Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia
Advertiesment

సరికొత్త రొమాంటిక్ లవ్ స్టోరిగా సిల్క్ శారీ విడుదల సిద్ధమైంది

Vasudev Rao, Reva Chaudhary, Preeti Goswami

డీవీ

, శనివారం, 18 మే 2024 (17:59 IST)
Vasudev Rao, Reva Chaudhary, Preeti Goswami
వాసుదేవ్ రావు, రీవా చౌదరి, ప్రీతి గోస్వామి హీరో హీరోయిన్లుగా నటిస్తున్న సినిమా "సిల్క్ శారీ". ఈ చిత్రాన్ని చాహత్ బ్యానర్ పై కమలేష్ కుమార్ నిర్మిస్తున్నారు. సరికొత్త రొమాంటిక్ లవ్ స్టోరితో దర్శకుడు టి. నాగేందర్ రూపొందిస్తున్నారు. "సిల్క్ శారీ" సినిమా ఈ నెల 24న గ్రాండ్ థియేట్రికల్ రిలీజ్ కు వస్తోంది. ఈ సందర్భంగా హైదరాబాద్ ప్రసాద్ ల్యాబ్స్ లో సినిమా ప్రీ రిలీజ్ ఈవెంట్ ను ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమంలో నటుడు మురళీ మోహన్, హీరో శ్రీకాంత్, నటులు శివాజీ రాజా, ఉత్తేజ్ తదితరులు అతిథులుగా పాల్గొన్నారు. ఈ సందర్భంగా
 
webdunia
Murali Mohan, Srikanth, Shivaji Raja, Vasudev Rao, Reva Chaudhary, Preeti Goswami
నిర్మాత కమలేష్ కుమార్ మాట్లాడుతూ - "సిల్క్ శారీ" సినిమా ప్రీ రిలీజ్ ఈవెంట్ కు వచ్చిన పెద్దలు మురళీ మోహన్, హీరో శ్రీకాంత్, నటులు శివాజీ రాజా, ఉత్తేజలకు థ్యాంక్స్ చెబుతున్నా. ఒక మంచి మూవీతో టాలీవుడ్ లోకి నిర్మాతగా అడుగుపెట్టడం సంతోషంగా ఉంది. ఇకపైనా మా చాహత్ బ్యానర్ పై రెగ్యులర్ గా సినిమాలు రూపొందిస్తాం. మీ సపోర్ట్ కావాలని కోరుకుంటున్నా. ఈ నెల 24న థియేటర్స్ లోకి వస్తున్న మా "సిల్క్ శారీ" సినిమాను చూసి ఆదరిస్తారని ఆశిస్తున్నాం. అన్నారు.
 
దర్శకుడు టి.నాగేందర్ మాట్లాడుతూ - "సిల్క్ శారీ" సినిమా టైటిల్ అనౌన్స్ మెంట్ నుంచే అందరి దృష్టిని ఆకర్షిస్తోంది. ఇదొక సరికొత్త రొమాంటిక్ లవ్ స్టోరి. అన్ని వర్గాల ప్రేక్షకులకు నచ్చేలా రూపొందించాం. హీరో వాసుదేవ్ రావు కెరీర్ లో గుర్తుండిపోయే మూవీ అవుతుంది. ప్రొడ్యూసర్ గా కమలేష్ గారు ఎంతో సపోర్ట్ చేశారు. మా టీమ్ సహకారంతో సినిమాను ఈ నెల 24న గ్రాండ్ రిలీజ్ కు తీసుకొస్తున్నాం. థియేటర్స్ కు వచ్చి మా మూవీని చూసి సక్సెస్ చేయాలని కోరుతున్నా. అన్నారు.
 
హీరో వాసుదేవ్ రావు మాట్లాడుతూ - హీరో శ్రీకాంత్ గారు మా ఈ‌వెంట్ కు రావడం హ్యాపీగా ఉంది. ఆయన నేను కలిసి ఖడ్గం సినిమాలో నటించాం. ఆ సినిమా నాకు నటుడిగా మంచి గుర్తింపు తీసుకొచ్చింది. ఆయన గెస్ట్ గా వచ్చి బ్లెస్ చేసిన మా "సిల్క్ శారీ" సినిమా కూడా మంచి ఘన విజయం సాధించాలని కోరుకుంటున్నా. నాకు ఈ సినిమాతో మంచి అవకాశం ఇచ్చిన నిర్మాత కమలేష్, దర్శకుడు నాగేందర్ కు థ్యాంక్స్ చెబుతున్నా. అన్నారు.
 
హీరోయిన్ రీవా చౌదరి మాట్లాడుతూ - "సిల్క్ శారీ" సినిమాతో మీ ముందుకు హీరోయిన్ గా వస్తుండటం సంతోషంగా ఉంది. ఈ సినిమాలో నాకు పర్ ఫార్మెన్స్ కు స్కోప్ ఉన్న మంచి క్యారెక్టర్ ఇచ్చారు డైరెక్టర్ గారు. ఆయనకు, ప్రొడ్యూసర్ గారికి థ్యాంక్స్. రొమాంటిక్ లవ్ స్టోరీస్ కు ఎప్పుడూ మీ ఆదరణ ఉంటుంది. అలాగే మా "సిల్క్ శారీ" సినిమాను కూడా ఆదరిస్తారని ఆశిస్తున్నా. అన్నారు.
 
హీరో శ్రీకాంత్ మాట్లాడుతూ - "సిల్క్ శారీ" సినిమా పోస్టర్స్, టీజర్, ట్రైలర్ చాలా ఇంట్రెస్టింగ్ గా ఉంది. వాసుదేవ్ కు ఈ సినిమా మంచి విజయాన్ని ఇవ్వాలని కోరుకుంటున్నా. కొత్తగా ప్రయత్నం చేసే ప్రతి సినిమాకు మన తెలుగు ఆడియెన్స్ సపోర్ట్ ఉంటుంది. అది చిన్న సినిమా అయినా పెద్ద విజయాన్ని అందిస్తారు. ఈ సినిమాకు కూడా అలాంటి సక్సెస్ ఇవ్వాలని కోరుకుంటున్నా. దర్శకుడు నాగేందర్, నిర్మాత కమలేష్, ఇతర టీమ్ కు ఆల్ ది బెస్ట్ చెబుతున్నా. అన్నారు.
 
నటీనటులు: వాసుదేవ్ రావు , రీవా చౌదరి , ప్రీతీ గోస్వామి , ఓంకార్ నాథ్ శ్రీశైలం , కోటేష్ మానవ తదితరులు.

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

ఆనంద్ దేవరకొండ గం..గం..గణేశా ట్రైలర్ సిద్ధం