Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

శివాజీ గణేశన్ వల్లే ఇండియన్ సినిమా చేశాను : కమల్ హాసన్

Advertiesment
Kamal Haasan   Mouni Roy     Shankar and others

డీవీ

, సోమవారం, 3 జూన్ 2024 (10:49 IST)
Kamal Haasan Mouni Roy Shankar and others
యూనివ‌ర్స‌ల్ స్టార్ క‌మ‌ల్ హాస‌న్‌, సెన్సేష‌న‌ల్ డైరెక్ట‌ర్ శంక‌ర్ కాంబినేష‌న్‌లో అగ్ర నిర్మాణ సంస్థ లైకా ప్రొడ‌క్ష‌న్స్ తో పాటు ప్రముఖ నిర్మాణ సంస్థ రెడ్ జెయింట్ బ్యానర్‌పై సుభాస్క‌ర‌న్ నిర్మించిన భారీ బ‌డ్జెట్ చిత్రం ‘భార‌తీయుడు 2’. ప్రపంచ వ్యాప్తంగా తెలుగు, తమిళ, హిందీ భాషల్లో జూలై 12న ఈ చిత్రం గ్రాండ్ లెవ‌ల్లో రిలీజ్ కానుంది. జూన్ 1న చెన్నైలో సినీ ప్రముఖులు సమక్షంలో ఆడియో వేడుక‌ను ఘ‌నంగా నిర్వ‌హించారు.

ఈ వేడుకకు హీరో శింబు, డైరెక్టర్ లోకేష్ కనకరాజ్, నెల్సన్, నిర్మాత ఏ ఎం రత్నం, ఏసియన్ సినిమాస్ సునీల్ నారంగ్, భరత్ నారంగ్ వంటి వారు ముఖ్య అతిథులుగా విచ్చేశారు. ఈ కార్యక్రమంలో శృతి హాసన్, మౌనీ రాయ్, శంకర్ కూతరు అదితీ శంకర్, కొడుకు అర్జిత్ శంకర్ లైవ్ పర్ఫామెన్స్‌లు అందరినీ ఆకట్టుకున్నాయి. ఇక ఈ ఈవెంట్‌లో..
 
యూనివర్సల్ స్టార్ కమల్ హాసన్ మాట్లాడుతూ.. ‘28 ఏళ్ల క్రితం ఇండియన్ సినిమా టైంలో నేను శివాజీ గణేశన్ గారితో ఓ సినిమా చేయాలి. ఆ టైంలోనే శంకర్ ఇండియన్ కథతో వచ్చారు. రెండు కథలు కొంచెం దగ్గరదగ్గరగా ఉన్నాయి. అదే విషయాన్ని శివాజీ గణేశన్ గారితో చెప్పాను. ‘శంకర్ గారితోనే సినిమా చేయండి.. ఆయన ఆల్రెడీ ఓ సినిమాను తీశారు. మనం ఇప్పటికే ఎన్నో సినిమాలు కలిసి చేశాం’ అని నాతో ఆయన అన్నారు. ఆయన అన్న ఒక్క మాటతో, ఆ నమ్మకంతోనే శంకర్ గారితో ఇండియన్ సినిమా చేశాను. ఆ టైంలో నేను గానీ, శంకర్ గానీ రెమ్యూనరేషన్‌ల గురించి మాట్లాడుకోలేదు. ఏ ఎం రత్నం గారు సినిమాను అద్భుతంగా నిర్మించారు. ఆ టైంలోనే నేను శంకర్ గారితో సీక్వెల్ గురించి మాట్లాడాను. కానీ శంకర్ గారు మాత్రం కథ రెడీగా లేదని అన్నారు. మళ్లీ ఇన్నేళ్లకు అంటే 28 ఏళ్ల తరువాత ఇండియన్ 2 చేశాం. ఈ ప్రాజెక్ట్ ఇక్కడి వరకు వచ్చిందంటే లైకా అధినేత సుభాస్కరన్ గారే కారణం. ఎన్నో సవాళ్లు ఎదురైనా మాకు అండగా నిలిచారు. ఇక్కడి వరకు తీసుకొచ్చారు. ఆయన మాపై పెట్టిన నమ్మకమే ఈ చిత్రం. ఆయన నమ్మకానికి తగ్గట్టుగానే ఈ సినిమాను మేం చేశాం. మా చిత్రానికి సపోర్ట్ చేసిన ఉదయనిధి స్టాలిన్, తమిళ కుమరన్, సెంబగ మూర్తికి థాంక్స్. కాజల్, రకుల్, సిద్దార్థ్, ఎస్ జే సూర్య, సముద్రఖని ఇలా అందరూ అద్భుతమైన పాత్రలు పోషించారు. అనిరుధ్ సంగీతంలో ఎప్పుడూ ఎనర్జీ ఉంటుంది. ఆయన అద్భుతమైన పాటలు ఇచ్చారు. రవి వర్మన్ నాకు అసిస్టెంట్‌ కెమెరామెన్‌గా ఉన్న టైం నుంచీ తెలుసు. ఆయన అద్భుతమైన విజువల్స్ ఇచ్చారు. ఇండియన్ సినిమాకు మేకప్ ఆర్టిస్ట్‌గా పని చేసిన హాలీవుడ్ టెక్నీషియన్‌తో మళ్లీ పని చేయడం ఆనందంగా ఉంది. నాకు సహకరించిన టీం మెంబర్స్ అందరికీ థాంక్స్’ అని అన్నారు.
 
