Webdunia - Bharat's app for daily news and videos

Install App

ఫోనుకు మూడు ముళ్లు వేసిన వరుడు ... ట్రెండ్ సెట్ చేసిన యూత్.. ఎక్కడ?

Webdunia
బుధవారం, 29 ఏప్రియల్ 2020 (08:05 IST)
కరోనా వైరస్ మహమ్మారి దెబ్బకు దేశం యావత్తూ లాక్‌డౌన్‌లో ఉంది. ఫలితంగా ప్రతి ఒక్కరూ తమతమ ఇళ్ళకే పరిమితమయ్యారు. పైగా, ఈ లాక్‌డౌన్ కారణంగా ముందుగా కుదర్చుకున్న అనేక శుభకార్యాలను కూడా వాయిదా వేసుకుంటున్నారు. కానీ, కొంతమంది కోటీశ్వరులు, రాజకీయ నేతలు మాత్రం అనుకున్న సమయానికి అతికొద్ది మంది అతిథుల సమక్షంలో పెళ్లిళ్లు కానిచ్చేస్తున్నారు. 
 
తాజాగా కేరళకు చెందిన ఓ యువకుడు.. ముందుగా పెట్టుకున్న ముహుర్తానికే పెళ్లి చేసుకోవాలని నిర్ణయించుకున్నాడు. దీంతో అతనికి వచ్చిన ఐడియాను వధువు కుటుంబ సభ్యులకు చేరవేశాడు. వారు కూడా అందుకు సమ్మతించడంతో వీడియో కాల్‌ ద్వారా పెళ్లి చేసుకున్నాడు. కానీ, వధువు మెడలో వేయాల్సిన మూడు ముళ్లు మాత్రం మొబైల్ ఫోనుకు కట్టాడు.
 
తాజాగా వెలుగులోకి వచ్చిన ఈ వివరాలను పరిశీలిస్తే, కేరళ రాష్ట్రంలోని కొట్టాయంకు సమీపంలో ఉన్న చెంగనాషేరి ప్రాంతానికి చెందిన శ్రీజిత్ నటేషన్ (30) అనే యువకుడికి పల్లిపడ్ ప్రాంతానికి చెందిన పి.అంజన (28)కు వివాహం చేయాలని ఇరు కుటుంబాల పెద్దలు నిర్ణయించారు. కానీ, లాక్‌డౌన్ కారణంగా వారు అనుకున్న ప్లాన్స్ అన్నీ తిరగబడ్డాయి. దీనికి కారణం వధువు ఉత్తర ప్రదేశ్ రాష్ట్రంలోని లక్నోలోని ఓ ఐటీ కంపెనీలో ఉద్యోగం చేస్తుంటడంతో లాక్‌డౌన్ కారణంగా అక్కడే చిక్కుకునిపోయింది. 
 
అయితే, ముందుగా పెట్టుకున్న ముహుర్తానికే పెళ్లి చేసుకోవాలని నిర్ణయించుకున్నారు. దీంతో వీడియో కాల్ ద్వారా వారిద్దరి వివాహాన్ని పెద్దలు జరిపించేశారు. కానీ, మూడు ముళ్లు మాత్రం... వీడియో కాల్ వధులు కనిపిస్తుంటే... ఆమె మెడలో కట్టినట్టుగా ఫోనుకు వేశాడు. దీనికి సంబంధించిన వీడియో ఒకటి సోషల్ మీడియాలో వైరల్ అయింది. 
 

సంబంధిత వార్తలు

మేనమామకు మేనల్లుడి అరుదైన బహుమతి... ఏంటది?

OMG (ఓ మాంచి ఘోస్ట్) ట్రైలర్ లో నవ్విస్తూ, భయపెట్టిన నందితా శ్వేత

రాజధాని రౌడీ సినిమాకు థియేటర్స్ నుంచి హిట్ రెస్పాన్స్ వస్తోంది: నిర్మాత

రిలీజ్ కు ముందే ట్రెండ్ అవుతున్న ప్రభుత్వ జూనియర్ కళాశాల ట్రైలర్

డబుల్ ఇస్మార్ట్ క్లయిమాక్స్ లో రామ్ యాక్షన్ సీన్ హైలెట్ !

కిడ్నీలు చెడిపోతున్నాయని తెలిపే సంకేతాలు ఇలా వుంటాయి

దోరగా వేయించిన ఉల్లిపాయలు తినడం వల్ల లాభాలు ఏమిటి?

నువ్వుల నూనెతో శరీర మర్దన చేస్తే ఆరోగ్యమేనా?

మెదడు శక్తిని పెంచే ఆహారం ఏంటో తెలుసా?

మీ గుండెను ఆరోగ్యంగా ఉంచుకోవడానికి మీ ఆహారంలో చేర్చుకోవాల్సిన 3 ఆహారాలు

తర్వాతి కథనం
Show comments