Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

హైలెట్ అవ్వడానికే కమిట్మెంట్ పేరుతో బయటకు వస్తున్నారు : అన్నపూర్ణమ్మ

Advertiesment
annapurnamma

ఠాగూర్

, ఆదివారం, 16 మార్చి 2025 (12:34 IST)
ఇటీవలికాలంలో చిత్రపరిశ్రమలో క్యాస్టింగ్ కౌచ్ అంశంపై పెను దుమారమే చెలరేగుతుంది. పలువురు హీరోయిన్లు పలువురు హీరోలు, దర్శకులపై లైంగిక వేధింపుల ఆరోపణలు చేస్తున్నారు. ఈ వేధింపుల్లో పలువురు అరెస్టు కూడా అయ్యారు. ఈ నేపథ్యంలో తెలుగు చిత్రపరిశ్రమకు చెందిన సీనియర్ హీరోయిన్ అన్నపూర్ణమ్మ చిత్రపరిశ్రమలో కమిట్మెంట్ గురించి ప్రస్తావించారు. ఈ రోజుల్లో మీడియాలో హైలెట్ అవ్వడానికే కమిట్మెంట్ పేరుతో కొందరు బయటకు వస్తున్నారని ఆమె పేర్కొన్నారు. 
 
ఆ రోజుల్లో విలువలతో కూడిన కమిట్మెంట్లు ఉండేవన్నారు. తాను అప్పట్లో తక్కువ రెమ్యునరేషన్‌కు పని చేశానని, అందువల్ల తనను అలా ఎవరూ అడగలేదన్నారు. కమిట్మెంట్ అనేది మన మనస్సుపై ఆధారపడివుంటుందని చెప్పారు. ఇండస్ట్రీలో బలవంతం అయితే ఎవరూ చేయరన్నారని ఆమె తాజాగా ఓ మీడియా సంస్థకు ఇచ్చిన ఇంటర్వ్యూలో పేర్కొన్నారు. 
 
ఏఆర్ రెహ్మాన్‌కు అస్వస్థత.. ఆస్పత్రిలో అడ్మిట్ : స్పందించిన సోదరి ఫాతిమా
 
ప్రముఖ సంగీత దర్శకుడు ఏఆర్ రెహ్మాన్‌ అస్వస్థతకు లోనయ్యారు. దీంతో ఆయనను చెన్నైలోని అపోలో ఆస్పత్రికి తరలించి అత్యవసర చికిత్సల విభాగంలో ఆడ్మిట్ చేశారు. ఆదివారం ఉదయం ఆయనకు ఉన్నట్టుండి ఛాతిలో నొప్పి రావడంతో అస్వస్థతకు లోనయ్యారు. దీంతో ఆయనను హుటాహుటిన అపోలో ఆస్పత్రికి తరలించారు. అక్కడ ఆయనకు యాంజియో చేసినట్టు సమాచారం. ప్రస్తుతం ఆయన ఆరోగ్యం బాగానే వుందని వైద్యులు చెబుతున్నారు. 
 
రెహ్మాన్ అనారోగ్యంపై ఆయన సోదరి ఫాతిమా రెహ్మాన్ స్పందిస్తూ, వరుస ప్రయాణాలు, పని ఒత్తిడి కారణంగానే రెహ్మాన్ స్వల్ప అస్వస్థతకు లోనయ్యారని, ఆయన ఆరోగ్యం బాగానే ఉందని, ఎవరూ భయపడాల్సిన అవసరం లేదని వెల్లడించారు. 

 

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

ఏఆర్ రెహ్మాన్‌కు అస్వస్థత.. ఆస్పత్రిలో అడ్మిట్ : స్పందించిన సోదరి ఫాతిమా