Webdunia - Bharat's app for daily news and videos

Install App

విజయ్ ఆంటోనీ పొయెటిక్ యాక్షన్ ఫిల్మ్ తుఫాన్ ట్రైలర్ వచ్చేసింది

డీవీ
శనివారం, 29 జూన్ 2024 (19:40 IST)
Tufan latest poster
హీరో విజయ్ ఆంటోనీ నటిస్తున్న లేటెస్ట్ మూవీ "తుఫాన్". ఈ సినిమాను ఇన్ఫినిటీ ఫిల్మ్ వెంచర్స్ బ్యానర్ పై కమల్ బోరా, డి.లలితా, బి. ప్రదీప్, పంకజ్ బోరా నిర్మిస్తున్నారు. ఈ సంస్థ గతంలో విజయ్ ఆంటోనీ హీరోగా రాఘవన్, హత్య సినిమాలను నిర్మించింది. పొయెటిక్ యాక్షన్ ఎంటర్ టైనర్ జానర్  లో "తుఫాన్" సినిమాను రూపొందిస్తున్నారు దర్శకుడు విజయ్ మిల్టన్. "తుఫాన్" సినిమాను జూలైలో గ్రాండ్ థియేట్రికల్ రిలీజ్ కు తీసుకురానున్నారు. ఈ రోజు "తుఫాన్" ట్రైలర్ రిలీజ్ చేశారు.
 
"తుఫాన్" ట్రైలర్ ఆద్యంతం ఆసక్తికరంగా సాగింది. ఎవరి గతంలో లేని, మరొకరి భవితగా మారిన ఓ వ్యక్తి కథ ఇదని ట్రైలర్ లో చెప్పారు. తనకు ఎవరూ తెలియని ఓ ప్రాంతంలోకి వెళ్లి ఎవరూ తనను గుర్తుపట్టకుండా జాగ్రత్తపడుతుంటాడు హీరో విజయ్ ఆంటోనీ. అతన్ని తన చీఫ్ శరత్ కుమార్ గైడ్ చేస్తుంటాడు. హీరోను ఓ కుటుంబం ఆదరిస్తుంది. మరోవైపు పోలీస్ అధికారి  మురళీ శర్మ...హీరో కోసం వేట సాగిస్తుంటాడు. ఇంతకీ ఎవరి గతంలోలేని హీరో గతమేంటి, అతని కోసం పోలీసు వేట ఎందుకు సాగుతోంది. కొత్త ప్రాంతంలో తనను ఆదరించిన కుటుంబం కోసం హీరో ఏం చేశాడు అనేది ట్రైలర్ లో ఇంట్రెస్టింగ్ గా చూపించారు. సినిమాటోగ్రఫీ, బ్యూటిఫుల్ లొకేషన్స్, పవర్ ఫుల్ యాక్షన్ సీక్వెన్సులు, విజయ్ ఆంటోనీ ఇంటెన్స్, ఎమోషనల్ పర్ ఫార్మెన్స్ ఆకట్టుకుంది.
 
ఇప్పటికే "తుఫాన్" సినిమా నుంచి రిలీజైన పాటలకు మంచి రెస్పాన్స్ వస్తోంది. ట్రైలర్ కూడా ఇన్ స్టంట్ గా ఆడియెన్స్ కు రీచ్ అయ్యేలా ఆసక్తికరంగా ఉంది.
 
నటీనటులు - విజయ్ ఆంటోనీ, శరత్ కుమార్, సత్యరాజ్, డాలీ ధనుంజయ, మేఘా ఆకాష్, మురళీ శర్మ, పృథ్వీ అంబర్, శరణ్య పొన్వన్నన్, తలైవాసల్ విజయ్ తదితరులు

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాజా వార్తలు

తిరుమలలో ఏనుగుల గుంపు హల్ చల్ -భయాందోళనలో భక్తులు

ఏపీ ఎన్నికల ఫలితాలు.. రాజకీయాలు వద్దు.. హిమాలయాలకు జగన్?

ఇంటి వద్దకే ఫించన్.. భారతదేశంలో ఇదే తొలిసారి.. చంద్రబాబు అదుర్స్

ఇన్‌స్టాగ్రాంలో పరిచయం, 8వ తరగతి బాలికపై 23 ఏళ్ల యువకుడు అత్యాచారం

హైదరాబాద్ రెస్టారెంట్‌ బిర్యానీలో స్లైడ్ పిన్.. నెట్టింట ఫోటో వైరల్

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

గుమ్మడి విత్తనాలు తింటే 7 ప్రయోజనాలు, ఏంటవి?

ట్రిపుల్ నెగిటివ్ రొమ్ము క్యాన్సర్‌కు విజయవాడలోని అమెరికన్ ఆంకాలజీ ఇన్‌స్టిట్యూట్ విజయవంతంగా చికిత్స

దానిమ్మ కాయలు తింటే ఎన్ని ఆరోగ్య ప్రయోజనాలో తెలుసా?

అలాంటి మగవారికి అశ్వగంధ లేహ్యంతో అద్భుత ప్రయోజనాలు

బరువు తగ్గడం: మీ అర్థరాత్రి ఆకలిని తీర్చడానికి 6 ఆరోగ్యకరమైన స్నాక్స్

తర్వాతి కథనం
Show comments