Webdunia - Bharat's app for daily news and videos

Install App

దేశంలో 1594.. తెలంగాణాలో 6 కరోనా పాజిటివ్ కేసులు

Webdunia
మంగళవారం, 28 ఏప్రియల్ 2020 (20:47 IST)
దేశంలో కొత్తగా మరో 1594 కరోనా పాజిటివ్ కేసులు నమోదైనట్టు కేంద్ర ఆరోగ్య శాఖ వెల్లడించింది. అలాగే, గత 24 గంటల్లో 51 మంది మరణించారని తెలిపారు. కొత్తగా నమోదైన కేసులతో కలుపుకుని మొత్తం కేసుల సంఖ్య 29,974కి చేరాయి. 
 
అలాగే, దేశవ్యాప్తంగా కోలుకున్నవారి సంఖ్య 7027కు పెరగగా.. ప్రాణాలు కోల్పోయిన వారి సంఖ్య 937కు చేరింది. ప్రస్తుతం 22010 మంది బాధితులు వివిధ ఆస్పత్రుల్లో చికిత్స పొందుతున్నారు. అత్యధికంగా మహారాష్ట్ర (8,590), గుజరాత్ ‌(3,548), ఢిల్లీ (3,108), మధ్యప్రదేశ్ ‌(2,368), రాజస్థాన్‌ (2,262) రాష్ట్రాల్లో అత్యధికంగా పాజిటివ్‌ కేసులు వెలుగులోకి వచ్చాయి. 
 
ఇకపోతే, తెలంగాణ రాష్ట్రంలో కొత్తగా కేవలం ఆరు కేసులు మాత్రమే నమోదైనట్టు ఆ రాష్ట్ర వైద్య ఆరోగ్య శాఖామంత్రి ఈటల రాజేందర్ తెలిపారు. కొత్తగా నమోదైన ఆరు కేసులు మొత్తం జీహెచ్‌ఎంసీ పరిధిలోనే నిర్ధారణ అయ్యాయని చెప్పారు. 
 
రాష్ట్రంలో ప్రస్తుతం కరోనా కేసుల సంఖ్య 1,009కి చేరుకున్నాయి. ప్రస్తుతం ఆస్పత్రుల్లో 610 మంది కరోనా బాధితులు చికిత్స పొందుతున్నారు. మంగళవారం తెలంగాణలో 42 మంది డిశ్చార్జి అయ్యారు. ఇప్పటివరకు మొత్తం 25 మంది మృతి చెందారని తెలిపారు. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

Kingdom: యాక్షన్ ప్రోమోతో విజయ్ దేవరకొండ కింగ్‌డమ్ కొత్త అప్ డేట్

మాధవరం గామాన్ని ఆదర్శంగా Mr. సోల్జర్ చిత్రం సిద్ధం

AR Rahman: ఎస్‌జె సూర్య పాన్ ఇండియా ఫిల్మ్ కిల్లర్ కు ఏఆర్ రెహమాన్ మ్యూజిక్

విజయ్ సేతుపతి, సంయుక్త, పూరి జగన్నాథ్ చిత్రం రెగ్యులర్ షూటింగ్ ప్రారంభం

Sridevi: కేజేఆర్ హీరోగా కోర్ట్ ఫేమ్ శ్రీదేవి హీరోయిన్ గా చిత్రం

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

ఆ మొక్క ఆకులో నానో బంగారు కణాలు!!

బరువు తగ్గాలనుకుంటున్నారా? సగ్గుబియ్యం ఓ వరం!

నేరేడు పళ్ల సీజన్... నేరేడు ప్రయోజనాలెన్నో!

Back pain: మహిళలకు వెన్నునొప్పి ఎందుకు వస్తుందో తెలుసా?

చక్కగా కొవ్వును కరిగించే చెక్క

తర్వాతి కథనం
Show comments