Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

భార్యను ఉద్యోగంలో చేర్పిస్తే తగులుకున్న యువకుడు, ఫోన్ కట్ చేస్తే చంపేసాడు

Advertiesment
murder

ఐవీఆర్

, సోమవారం, 3 మార్చి 2025 (19:16 IST)
ఇటీవలి కాలంలో ఉద్యోగం చేసే చోట మహిళలకు భద్రత కరవవుతోంది. ఉద్యోగం చేస్తున్న మహిళలపై వేధింపులకు పాల్పడుతున్న ఘటనలు అక్కడక్కడ కనబడుతున్నాయి. మరికొన్నిచోట్ల విధుల్లో చేరిన మహిళలను ఏదోవిధంగా లొంగదీసుకుని అక్రమ సంబంధాలకు తెరతీస్తున్నారు. ఇటువంటి సంఘటనే విజయవాడలోని నిడమానూరులో జరిగింది.
 
పూర్తి వివరాలు ఇలా వున్నాయి. ప్రకాశ్, కావ్య దంపతులు నిడమానూరులో నివాసం వుంటున్నారు. కుటుంబం ఆర్థిక పరిస్థితి అంతంతమాత్రంగా వుండటంతో భార్య కావ్యను ప్రముఖ ప్రైవేట్ ఆసుపత్రిలో ఉద్యోగం చేర్పించాడు. అక్కడ కావ్యను చూసి వాసు అనే వ్యక్తి మెల్లగా ఆమెతో స్నేహం చేయడం ప్రారంభించాడు. అది కాస్తా వివాహేతర సంబంధానికి దారి తీసింది. దీనితో ఇద్దరూ గంటలు గంటలు ఫోన్లలో నిత్యం మాట్లాడుకోవడం ప్రారంభించారు. అవకాశం కుదిరినప్పుడల్లా బైటకు వెళ్లి కలుసుకుంటూ ఎంజాయ్ చేయడం చేసేవారు.
 
ఈ వ్యవహారం కాస్తా భర్త ప్రకాశ్ పసిగట్టాడు. ఆమె ఫోన్ లాక్కుని ఉద్యోగం మాన్పించి ఇంట్లో పనులు చూసుకోమని చెప్పేసాడు. మరోవైపు ప్రియుడు వాసు తన ఫోను ద్వారా కావ్యతో మాట్లాడాలని ఎంత ప్రయత్నించినా అది స్విచాఫ్ అని వస్తోంది. ఈ క్రమంలో ఆదివారం నాడు ఇంట్లో ఒంటరిగా వున్న కావ్య దగ్గరకు వచ్చాడు. తనతో ఎందుకు మాట్లాడటం లేదని నిలదీసాడు. తనను కలిసేందుకు ఇకపై రావద్దని ఆమె గట్టిగా చెప్పేయడంతో ఆగ్రహం చెందిన వాసు, ఆమె మెడకి చున్నీ బిగించి హత్య చేసాడు. ఇరుగుపొరుగువారు తెలుసుకుని వచ్చేసరికి నిందితుడు అక్కడి నుంచి పారిపోయాడు. అతడి కోసం పోలీసులు గాలిస్తున్నారు.

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

Amaravati: అందుకే మూడు రాజధానులు.. అమరావతి శ్మశానంలా ఉందని చెప్పిన మాట నిజమే