Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

పెళ్లి చేయలేదని కన్నవారిని కాటికి కడతేర్చిన కసాయి కొడుకు.. ఎక్కడ?

Advertiesment
పెళ్లి చేయలేదని కన్నవారిని కాటికి కడతేర్చిన కసాయి కొడుకు.. ఎక్కడ?
, శుక్రవారం, 24 ఏప్రియల్ 2020 (11:52 IST)
తమిళనాడు రాష్ట్రంలో దారుణం జరిగింది. పెళ్లి చేయలేదన్న అక్కసుతో కన్న తల్లిదండ్రులనే కాటికి కడతేర్చాడో కసాయి కుమారుడు. ఈ దారుణం రాష్ట్రంలోని తిరువణ్ణామలై జిల్లా తాండ్రాంపట్టు సమీపంలోని కుప్పంతాంగల్ అనే గ్రామంలో జరిగింది. 
 
తాజాగా వెలుగులోకి వచ్చిన ఈ వివరాలను పరిశీలిస్తే, కుప్పంతాంగల్ అనే గ్రామానికి చెందిన గోవిందస్వామి (60) అనే వ్యక్తి వ్యవసాయ కూలీగా జీవనం సాగిస్తుండగా, ఈయనకు భార్య మాంగణి (55), కుమారుడు రామ్‌కుమార్‌తోపాటు మరో ముద్దుకు ఆడ పిల్లలు ఉన్నారు. అయితే, ఆడపిల్లలకు వివాహం చేసిన గోవింద స్వామి... కుమారుడు కూడా పెళ్లి చేసేందుకు సంబంధాలు చూస్తున్నాడు. 
 
అయితే, అతనికి ఎక్కడా సంబంధం కుదరలేదు. దీంతో వివాహం చేయడంలో ఆలస్యమైంది. అదేసమయంలో తనకు వివాహం చేయాలంటూ పదేపదే తల్లిదండ్రులపై ఒత్తిడి తెస్తూ వచ్చాడు. ఈ నేప‌థ్యంలోనే గురువారం తెల్ల‌వారుజామున కూడా పెండ్లి విష‌య‌మై రామ్‌కుమార్‌కు, అత‌ని త‌ల్లిదండ్రుల‌కు మ‌ధ్య గొడ‌వ జ‌రిగింది. 
 
ఈ గొడ‌వ పెద్ద‌ది కావ‌డంతో ఆగ్ర‌హానికిలోనైన రామ్‌కుమార్‌ ఇంట్లో ఉన్న రుబ్బురాయితో తల్లి, తండ్రి త‌ల‌లు ప‌గుల‌గొట్టాడు. అనంత‌రం ఇంటికి తాళం వేసి పారిపోయాడు. గురువారం ఉదయం గోవిందస్వామి కుమార్తె తల్లిదండ్రులను చూసేందుకు రాగా ఇంటికి తాళం వేసి ఉంది. 
 
దీంతో ఆమె కిటికీలో నుంచి చూడగా తల్లిదండ్రులు రక్తపు మడుగులో పడి ఉన్నారు. ఒక్క‌సారిగా భ‌యాందోళ‌న‌కు గురైన ఆమె కేక‌లు వేయ‌డంతో ఇరుగుపొరుగు వ‌చ్చి చూసి పోలీసులకు ఫిర్యాదు చేశారు. 
 
సాత‌నూర్ పోలీసులు వ‌చ్చి కేసు న‌మోదు చేసుకుని మృత‌దేహాల‌ను శవపరీక్షకు తరలించారు. కేసు నమోదు చేసి పరారీలో ఉన్న రామ్ కుమార్ కోసం పోలీసులు గాలిస్తున్నారు. 

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

కరోనా రోగిగా అనుమానించి కొట్టి చంపేశారు.. ఎక్కడ?