Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia
Advertiesment

ట్రెండ్ కు తగినట్లు లేని శబరి సినిమా - రివ్యూ

sabari still

డీవీ

, శుక్రవారం, 3 మే 2024 (15:13 IST)
sabari still
నటీనటులు: వరలక్ష్మి శరత్ కుమార్, గణేష్ వెంకటరామన్, శశాంక్, మైమ్ గోపి, బేబీ వివేక్ష తదితరులు
దర్శకుడు: సినిమాటోగ్రఫీ: రాహుల్ శ్రీవాత్సవ, అనిల్ కాట్జ్, నిర్మాత: మహేంద్ర నాథ్ కూండ్ల, సంగీత దర్శకుడు: గోపి సుందర్
 
ఈ వారం లేడీ ఓరియంటెండ్ కథగా వరలక్ష్మి శరత్ కుమార్ నటించిన శబరి సినిమా విడుదలైంది. తల్లీ, కూతురు బంధం, ప్రేమ పై తీసిన సినిమాగా ముందుగానే చెప్పేశారు. అయితే ఇందులో సస్పెన్స్ థ్రిల్లర్ అంశంముందని చిత్ర యూనిట్ చెప్పింది. మరి వారి చెప్పింది నిజమా కాదా.. అనేది సమీక్ష లోకి వెళ్ళి తెలుసుకుందాం.
 
కథ :
సంజన (వరలక్ష్మి శరత్ కుమార్)  భర్తను వదిలేసి తన ఐదేళ్ళ కుమార్తెను తీసుకుని వైజాగ్ లోని స్నేహితురాలి ఇంటికి వస్తుంది. తన కాళ్ళపై తాను నిలబడతానని శపథం చేస్తుంది. కార్పొరేట్ స్కూల్లో చదివిస్తుంది. అందుకు కార్పొరేట్ ఆఫీస్ లో జుంబో డాన్స్ ఉద్యోగం క్లాస్ మేట్ ఓ లాయర్ ద్వారా సంపాదిస్తుంది. సాఫీగా సాగిపోతున్న ఆమె జీవితంలో తన కుమార్తెను చంపడానికి ఓ సైకో వెంటాడడంతో తప్పించుతిరుగుతూ, కూతురు రియా(బేబీ వివేక్ష)ను కాపాడుకుంటుంది. కానీ ఓ దశలో ఆ సైకోది పై చేయి అవడంతో అతని ఇవ్వమన్న కోటి రూపాయలు ఇస్తానని బయలు దేరుతుంది. అసలు సైకో ఎవరు? శబరి కూతురు వెంట ఎందుకు పడ్డాడు? శబరి భర్త (గణేష్ వెంకటరామన్) కూ ఈమెకు మధ్య గొడవేంటి? అనేదానికి సమాధానమే మిగిలిన సినిమా.
 
సమీక్ష:
శబరి టైటిల్ వినగానే రామాయణంలో శబరి పాత్ర గుర్తుకు వస్తుంది. ఇంచుమించు అలాంటి కథే. కొడుకుకానీ కొడుకు కోసం పరితపించే ఆ శబరి లాగే కూతురు కానీ కూతురు కోసం ఈ శబరి ఏమి చేసింది? అనేది దర్శకుడు తీసుకున్న పాయింట్. అయితే కథను రసవత్తరంగా, ఆకట్టుకొనే విధంగా ఆయన నడపలేకపోయాడు. మొదటి సీన్ నుంచి అంతా తనకు అనుకూంగా సన్నివేశాలు రాసుకున్నాడు అనిపించేలా వున్నాయి.
 
ఓ సైకో చిన్నపిల్ల కోసం ఎందుకు వస్తాడనేది చివరి వరకు తెలీదు. అతను పిల్లలను అమ్మే వ్యక్తిగా దర్శకుడు కొంత గందరగోళం కలిపించాడు. ప్రధాన పాత్ర వరలక్మిదే. ఆమె పాత్ర చుట్టూ కథ తిరుగుతుంది. కొన్ని సన్నివేశాలు సిల్లీగా అనిపిస్తాయి. సీరియల్ కు ఎక్కువ సీనిమాకు తక్కువగా అనిపిస్తాయి. ఇప్పటి ట్రెండ్ కుతగినట్లు దర్శకుడు కథనాన్ని మలచలేకపోయాడు.
 
అసలు విలన్ ఎవరనేది ప్రేక్షకుడికి కూడా అర్థమయ్యేలా వుంటుంది. సస్పెన్స్ అనేది పెద్దగా క్రియేట్ చేయలేకపోయాడు. మూడ్ కు అనుసరించి సంగీతం పర్వాలేదు అన్నట్లుగా వుంటుంది. మైమ్ గోపి, శశాంక్,  గణేష్ వెంకటరామన్  నటన ఓకే. మెయిన్ పాత్రలకు ఓవర్ మేకప్ అనేది కెమెరామెన్ తప్పిదమే.  
 
ఈ సినిమాలో తప్పిదాలు బాగానే వున్నాయి. సినిమా ఆరంభంలోనే స్లో నెరేషన్, నింపాదిగా సన్నివేశాలు వస్తుంటాయి. ప్రీ ఇంటర్వెల్ వరకు మినిమమ్ ఆసక్తి కూడా కలగదు. ఫ్లాష్ బ్యాక్ ఎపిసోడ్స్ ఎమోషన్స్ వర్కౌట్ కాక మరింత నిరుత్సాహ పరుస్తుంది. ఊహాజనితంగా సాగే కథనం, యిట్టె అర్ధం అయ్యిపోయే డైలాగులు సినిమాని మరింత పేలవంగా మార్చివేస్తాయి.  చాలా సీన్స్ లో లాజిక్స్ మిస్ అయ్యేలా వుంటాయి. మరికొన్ని సీన్స్ ఓవర్ డ్రమాటిక్ గా అనిపిస్తాయి ఇంకా కొన్ని రిపీటెడ్ గా అనిపిస్తాయి. దీనితో సినిమాపై ఆసక్తిగా ఉండగా ఉండగా మరింత సన్నగిల్లుతుంది. దర్శకుడు అనీల్ కాట్జ్ పూర్తి స్థాయిలో మెప్పించే విధంగా ఆవిష్కరించలేకపోయారు. చాలా బోరింగ్ అండ్ విసుగు తెప్పించే నరేషన్ తో కథనాన్ని తాను నడిపించారు.  సాగదీతగా ఊహాజనితంగా సాగే స్క్రీన్ ప్లే లు బాగా నిరుత్సాహ పరుస్తాయి. శబరి అనేది కాస్త ఓపిగ్గా చూడాల్సిన సినిమా. 
రేటింగ్ : 2/5

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

ఆ ఒక్కటీ అడక్కు అన్నట్లుగా నరేష్ సినిమా - రివ్యూ