Webdunia - Bharat's app for daily news and videos

Install App

మిస్టర్ కేటీఆర్.. పోలీసులతో పెట్టుకోవద్దు.. బెండుతీస్తారు : రాజాసింగ్ వార్నింగ్

ఠాగూర్
మంగళవారం, 25 మార్చి 2025 (14:23 IST)
తెలంగాణ రాష్ట్ర సమితి వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్‌కు బీజేపీ నేత, ఎమ్మెల్యే రాజాసింగ్ స్ట్రాంగ్ వార్నింగ్ ఇచ్చారు. పోలీసులతో ఏమాత్రం పెట్టుకోవద్దని, వారి చేతికి చిక్కితే బెండుతీసి వదిలిపెడతారని గుర్తుచేశారు. తెలంగాణ రాష్ట్రంలో ప్రభుత్వం మారి, ముఖ్యమంత్రిగా రేవంత్ రెడ్డి ముఖ్యమంత్రి అయినా వారిని ఏమీ చేయలేదని గుర్తుచేశారు. పోలీసులు రిటైర్ అయినప్పటికీ వారిపై చర్యలు తీసుకుంటామని కేటీఆర్ చేసిన వ్యాఖ్యలు హాస్యాస్పదంగా ఉన్నాయన్నారు. 
 
తాము అధికారంలోకి వచ్చిన తర్వాత రిటైర్ అయిన పోలీస్ అధికారులపై కూడా చర్యలు తీసుకుంటామంటూ కేటీఆర్ చేసిన వ్యాఖ్యలపై రాజాసింగ్ మండిపడ్డారు. పోలీసులతో పెట్టుకోవద్దని ఆయన వార్నింగ్ ఇచ్చారు. బీఆర్ఎస్ ప్రభుత్వ హయాంలో అపుడు ఎంపీగా ఉన్న రేవంత్ రెడ్డిని అరెస్టు చేసి జైలుకు పంపించారని గుర్తుచేశారు. ఇపుడు రేవంత్ రెడ్డి సీఎం అయిన తర్వాత కూడా గతంలో ఆయనను అరెస్టు చేసిన పోలీసులను ఏమీ చేయలేదన్నారు. 
 
ఎవరు అధికారంలో ఉంటే వారు చెప్పిన విధంగా పోలీసులు చట్టపరంగా నడుచుకుంటారని రాజాసింగ్ గుర్తుచేశారు. బీజేపీ కార్యకర్తలపై ఎన్నో కేసులు పెట్టి, జైలుకు పంపించారని, తనపై కూడా పీడీ యాక్ట్ ‍‌పెట్టి జైలుకు పంపించారని అన్నారు. తనను జైలుకు పంపించే సమయంలో సొంత బీజేపీ పార్టీ నేతలో పోలీసులకు మద్దతుగా నిలిచారని గుర్తు చేశారు. ఇప్పటికీ తమ పార్టీలో వారే తనకు వెన్నుపోటు పొడవాలనే ఆలోచనలో ఉన్నారంటూ సొతం పార్టీ నేతలపైనే రాజాసింగ్ సంచలన వ్యాఖ్యలు చేశారు. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

Tamannaah: విజయ్ వర్మ వల్ల బాగా బరువు పెరిగిన తమన్నా.. ఇప్పుడు ఏం చేస్తోందో తెలుసా?

Sreeleela: గుంటూరు కారం తగ్గినా.. ఆషికి 3తో శ్రీలీలకు బాలీవుడ్‌లో మస్తు ఆఫర్లు?

Vishwambhara: చిరంజీవి, మౌని రాయ్‌పై స్పెషల్ సాంగ్.. విశ్వంభర షూటింగ్ ఓవర్

చిత్రపురి కాలనీ స్థలం ఉచితంగా రాలేదు.. ఆరోపణలు చేసే వారికి ఏం తెలుసు?

FISM 2025: సుహానీ షా రికార్డ్: ఉత్తమ మ్యాజిక్ క్రియేటర్ అవార్డు

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

ఆల్‌బుకరా పండ్లతో ఆరోగ్య ప్రయోజనాలు

జామకాయ తింటే ఎన్ని ప్రయోజనాలు, ఏంటి?

Snacks: బరువు తగ్గాలనుకునే మహిళలు హెల్దీ స్నాక్స్ తీసుకోవచ్చు.. ఎలాగంటే?

4 అలవాట్లు వుంటే వెన్నునొప్పి వదలదట, ఏంటవి?

ఒక్క ఏలుక్కాయను రాత్రి తిని చూడండి

తర్వాతి కథనం
Show comments