శంకర్ మాట్లాడుతూ.. ‘ఈ రోజే ఫైనల్ మిక్సింగ్ విన్నాను. అనిరుధ్ మ్యాజిక్ చేశాడు. సరికొత్త ఎనర్జీ వచ్చింది. ఆడియెన్స్‌కి కూడా సినిమా చూశాక అదే ఎనర్జీ వస్తుంది. ఇండియన్ టైంలోనే కమల్ హాసన్ గారు సీక్వెల్ తీద్దామని అన్నారు. కానీ అప్పుడు నా వద్ద సరైన కథ లేదు. చాలా ఏళ్లకు పేపర్స్‌లో లంచం వల్ల జరిగే ఘోరాలు, అన్యాయాలు చూసి కథ ఇలా రాద్దామా? అలా రాద్దామా? అని అనుకున్నాను. కానీ అప్పుడు నేను, కమల్ హాసన్ గారు వేర్వేరు ప్రాజెక్టుల్లో ఉండటంతో కుదర్లేదు. 2.ఓ తరువాత ఈ కథ రాసుకున్నాను. అలా ఇండియన్ 2 మొదలైంది. మొదటి రోజు షూటింగ్‌లో ఇండియన్ 2 గెటప్‌లో కమల్ హాసన్ చూసి అంతా షాక్ అయ్యాం. 28 ఏళ్ల క్రితం ఎలా అనిపించిందో.. అప్పుడు కూడా అలాంటి ఫీలింగ్ కలిగింది. ఇండియన్ తాత మంచి వాళ్లకు మంచివాడు.. చెడ్డవాళ్లకు చెడ్డవాడు. ఇలాంటి పాత్రను చేయడం మామూలు విషయం కాదు. ఆయన 360 డిగ్రీ కంటే ఒక డిగ్రీ ఎక్కువగా నటించే సత్తా ఉన్న నటుడు. 70 రోజుల పాటు మేకప్‌తో నటించారు. ఆయనలాంటి యాక్టర్ ఈ ప్రపంచంలోనే లేరు. ఆయనతో ఇండియన్ 2, ఇండియన్ 3 చేయడం ఆనందంగా ఉంది. ఎస్ జే సూర్య డిఫరెంట్ రోల్ చేశారు. సముద్రఖని, సిద్దార్థ్, బాబీ సింహా చక్కటి పాత్రలు పోషించారు. మనోబాలా, వివేక్ గారు మన మధ్య లేరు. కానీ వాళ్ల పాత్రలు మనతో గుర్తుండిపోతాయి. కాజల్, రకుల్ అద్భుతంగా నటించారు. ఇండియన్ 2 వేరే నిర్మాతతో సినిమా చేయాలి. కానీ లైకా నుంచి సుభాస్కరన్ గారు ఫోన్ చేసి ‘నేను నిర్మిస్తాను.. నాకు ఇండియన్ సినిమా అంటే చాలా ఇష్టం. నేనే నిర్మిస్తాను’ అని అన్నారు. మాకు ఈ చిత్ర నిర్మాణ సమయంలో ఎన్నో సవాళ్లు ఎదురయ్యాయి. అయినా ఎంతో సపోర్ట్‌గా నిలిచారు. మాకు అండగా నిలిచిన సుభాస్కరణ్ గారికి థాంక్స్. ముత్తు రాజ్ గారి ఆర్ట్ వర్క్ అద్భుతంగా ఉంటుంది. ఇండియన్ ఎంత పెద్ద హిట్ అయిందో ఇండియన్ 2 అంత కంటే పెద్ద హిట్ అవుతుందని నమ్ముతున్నాను’ అని అన్నారు.
 
