Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia
Advertiesment

భార్యల వేధింపులు తట్టుకోలేక పోతున్నా... రక్షించండి.. సీఎంకు లేఖ (Video)

భార్యల వేధింపులు తట్టుకోలేక పోతున్నా... రక్షించండి.. సీఎంకు లేఖ (Video)
, బుధవారం, 22 ఏప్రియల్ 2020 (12:43 IST)
కరోనా వైరస్ కారణంగా దేశ వ్యాప్తంగా లాక్‌డౌన్ అమలవుతోంది. దీంతో పిల్లాపాపలతో సహా ప్రతి ఒక్కరూ తమతమ ఇళ్ళకే పరిమితమయ్యారు. అయితే, ఈ లాక్‌డౌన్ సమయంలో గృహ హింస ఎక్కువైపోయినట్టు పలు సర్వేలు చెబుతున్నాయి. ముఖ్యంగా, మహిళలను భర్తలు తీవ్రంగా వేధిస్తున్నట్టు అనేక ఫిర్యాదులు వస్తున్నాయి. అలాగే, భర్తలను కూడా భార్యలు వేధిస్తున్నారు. 
 
తాజాగా ఓ బాధిత భర్త... భార్య వేధింపుల నుంచి తనను రక్షించాలంటూ ఏకంగా ఓ రాష్ట్ర ముఖ్యమంత్రికి లేఖ రాశారు. ఈ లేఖ ప్రతి ఒక్కరినీ విస్తుపోయేలా చేసింది. ఈ ఘటన తమిళనాడులో జరిగింది. తమిళనాడు పురుషుల రక్షణ సంఘం (భార్యా బాధితుల సంఘం) అధ్యక్షుడు ఈ లేఖను ఆ రాష్ట్ర ముఖ్యమంత్రి ఎడప్పాడి కె.పళనిస్వామికి రాశాడు. 
 
లాక్‌డౌన్సమయంలో ఇళ్ళలో గడపలేక పోతున్నామనీ, భార్య పెట్టే చిత్ర హింసలు భరించలేకపోతున్నట్టు పేర్కొన్నాడు. అందువల్ల తమను ఆదుకునేలా ఓ హెల్ప్‌లైన్ నంబరును ఏర్పాటు చేయాలని ఆ బాధితుడు రాసిన లేఖలో పేర్కొన్నాడు. 
 
కాగా, గృహాలకే పరిమితమైన భర్తలను భార్యల గృహహింస నుంచి తప్పించాలంటూ తమిళనాడు పురుషుల రక్షణ సంఘం అధ్యక్షుడు, న్యాయవాది అరుళ్‌ తమిళన్‌ ఏకంగా తమిళనాడు ముఖ్యమంత్రి ఎడపాడి పళనిస్వామికి వినతిపత్రాన్ని కూడా పంపించారు.  
 
వైరస్ కారణంగా ఇంట్లోనే ఉండటంతో పురుషుల పరిస్థితి దయనీయంగా మారిందని లేఖలో వెల్లడించారు. భార్యలు భౌతికంగా, మానసికంగా పురుషులను ఇబ్బంది పెడుతున్నారంటూ వాపోయారు. ఎంతో మంది మహిళలు సంరక్షణ, సంక్షేమ చట్టాలను చూపించి భర్తలను భయ పెడుతున్నారని పేర్కొన్నారు. 
 
అదేసమయంలో మహిళలను ఇబ్బంది పెడితే, అరెస్ట్ చేస్తామని పోలీసులు హెచ్చరిస్తున్నారని, మగవారి బాధలు తెలుపుకునేందుకు కనీసం ఒక హెల్ప్‌లైన్‌ను ఏర్పాటు చేయాలని అరుళ్‌ తమిళన్‌ ముఖ్యమంత్రిని కోరారు. 
 

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

కరోనా వైరస్ జగమొండిది.. 19 సార్లు పరీక్షల తర్వాత పాజిటివ్... ఎక్కడ?