Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

ఒత్తిడిని తట్టుకోలేక అధిక మాత్రలు తీసుకుంది : కల్పన కుమార్తె (Video)

Advertiesment
kalpana daughter

ఠాగూర్

, బుధవారం, 5 మార్చి 2025 (13:23 IST)
మా అమ్మ, సినీ నేపథ్యగాయని కల్పన సూసైడ్ చేసుకోవాలి అనుకోలేదని ఆమె కుమార్తె అన్నారు. నిద్రమాత్రలు అధిక మోతాదులో తీసుకోవడంలో అస్వస్థతకు గురయ్యారని, మా కుటుంబంలో ఎలాంటి గొడవలు లేవన్నారు. పైగా, తొందరులోనే మళ్లీ ఎప్పటిలాగా మీ ముందుకు వస్తారు కల్పన కూతురు తెలిపారు. 
 
మరోవైపు, కల్పన ఆరోగ్యంపై ఆస్పత్రి వైద్యులు హెల్త్ బులిటెన్‌ విడుదల చేశారు. కల్పన నిలకడగా కల్పన ఆరోగ్య పరిస్థితి నిలకడగా ఉందని తెలిపారు. ఎక్కువ మోతాదులో నిద్ర మాత్రలు తీసుకున్నారని తెలిపారు. మంగళవారం రాత్రి ఆస్పత్రికి రాగానే కల్పనకు కడపును క్లీన్ చేసినట్టు వెల్లడించారు. ఊపిరితిత్తుల్లో నీరు చేరయడంలో వెంటలేటర్‌పై కల్పన చికిత్స పొందుతున్నట్టు వైద్యులు వెల్లడించారు. 
 
కుమార్తెతో గొడవపడి ఆత్మహత్యాయత్నానికి పాల్పడిన సింగర్ కల్పన! 
 
ప్రముఖ సింగర్ కల్పన ఆత్మహత్యకు గల కారణం వెల్లడైంది. కుమార్తెతో గొడవ పడటం వల్లే ఆమె ఆత్మహత్యాయత్నానికి పాల్పడినట్టు సమాచారం. మంగళవారం కుమార్తెకు ఫోన్ చేసి కల్పిన ఆమె హైదరాబాద్ రావాలని కోరింది. అయితే, కేరళలోనే ఉంటానని, హైదరాబాద్ నగరానికి రానని తెగేసి చెప్పినట్టు చెప్పింది. ఈ విషయంపై ఫోనులో తల్లీ కుమార్తెల మధ్య వాగ్వాదం జరిగినట్టు పోలీసుల దర్యాప్తులో వెల్లడైంది. కుమార్తెతో గొడవపడి మనస్తాపం చెందిన కల్పన, మధ్యాహ్నం మూడు గంటల సమయంలో నిద్రమాత్రలు మింగి ఆత్మహత్యాయత్నానికి పాల్పడినట్టు పోలీసులు తెలిపారు. 
 
సాయంత్రం 4.30 గంటలకు చెన్నై నుంచి భర్త ప్రసాద్ ఫోన్ చేయగా కల్పన లిఫ్ట్ చేయలేదు. పలుమార్లు ఫోన్ చేసినా ఎత్తకపోవడంతో విల్లా సెక్రటిరికి కాల్ చేసి చెప్పానని, ఆయన వెళ్లి తలుపు తట్టినా తెరవలేదని ప్రసాద్ వివరించారు. దీంతో పోలీసులకు సమాచారం. అందించగా వారు వచ్చి తలుపులు బద్దలు కొట్ట లోపలకు వెళ్లారని, బెడ్ రూంలో అపస్మారక స్థితిలో ఉన్న కల్పనను హటాహుటిన ఆస్పత్రి తరలించారని ఆయన తెలిపారు. 

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

RC 16: హైదరాబాద్ షూట్ లో రామ్ చరణ్ RC 16 చిత్రంలో శివ రాజ్‌కుమార్ ఎంట్రీ