శింబు మాట్లాడుతూ.. ‘నాకు ఇండియన్ సినిమా చాలా ఇష్టం. ఈ విషయాన్ని శంకర్ గారితో ఎన్నో సార్లు చెప్పాను. అసలు ఆ సినిమాను ఎన్ని సార్లు చూసి ఉంటానో లెక్క పెట్టలేదు. ఓ కమర్షియల్ సినిమా ఎలా ఉండాలి? అనే దానికి ఇండియన్ సినిమా ది బెస్ట్ ఎగ్జాంపుల్. ఇండియన్ 2 అనౌన్స్మెంట్ తరువాత ఓ అభిమానిగా ఎంతో ఎగ్జైట్ అయ్యాను. కమల్ హాసన్ గారు నాకు గురువు లాంటి వారు. థగ్స్ లైఫ్ సినిమాలో ఆయనతో కలిసి నటిస్తున్నాను. ఇప్పటికీ ఆయన అదే డెడికేషన్‌తో పని చేస్తున్నారు. అందరికీ నచ్చేలా ఇండియన్ 2 ఉండబోతోంది. ఇండియన్ 2, ఇండియన్ 3, గేమ్ చేంజర్ లాంటి భారీ సినిమాలను ఒకే టైంలో తెరకెక్కించడం మామూలు విషయం కాదు. ఇది కేవలం శంకర్ గారి వల్లే సాధ్యం అవుతుంది. లైకా సుభాస్కరన్ గారు సౌత్‌లో భారీ చిత్రాలకు కేరాఫ్ అడ్రస్‌గా నిలుస్తున్నారు. రెడ్ జెయింట్ ఈ చిత్రయూనిట్‌కు ఎంతో సహకారాన్ని అందించారు. అనిరుధ్ పాటలు బాగున్నాయి. ఇండియన్ అనే టైటిల్‌కు తగ్గ నటుడు కేవలం కమల్ హాసన్. ఈ చిత్రం పెద్ద హిట్ అవ్వాలి’ అని అన్నారు.
 
అనిరుధ్ రవిచంద్రన్ మాట్లాడుతూ.. ‘ఇండియన్ 2 సినిమాను చేసే అవకాశం ఇచ్చిన లైకా సుభాస్కరన్ గారికి థాంక్స్. శంకర్ గారు నా ఫేవరెట్ డైరెక్టర్. 3 సినిమా నాకు మొదటి ప్రాజెక్ట్. ఈ మూవీ నాకు 33వ ప్రాజెక్ట్. కమల్ హాసన్ గారితో విక్రమ్ చేశాను.మళ్లీ ఇండియన్ 2 చేశాను. ఇండియన్ సినిమాకు ఏ ఆర్ రెహమాన్ గారు అద్భుతమైన సంగీతాన్ని ఇచ్చారు. శంకర్ గారు ఈ సినిమాకు నా మీద పెట్టుకున్న నమ్మకాన్ని నిలబెట్టుకున్నానని అనుకుంటున్నాను. జూలై 12న ఇండియన్ తాత రికార్డులు బద్దలు కొడుతున్నాడు’ అని అన్నారు.
 
