Webdunia - Bharat's app for daily news and videos

Install App

శివాజీ నటిస్తున్న సోషియో ఫాంటసీ మూవీ కూర్మనాయకి

డీవీ
శనివారం, 29 జూన్ 2024 (19:52 IST)
Shivaji - Koormanayaki
టాలీవుడ్ లో తెరకెక్కుతున్న మరో భారీ సోషియో ఫాంటసీ మూవీ "కూర్మనాయకి". ఈ చిత్రాన్ని ఎంఎం క్రియేషన్స్, కాలభైరవ ప్రొడక్షన్స్ తో కలిసి రోషన్ ప్రొడక్షన్స్ బ్యానర్ లో కె విజితా రావ్ నిర్మిస్తున్నారు. స్నిగ్ధ మణికాంత్ రెడ్డి, పూజ సహ నిర్మాతలుగా వ్యవహరిస్తున్నారు. ఇండియన్ స్క్రీన్ మీద ఇప్పటిదాకా రానటువంటి కథా కథనాలతో ఈ చిత్రాన్ని రూపొందిస్తున్నారు దర్శకుడు హర్షవర్థన్ కడియాల.
 
వరలక్ష్మీ శరత్ కుమార్, సాయి కుమార్, అతిరారాజ్, వీటీవీ గణేష్ కీ రోల్స్ లో నటిస్తున్న ఈ చిత్రంలో టాలెంటెడ్ యాక్టర్ శివాజీ ఓ ప్రధాన పాత్రను పోషించనున్నారు. ఈ రోజు శివాజీ బర్త్ డే సందర్భంగా ఆయనను పుట్టినరోజు విశెస్ తో ప్రాజెక్ట్ లోకి వెల్కమ్ చేస్తూ స్పెషల్ వీడియో రిలీజ్ చేసింది కూర్మనాయకి టీమ్. శివాజీ ఈ చిత్రంలో పవర్ ఫుల్ రోల్ చేస్తున్నట్లు ఈ వీడియో ద్వారా తెలుస్తోంది.
 
మహావిష్ణు అవతారాల్లోని కూర్మావతారం నేపథ్యంలో భారీ పాన్ ఇండియా మూవీగా "కూర్మనాయకి" చిత్రాన్ని తెరకెక్కిస్తున్నారు దర్శకుడు హర్షవర్థన్ కడియాల. అత్యున్నత సాంకేతిక విలువలతో పాటు హై క్వాలిటీ వీఎఫ్ఎక్స్ షాట్స్ ఈ సినిమాకు ఉపయోగిస్తున్నారు. ప్రస్తుతం రెండు షెడ్యూల్స్ చిత్రీకరణ పూర్తి చేసుకున్నారు. థర్డ్ షెడ్యూల్ లో శివాజీ జాయిన్ అయ్యారు. కూర్మనాయకి సినిమాలో ఓ స్టార్ హీరో నటించనున్నారు. ఆయన ఎవరనేది త్వరలో వెల్లడించనున్నారు.
 
నటీనటులు - వరలక్ష్మీ శరత్ కుమార్, శివాజీ, సాయి కుమార్, అతిరారాజ్, సప్తగిరి, గెటప్ శ్రీను, మహేశ్ విట్టా, సరయు, శత్రు, వీటీవీ గణేషన్, రాజా రవీంద్ర, రాజ్ కృష్ణ, తాగుబోతు రమేష్, తదితరులు

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాజా వార్తలు

యువతికి మత్తు ఇచ్చి మియాపూర్ రోడ్డుపై కదులుతున్న కారులో గ్యాంగ్ రేప్

ఏపీలో మళ్లీ ఉచిత ఇసుక విధానం.. అమలు ఎప్పటి నుంచంటే...

మాజీ సీఎం కేసీఆర్ షాక్.. కాంగ్రెస్ కండువా కప్పుకున్న కేకే!!

జగన్ అక్రమాస్తుల కేసులో కీలక పరిణామం - విచారణలో కదలిక...

నీ అంతు చూస్తా... ఎమ్మెల్యే కొండబాబుకి ద్వారంపూడి అనుచరుడు భళ్లా సూరి వార్నింగ్ (video)

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

అత్యవసర న్యూరోసర్జరీతో 23 ఏళ్ల వ్యక్తిని కాపాడిన సిటిజన్స్ స్పెషాలిటీ హాస్పిటల్

రోజూ తమలపాకు తినవచ్చా?

పరగడుపున తినకూడని 8 పండ్లు ఏమిటి?

డ్రై ఫ్రూట్ హల్వా ఆరోగ్యకరమైనదా?

రక్తదానం చేస్తే కలిగే ఆరోగ్య ప్రయోజనాలు ఏమిటి?

తర్వాతి కథనం
Show comments