Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

Chiru: మన శంకరవరప్రసాద్ గారు ముచ్చటగా మూడవ షెడ్యూల్ ని కేరళలో పూర్తి

Advertiesment
Chiru, anil ravipudu at airport

దేవీ

, బుధవారం, 23 జులై 2025 (18:55 IST)
Chiru, anil ravipudu at airport
మెగాస్టార్ చిరంజీవి, బ్లాక్ బస్టర్ హిట్ మెషీన్ అనిల్ రావిపూడి మోస్ట్ అవైటెడ్ హోల్సమ్ ఎంటర్‌టైనర్ #Mega157 షూటింగ్ శరవేగంగా జరుగుతోంది. షైన్ స్క్రీన్స్ బ్యానర్‌పై సాహు గారపాటి, సుష్మిత కొణిదెల గోల్డ్ బాక్స్ ఎంటర్‌టైన్‌మెంట్స్‌తో కలిసి నిర్మిస్తున్న ఈ చిత్రాన్ని శ్రీమతి అర్చన సమర్పిస్తున్నారు.

తాజాగా యూనిట్ కేరళలో మూడవ షెడ్యూల్‌ పూర్తి చేసింది. ఈ షెడ్యూల్ లో బ్యూటీఫుల్ సాంగ్ తో పాటు కీలకమైన టాకీ పోర్షన్స్ ని షూట్ చేశారు. సాంగ్, సీన్స్ చాలా అద్భుతంగా వచ్చాయి.
 
మూడవ షెడ్యూల్‌ పూర్తి చేసుకున్న సందర్భంగా మెగాస్టార్ చిరంజీవి, దర్శకుడు అనిల్ రావిపూడి ప్రైవేట్ జెట్ ముందు నిలబడి చిరునవ్వుతో కనిపించిన ఫోటోని మేకర్స్ షేర్ చేశారు.
 
ఇటీవల రిలీజ్ చేసిన ప్రోమోలో చిరంజీవి వింటేజ్, స్టైలిష్ లుక్‌లో అలరించారు. దర్శకుడు అనిల్ రావిపూడి స్టైల్‌కి తగ్గట్టుగా షూటింగ్ జెట్ స్పీడుగా, ప్లాన్‌డ్‌గా జరుగుతోంది. సినిమా మంచి నస్టాల్జిక్ ఫీల్‌తో ఉండబోతోంది. ఈ చిత్రానికి టాప్ టెక్నికల్ టీం పని చేస్తోంది. సమీర్ రెడ్డి సినిమాటోగ్రాఫర్. భీమ్స్ సిసిరోలియో మ్యూజిక్ అందిస్తున్నారు. తమ్మిరాజు ఎడిటర్. ఎస్. కృష్ణ, జి. ఆది నారాయణ కో రైటర్స్. ఎస్. కృష్ణ ఎగ్జిక్యూటివ్ నిర్మాతగా వ్యవహరిస్తున్నారు. ఏఎస్ ప్రకాష్ ఆర్ట్ డైరెక్టర్. Mega157 మూవీ 2026 సంక్రాంతికి విడుదల కానుంది.
 
నటీనటులు: మెగాస్టార్ చిరంజీవి, నయనతార, వీటీవీ గణేష్
సాంకేతిక సిబ్బంది: రచన, దర్శకత్వం - అనిల్ రావిపూడి, నిర్మాతలు - సాహు గారపాటి & సుస్మిత కొణిదెల, బ్యానర్లు: షైన్ స్క్రీన్స్ & గోల్డ్ బాక్స్ ఎంటర్టైన్మెంట్స్, సమర్పణ - శ్రీమతి అర్చన, సంగీతం - భీమ్స్ సిసిరోలియో

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

Vijay Antony: భద్రకాళి కొత్త పొలిటికల్ జానర్ మూవీ : విజయ్ ఆంటోనీ