బ్రహ్మానందం మాట్లాడుతూ.. ‘శంకర్ గారు చాలా డెడికేటెడ్ పర్సన్. ఇప్పటికీ అదే డెడికేషన్, సిన్సియార్టీతో సినిమా తీశారు. ఇండియన్ సినిమా ఎంత బాగుంటుందో.. ఈ సీక్వెల్ కూడా అంతే అద్భుతంగా ఉంటుంది. కమల్ హాసన్ గారు ఎంత గొప్ప నటుడన్నది నేను ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు. ఆయనలోని ప్రతీ అణువు నటిస్తుంటుంది. ఆయనతో కలిసి నటించడం గర్వంగా ఉంది. ఇండియన్ 2 పెద్ద విజయాన్ని సాధిస్తుంది’ అని అన్నారు.
 
ఏ ఎం రత్నం మాట్లాడుతూ.. ‘నేను ఎన్నో సినిమాలు చేసినప్పటికీ ఇండియన్ అనేది చాలా ప్రత్యేకం. ఆ సినిమాతో చేసిన జర్నీని ఎప్పటికీ మర్చిపోలేను. 28 ఏళ్ల తరువాత మళ్లీ సీక్వెల్ వస్తుండటం ఏదో తెలియని కొత్త ఫీలింగ్ వస్తోంది. శంకర్ గారు అద్భుతంగా సినిమాలను తెరకెక్కిస్తారు.  ఆయన ప్రతీ సినిమాలో మంచి సందేశాన్ని ఇస్తారు. ఈ మూవీలోనూ మంచి మెసెజ్ ఇస్తారు’ అని అన్నారు.
 
బాబీ సింహా మాట్లాడుతూ.. ‘కమల్ హాసన్ గారు లెజెండరీ యాక్టర్. ఆయనలా రాబోయే తరంలో ఎవరు నటిస్తారు? అన్నది చెప్పలేం. ఊహించలేం. ఇండియన్ 2 కోసం ఆయన పడ్డ కష్టం చూశాను. మేకప్‌తో అన్ని గంటలు సెట్స్ మీద ఎలా ఉన్నారో చూశాను. ఈ వయసులోనూ ఇంత డెడికేషన్‌తో పని చేయడం మామూలు విషయం. ఇండియన్ 2 అందరికీ గర్వకారణంగా నిలుస్తుంది’ అని అన్నారు.
 
గుల్షణ్ మాట్లాడుతూ.. ‘కమల్ హాసన్ గారు ఇండియాలోనే ది బెస్ట్ యాక్టర్. శంకర్ గారు విజనరీ యాక్టర్. లైకా సుభాస్కరన్ గారు భారీ చిత్రాలను నిర్మిస్తున్నారు. ఈ ముగ్గురి కలయికతో రాబోతోన్న ఇండియన్ 2 భారీ హిట్‌ కాబోతోంది’ అని అన్నారు.
 
రకుల్ ప్రీత్ మాట్లాడుతూ.. ‘కమల్ హాసన్ గారి సినిమాలు చూస్తూ పెరిగాను. ఆయన చిత్రంలో నటించడం ఆనందంగా ఉంది. అంత సీనియర్ యాక్టర్ అయి ఉండి కూడా ఈ సినిమా కోసం ఎంతో కష్టపడ్డారు. శంకర్ గారి దర్శకత్వంలో పని చేయడం సంతోషంగా ఉంది. ఇదొక గొప్ప సినిమా కాబోతోంది’ అని అన్నారు.
 
కాజల్ అగర్వాల్ మాట్లాడుతూ.. ‘ఇండియన్ 2లో నటించడం బెస్ట్ ఎక్స్‌పీరియెన్స్. శంకర్ గారి దర్శకత్వంలో పని చేయడం గొప్ప విషయం. నా కల నిజమైనట్టుగా అనిపిస్తోంది. కమల్ హాసన్ గారు నటనకు ఇన్‌స్టిట్యూషన్ లాంటి వ్యక్తి. అలాంటి ఆయనతో నటించడం ఎంతో గొప్పగా అనిపిస్తుంది. నాకు ఈ అవకాశం ఇచ్చిన లైకా సుభాస్కరన్ గారికి థాంక్స్. ఈ చిత్రం గొప్ప విజయాన్ని సాధిస్తుంది’ అని అన్నారు.
 
