ల కోసం కేంద్రంతో సంప్రదింపులు.
* బీసీ సబ్‌ప్లాన్‌ ద్వారా ఐదేళ్లలో రూ.1.50లక్షల కోట్లు ఖర్చు.
* ఉద్యోగుల సీపీఎస్‌ సమీక్షించి సరైన పరిష్కార మార్గం సూచిస్తాం.
* ఔట్‌సోర్సింగ్‌, అంగన్వాడీ ఉద్యోగులకు న్యాయం చేస్తాం.
* వాలంటీర్లకు రూ.10 వేల గౌరవ వేతనం.
* కాపు సంక్షేమం కోసం రూ.15వేల కోట్లు ఖర్చు చేస్తాం.
* ఆదరణ పథకం కింద ఏటా రూ.5వేల కోట్లతో పరికరాలు.
* అగ్రవర్ణాల్లో ఉండే పేదలకు కూడా న్యాయం. 
* దోబీ ఘాట్లకు 200 యూనిట్ల ఉచిత విద్యుత్‌.
* ఆలయాల్లో పనిచేసే నాయీబ్రాహ్మణులకు రూ.25 వేల గౌరవ వేతనం.
* గీత కార్మికులకు మద్యం దుకాణాల్లో 10 శాతం రిజర్వేషన్లు.
* వడ్డెరలకు క్వారీల్లో 15 శాతం రిజర్వేషన్లు. రాయల్టీ, సీనరేజీల్లో మినహాయింపు.
* స్వర్ణకారుల అభివృద్ధి కోసం ప్రత్యేక కార్పొరేషన్‌.
* ఇబ్బందుల్లో ఉన్న చేనేత, మరమగ్గాలకు 200 యూనిట్ల ఉచిత విద్యుత్‌.sss

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

బీజేపీ రాజ్యాంగ పుస్తకాన్ని విసిరివేయాలనుకుంటోంది.. రాహుల్ గాంధీ ఫైర్