లోకేష్ కనకరాజ్ మాట్లాడుతూ.. ‘ఇండియన్ 2 అనౌన్స్ చేసినప్పటి నుంచి ఎంతో ఆత్రుతగా ఎదురుచూస్తున్నాను. శంకర్ గారు, కమల్ హాసన్ గారి కాంబోని మళ్లీ చూడాలని వెయిట్ చేస్తున్నాను. బ్రహ్మాండం అనే పదం శంకర్ గారి సినిమాలకే సెట్ అవుతుంది. మాలాంటి యంగ్ డైరెక్టర్స్‌కి ఆయన సినిమాలే బెంచ్ మార్క్. ఈ సినిమా కోసం ఓ ఆడియెన్‌లా ఎదురుచూస్తున్నాను’ అని అన్నారు.
 
డైరెక్టర్ నెల్సన్ మాట్లాడుతూ.. ‘శంకర్ గారు తీసిన ఐ, 2.ఓ సినిమా ఈవెంట్లకు నేనే డైరెక్టర్‌గా పని చేశాను. ఆయన హద్దుల్ని ఆయనే చెరిపేస్తుంటారు. అలాంటి దర్శకులు ఉండటం మనకు గర్వ కారణం. తమిళ్ బిగ్ బాస్‌కు బ్యాక్ ఎండ్‌లో పని చేశాను. ప్రతీ విషయాన్ని ఆయన ఎంతో నిశితంగా గమనిస్తుంటారు. సుభాస్కరన్ వంటి వారు మాత్రమే ఇలాంటి భారీ సినిమాను నిర్మించగలరు. ఈ చిత్రం ఓ చరిత్రను సృష్టించబోతోంద’ని అన్నారు.
 
లైకా ప్రొడక్షన్ హెడ్ తమిళ కుమరన్ మాట్లాడుతూ.. ‘మేకింగ్‌లో సుభాస్కరణ్ ఒక బ్రహ్మాండం.. డైరెక్షన్‌లో శంకర్ గారు ఓ బ్రహ్మండం.. నటనలో కమల్ హాసన్ గారు బ్రహ్మాండం.. మ్యూజిక్‌లో అనిరుధ్ ఒక బ్రహ్మాండం.. ఇంత మంది కలిసి సినిమాను తీస్తే అది ఇంకెంత బ్రహ్మాండంగా ఉంటుందో చెప్పాల్సిన పని లేదు. ఈ సినిమా సమయంలో ఎన్నో సవాళ్లను ఎదుర్కొన్నాం. సుభాస్కరన్ గారు ఇచ్చిన సహాకారంతోనే ఇక్కడి వరకు వచ్చాం. ఉదయనిధి స్టాలిన్ గారు ఇచ్చిన సపోర్ట్ ఎప్పుడూ మర్చిపోలేను. ఇండియన్ కంటే ఇండియన్ 2 గొప్ప విజయాన్ని సాధిస్తుంది’ అని అన్నారు.
 
‘భార‌తీయుడు 2’ మూవీ తెలుగు థియేట్రికల్ హక్కులను ఏషియ‌న్ సురేష్ ఎంట‌ర్‌టైన్మెంట్స్ ఎల్ఎల్‌పి, సీడెడ్ హ‌క్కుల‌ను శ్రీల‌క్ష్మి మూవీస్ సంస్థ‌లు ద‌క్కించుకున్నాయి. సోనీ మ్యూజిక్ ద్వారా ‘భారతీయుడు 2’ పాటలు మార్కెట్లోకి విడుదలవుతున్నాయి.

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

మనమే చిత్రం తల్లితండ్రులకు డెడికేట్ - శతమానం భవతి కంటే డబుల్ హిట్ : శర్వానంద్